మూకుత్తి అమ్మన్ సినిమాకు నయనతారనే బలం. మొదటి భాగం తీసినప్పుడు కూడా ఆమె ఉపవాసం ఉండి నటించింది. అదేవిధంగా, నయనతార రెండో భాగం పూజకు వారం ముందు తన పిల్లలతో కలిసి ఉపవాసం ప్రారంభించిందని ఇసారి గణేష్ చెప్పారు. సుందర్ సి దర్శకత్వంలో నటి నయనతార నటిస్తున్న తొలి చిత్రం కావడంతో ఇప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
కొందరు నటీనటులు దేవుళ్ళ పాత్రలు వేస్తున్నప్పుడు ఉపవాసాలు ఉండడం, దీక్షలు చేయడం చూశాం. అన్నమయ్య చిత్రంలో నటించినన్ని రోజులు సుమన్ నేలపైనే పడుకుంటూ, మాల వేసుకుని దీక్ష కొనసాగించారట. ఇప్పుడు నయనతార అమ్మవారి పాత్రలో నటిస్తుండడంతో ఆమె కూడా ఉపవాసం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.