నిధి అగర్వాల్ ఒకప్పుడు సెన్సేషన్‌గా మారింది. `ఇస్మార్ట్ శంకర్` మూవీతో ఆమె ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కనిపించకుండా పోయింది. తాజాగా మళ్లీ ఇప్పుడు సందడి చేస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి. ఇవి భారీ పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం.
ఇటీవల నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ఛాట్ చేసింది. అందులో ఫ్యాన్స్ తో మాట్లాడుతూ తాను `అందరికి నమస్కారం` అని చెప్పే బ్యాచ్ కాదు అంటూ కామెంట్ చేసింది. ఇదే ఇప్పుడు ఆమె కొంప ముంచింది. కాజల్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమవుతుంది. మరి దీనికి, కాజల్‌కి లింకేంటంటే.. సాధారణంగా కాజల్ ఎప్పుడూ మాట్లాడినా తెలుగులో అందరికి నమస్కారం అనే పదం మాత్రమే వాడుతుంది. మిగిలినది ఇంగ్లీష్‌లో చెబుతుంది. ఆ పదాన్ని ఆమె ఎక్కడైనా వాడుతుంటుంది. వాడే విధానం కూడా కాస్త భిన్నంగా ఉంటుంది. అదే నోటెడ్ అవుతుంటుంది.
Kajal Aggarwal
అయితే నిధి అగర్వాల్ కూడా అదే పదం వాడుతూ తాను అలాంటి బ్యాచ్ కాదు అని చెప్పడంతో కాజల్ ని ఉద్దేశించే ఆమె ఈ కామెంట్ చేసిందని, కాజల్‌పై సెటైర్ వేసిందని భావించిన ఫ్యాన్స్ నిధి అగర్వాల్‌పై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయం నిధి అగర్వాల్ దృష్టికి తీసుకొచ్చాడు యాంకర్ నిఖిల్. దీనికి ఆమె క్లారిటీ ఇచ్చింది. తాను చెప్పిన ఉద్దేశ్యం ఏంటో వివరించింది.
తాను సోషల్ మీడియాలో చాట్ చేస్తున్నాను. ఆ సమయంలో మీకు తెలుగు వచ్చా? తెలుగులో మాట్లాడండి అని అడిగారట. దానికి నిధి అగర్వాల్ తనకు తెలుగు తెలుసు అని, కానీ కేవలం నేను `అందరికి నమస్కారం` బ్యాచ్ కాదు. ఇది నా సెల్ఫ్‌గా చెప్పిన పదం. ఎవరినీ ఉద్దేశించి అన్నది కాదంటూ వెల్లడించింది నిధి అగర్వాల్. 15, 20ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. ఎన్నో సినిమాలు చేశారు, వారిని ఎందుకు అంటాను. ఇంకా వారికే నా మద్దతు ఉంటుంది అని చెప్పింది. మొత్తానికి కాజల్ ఫ్యాన్స్ ని కూల్ చేసే ప్రయత్నం చేసింది.