Published : Mar 07, 2025, 01:10 PM ISTUpdated : Mar 09, 2025, 09:04 AM IST
Most Expensive Indian Films : ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకూ రిలీజ్ అయిన కాస్ట్లీ సినిమాలు ఎన్ని, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు ఎన్ని హిట్ అయ్యాయి. ఏసినిమాకు ఎంత బడ్జెట్ పెట్టారు, ఏ ఇయర్ లో రిలీజ్ అయ్యింది. ఇండియాన్ కాస్ట్లీ సినిమాల లిస్ట్ మీకోసం
Kalki 2898 AD first position in Most Expensive Indian Films
Most Expensive Indian Films : ఒక సినిమా నిర్మాణానికి, రిలీజ్ చేయడానికి చాలా విషయాలు ప్రముఖంగా ఉంటాయి. అందులో మెయిన్ రోల్ పోషించేది బడ్జెట్. కోట్లు, లక్షలు పెట్టి నిర్మాతలు సినిమాలు రిలీజ్ చేస్తారు. ఒక్కో కాలంలో సినిమా తీసే బడ్జెట్ మారుతూ ఉంటుంది. కొత్త ట్రెండ్స్, టెక్నాలజీ, కథ చెప్పే విధానం ద్వారా ఇండియన్ సినిమా డెవలప్ అవుతూ వస్తోందనడంలో డౌట్ లేదు. అందుకే బడ్జెట్లు కూడా మారుతాయి.
మొదట్లో కొన్ని లక్షలు పెట్టి సినిమాలు తీసేవాళ్ళు. కానీ టెక్నాలజీ, నిర్మాణ స్థాయి, ప్రేక్షకుల అంచనాలు పెరగడంతో బడ్జెట్ కూడా పెరిగింది. దీంతో పెద్ద సెట్స్ వేసి భారీగా డబ్బులు పెట్టడం మొదలుపెట్టారు. 1970ల్లో వచ్చిన షోలే సినిమా 3 కోట్లతో తీశారు. అది అప్పట్లో చాలా కాస్ట్లీ ఇండియన్ మూవీ.
ఆ తర్వాత కాలంలో వచ్చిన రోబో, రావణ్, బాహుబలి, 2.0, ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడీ సినిమాలు ఇండియాలో టాప్ కాస్ట్లీ మూవీస్ అయ్యాయి. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత టాప్ కాస్ట్లీ ఇండియన్ మూవీస్ లిస్ట్ బయటకు వచ్చింది. కోయ్ మోయ్ ఈ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇంతకీ ఇండియాలో కాస్ట్లీ సినిమాలు లిస్ట్ ఏ భాష లో ఎన్ని ఉన్నాయి చూస్తే..?
చాలా ఖరీదైన ఇండియన్ సినిమాల లిస్ట్ చూసుకుంటే..ముందుగా మన టాలీవుడ్ ను తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు భారీ బడ్జెట్ తో తీస్తున్న ఇండస్ట్రీ టాలీవుడ్ మాత్రమే. బాలీవుడ్ కూడా మనతో పోటీ పడలేకపోతోంది. హాలీవుడ్ లో కూడా ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ అని చెప్పుకునే విధంగా మనం డెవలప్ అయ్యాం ఇదంతా రాజమౌళి పుణ్యమని చెప్పుకోవచ్చు. ఇక టాలీవుడ్ లో కాస్ట్రీ సినిమాల లిస్ట్ చూసుకుంటే..
అసలు పాన్ ఇండియా సినిమాలు స్టార్ట్ అయ్యిందే తమిళంల, శంకర్ డైరెక్షన్ లో వచ్చిన సినిమాలన్నీ ఇండియా వైడ్ గా భారీ రెస్పాన్స్ సాధించేవి. కాని ఇప్పుడు శంకర్ టైమ్ నడవడంలేదు.
రోబో (2010) – 132 కోట్లు
2.0 (2018) – 400–600 కోట్లు
గజిని (2008) – 65 కోట్లు
దశావతారం (2008) – 60 కోట్లు
శివాజీ ది బాస్ (2007) – 60 కోట్లు
జీన్స్ (1998) – 20 కోట్లు
ఇండియన్ (1996) – 15 కోట్లు
అమితాబ్ సినిమాలకు బాగా డిమాండ్ ఉన్న టైమ్ లో.. బాలీవుడ్ లో ఆకాలంతో తీసిన భారీ బడ్జెట్ సినిమా అంటే షోలే పేరు చెప్పవచ్చు. 75 లోనే 3 కోట్ల బడ్జెట్ తో సినిమా చేసి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అమితాబ్. ఇక అంతకంటే ముందు కాలంలో భారీ బడ్జెట్ అంటే 75 వేలు ఎక్కువ,.. సతీ సావిత్రి సినిమాకు ఈ బడ్జెట్ ను ఉపయోగించారు.