మరి బాగా తీసిన సినిమా ఫలితం ఇలా ఎందుకు వచ్చింది? శంకర్ కి ఇంకా టైమ్ ఇవ్వలేదా? రిలీజ్ ఒత్తిడి చేశారా? ఎడిటింగ్‌కి టైమ్ ఇవ్వలేదా? అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిర్మాత దిల్ రాజునే శంకర్‌కి సంబంధం లేకుండా ఎడిటింగ్ చేయించారనే పుకారు ఉంది. మరి అది నిజంగానే జరిగిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
శంకర్ చెప్పినట్టు ఇంకాస్త టైమ్ ఇస్తే బాగా ఎడిటింగ్ చేసేవారా? అనేది ఆసక్తికరంగా మారింది. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. సినిమా ద్వారా డిస్ట్రిబ్యూటర్లకి, నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎందుకంటే సినిమా బడ్జెట్ రూ.450కోట్లు, బిజినెస్ సుమారు రెండువందల కోట్లు అంటే, ఇది నాలుగు వందల కోట్ల గ్రాస్ రాబట్టాలి. అది సాధ్యమేనా? అనేది చూడాలి.