Kaikala Satyanarayana: ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి స్టార్ హీరోలకు సమానమైన ఇమేజ్ తో వెలుగు వెలిగిన సీనియర్ నటుడు దివంగత కైకాల సత్యనారాయణ. దాదాపు 60 ఏళ్ల సుధీర్ఘ ఫిల్మ్ కెరీర్ లో కైకాల సంపాదించిన ఆస్తులు ఎంత? ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో తెలుసా?
ఎన్టీఆర్, ఏఎన్నార్ తరువాత అంతటి కీర్తి సంపాదించిన నటుడు కైకాల సత్యనారాయణ. మూడు తరాల హీరోలకు ఆయన విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తండ్రిగా, తాతగా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. సినిమా రంగంలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగి, వందలాది చిత్రాల్లో నటించడం సామాన్యమైన విషయం కాదు. అయితే, ఆ స్థాయిలో విజయాన్ని సాధించినప్పటికీ, ఎంతో మంది నటులు ఆడంబరాలకు దూరంగా, ఎంతో సాదాసీదా జీవితాన్ని గడుపుతుంటారు. అలాంటి నటులలో కైకాల కూడా ఒకరు. ఈ సీనియర్ నటుడు గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన జీవిత అనుభవాలు, ఆస్తుల వివరాలతో పాటు వ్యక్తిగత జీవన విధానం గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాడు. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే.
25
నవరస నటసార్వభౌముడు...
టాలీవుడ్ లో 'నవరస నటసార్వభౌముడన్నపేరున్న దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ. తన 60 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో 800కు పైగా చిత్రాల్లో నటించి, ప్రతి పాత్రలోనూ అద్భుత నటనతో ప్రేక్షకులను అలరించారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ నటుడిగా మాత్రమే కాదు.. ధుర్యోదనుడు, యమధర్మరాజు లాంటి పాత్రలకు కూడా ప్రాణం పోశాడు కైకాల. తెలుగు తెరకు ఆయన చిరస్మరణీయమైన సేవలు అందించారు.
35
కైకాల సినీ ప్రయాణం - 800 సినిమాలు
1959లో 'సిపాయి కూతురు' చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కైకాల.. ప్రారంభంలో సీనియర్ ఎన్టీఆర్ గారికి డూప్‌గా చేస్తూ క్రమంగా నటుడిగా గుర్తింపు పొందారు. దాదాపు ఆరు దబ్దాల పాటు పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో 800కు పైగా పాత్రలు పోషించారు. 'రామ ఫిలిమ్స్' బ్యానర్‌పై 'బంగారు కుటుంబం' వంటి అవార్డు సాధించిన సినిమాలను నిర్మించి నిర్మాతగా కూడా విజయం సాధించారు. చలనచిత్ర రంగానికి ఆయన ఇంత సేవ చేసినా కానీ.. చివరి వరకూ.. కనీసం పద్మశ్రీకి కూడా నోచుకోలేదు కైకాల. ఒక నంది అవార్డు తప్పించి.. ఆయన ఖాతాలో మరే అవార్డు లేకపోవడం విచిత్రం.
దాదాపు 800 సినిమాలు చేసిన కైకాల.. కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. కానీ ఆయన లైఫ్ స్టైల్ మాత్రం చాలా సింపుల్ గా ఉంటుంది. కైకాలకు మద్రాస్‌లో (చెన్నై) రెండు ఇళ్లు ఉండేవి, వాటిని తన ఇద్దరు కుమార్తెలకు వివాహ సమయంలో ఇచ్చారు. హైదరాబాద్‌లో నిర్మించిన ఒక పెద్ద భవనాన్ని 'కార్పొరేషన్ బ్యాంక్'కు లీజుకు ఇచ్చారు. మరోక ఇంట్లో కైకాల నివాసం ఉండేవారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తన సంపాదనతో పిల్లలందరినీ ఉన్నతంగా చదివించి ఇంజనీర్లుగా తీర్చిదిద్దారు. పిల్లలందరూ చెన్నై, బెంగళూరు, అమెరికా వంటి ప్రాంతాల్లో తమ సొంత వ్యాపారాలు, ఉద్యోగాలలో స్థిరపడ్డారు. ఈ విషయాలను ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
55
తృప్తిని మించిన హాయి లేదు
60 ఏళ్ల సినిమా జీవితంలో కైకాల ఆడంబరాలకు, విలాసవంతమైన జీవితానికి ("Luxurious Living") కి ఎప్పుడూ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. "నాకు సింపుల్ లివింగ్, కంఫర్టబుల్ లివింగ్ చాలు. ఆడంబరాలు అక్కర్లేదు" అని చెపుతుండేవాడు. మనుషుల అత్యాశ ఎలా ఉంటుందంటే.. "10 కోట్లు సంపాదించాలనుకున్న వాడు 100 కోట్లు సంపాదించినా దాంతో ఏం చేసుకుంటాడు? కడుపు నిండా తిని నిద్రపోవడానికి అంత అవసరం లేదు కదా" అని కైకాల అన్నారు. పిల్లలకు సంపాదించిన కోట్లకు కోట్లు ఇచ్చేస్తే వారు స్వయంకృషితో ఎదిగే అవకాశాన్ని కోల్పోతారని, అందుకే పిల్లలకు కావలసిన విద్యను మాత్రమే ఇచ్చి వారి స్వంత కాళ్లపై నిలబడేలా చేశానని స్పష్టం చేశారు.
కైకాల సత్యనారాయణ జీవితం కేవలం ఒక నటుడి విజయగాథ మాత్రమే కాదు.. తృప్తి, కష్టపడే తత్వం, క్రమశిక్షణతో కూడిన జీవిత పాఠం. కోట్ల ఆస్తి కంటే కష్టపడే మనస్తత్వం, ఆడంబరాలు లేని సాదాసీదా జీవన విధానమే మనిషికి నిజమైన తృప్తిని ఇస్తాయని ఆయన ఫాలో అయ్యి.. నిరూపించారు. ఫిల్మ్ఇండస్ట్రీ హిస్టరీలో తరకంటూ ప్రత్యేకమైన పేజీలు సాధించిన 2022 సంవత్సరం కైకాల.. 87 ఏళ్ల వయసులో వృద్దాప్య సమస్యలతో కన్నుమూశారు.