Jr NTR యమదొంగ సినిమాలో యముడు పాత్ర మోహన్ బాబుది కాదా..? మిస్ అయిన నటుడు ఎవరు..?

First Published | Aug 20, 2024, 4:45 PM IST

వెండితెరపై హిట్ అయిన కొన్నిపాత్రలు వారివి కాదు.. ఎవరో చేయాల్సినవి..ఇంకెవరో  చేసి సక్సెస్ ను తమఖాతాలో వేసుకుంటుంటారు. అలాంటిపాత్రే యమదొంగ సినిమాలో మోహాన్ బాబు చేసిన యముడు పాత్ర..? 

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రియమణి, మమతా మోహాన్ దాస్ హీరోయిన్లుగా.. రాజమౌళి సృష్టించిన అద్భుతమైన సినిమా యమదొంగ. ఈమూవీలో దొంగగా ఎన్టీఆర్ నటన అద్బుతమనే చెప్పాలి. సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ అనేది ఎరుగని దర్శకుడు రాజమౌళి చేసిన హిట్ సినిమా ఇది. ఈమూవీలో ఎన్టీఆర్ తో పాటు అంతే ఇంపార్టెంన్స్ ఉన్న పాత్ర యముడి పాత్ర. ఈ క్యారెక్టర్ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటన అమోఘం. 

All So Read: రానా వల్లే చదువుకోలేకపోయా.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్..?

అందరు యముళ్ళు యముండా అంటే.. మోహన్ బాబు చేత మాత్రం బంబోల జంబ అనిపించాడు రాజమౌళి. సినిమాకు ప్రాణం పోసిన పాత్రల్లో ఎన్టీఆర్,మోహన్ బాబు ఇద్దరిదే మేజర్ అనిచెప్పాలి. అయితే 2007 అగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే సందర్భంతగా రిలీజ్అయిన ఈమూవీ అప్పట్లో అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. బాక్సా ఫీస్ దగ్గర తిరుగు లేని విజయాన్ని అందుకుంది. 18 కోట్లబడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తే. 30 కోట్లకుపైనే లాభాలు తీసుకువచ్చింది యమదొంగ . 
 

All So Read: మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఆ సినిమాల్లో ఈ హీరోలకు టెంపర్ ఎక్కువ...

Latest Videos


ఇక ఈమూవీలో మోహన్ బాబు అద్భుతంగా చేసిన యముడి పాత్ర.. అసలు ఆయన చేయాల్సింది కాదట. యముడిగా రాజమౌళి ముందు వేరే నటుడిని అనుకున్నాడట. ఆయన ఎవరో కాదు.. నవరస నటసార్వభౌమ కైకాల సత్యనారాయణ చేత ఈ పాత్ర చేయించాలి అని అనుకున్నాడట రాజమౌళి. యముడిగా కైకాల కనిపిస్తే.. ఆడియస్స్ లో ఉత్సాహం పొంగి పొర్లుతుంది అని జక్కన్న అనుకున్నాడట. 
 

మహేష్ బాబు సహా.. 12 మంది హీరోలు రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సూర్య..

అయితే ఈ పాత్ర చేయాలని కైకాలను సంప్రదించారట కూడా. అయితే కొన్ని కారణాల వల్ల కైకాల ఈసినిమాను వదులుకోవలసి వచ్చినట్టు తెలుస్తోంది. అది కూడా రెమ్యూనరేషన్ విషయంలోనే ఈసినిమాను మిస్ అయ్యారట కైకాల. ఈ విషయం కైకాల ఓ టైమ్ లో చెప్పినట్టు తెలుస్తోంది. ఆతరువాత మోహన్ బాబును తీసుకోవడం.. ఈ క్యారెక్టర్ అనుకున్నదానికంటే అద్భుతంగా రావడంతో.. రాజమౌళి ఎంతో సంతోషించాడట. 

అయితే కైకాలను తీసుకోవాలి అనుకోవడానికి కూడా కారణాలు లేకపోలేదు. తెలుగువారికి యముడు అంటే వెంటనే గుర్తుకు వచ్చేది కైకాలనే. ఆయన యముడిగా తెరపై కనిపిస్తే.. పూలు చల్లేవారట అభిమానులు. యముండా అనే డైలాగ్ ఆయన కంటే ఇంకెవరు చెప్పినా అంత సూట్ అవ్వదని చాలామంది అంటుంటారు. కాని యమదొంగలో మాత్రం ఆయన ఈ పాత్ర మిస్ అయ్యారు. మరి ఈ క్యారెక్టర్ నిజంగా కైకాల చేసుంటే ఎలా ఉండేది ఒక్క సారి ఊహించుకోండి. 

click me!