Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే

Published : Sep 13, 2026, 11:56 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఆదివారం ఎపిసోడ్‌ మొత్తం దేబ్జానీ చుట్టూ తిరిగింది. అంతా ఆమె హార్ట్ కి దగ్గరైన పర్సన్‌ అని చెప్పారు. మరోవైపు ఆమె ముఖేష్‌ గౌడ ఇష్టమని చెప్పడం విశేషం.

PREV
15
వీకెండ్‌లో నో ఎలిమినేషన్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఆదివారం ఎపిసోడ్‌ ఆసక్తికరంగా సాగింది. మిడ్‌ వీక్ లో ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్‌ కావడంతో ఇప్పుడు ఆదివారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారు? అసలు ఎలిమినేషన్‌ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కానీ ఉన్న కంటెస్టెంట్లు అంతా హౌజ్‌మేట్స్ అయ్యారు. ఎవరూ ఎలిమినేట్ కాలేదు. దీంతో ప్రస్తుతం హౌజ్‌లో 14 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. దేబ్జానీ, వంశీ, కృష్ణుడు, త్రిగుణ్‌, వర్షిణి సౌందరాజన్‌, రాం ప్రసాద్‌, నరేష్‌, సుధీర్‌ రెడ్డి, ముఖేష్‌ గౌడ, షాలిని, రోహిత్‌, అమన్‌, సింగర్‌ జాన్సీ, సృష్టి ఉన్నారు.

25
హార్ట్ కి దగ్గరైన, హార్ట్ కి దూరమైన వాళ్లు

ఇక ఆదివారం ఎపిసోడ్‌లో మొదట నాగార్జున.. మీకు హార్ట్ కి దగ్గరగా ఉన్నవాళ్లు, హార్ట్ కి దూరంగా ఉన్నవాళ్లు ఎవరో తెలిపాలన్నారు. దీనికి కంటెస్టెంట్లు ఒక్కొక్కరు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. అమన్‌.. తనకు సృష్టి దగ్గరైందని, రాం ప్రసాద్‌ ఇంకా దగ్గర కాలేదని, తాను దగ్గర కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. రాం ప్రసాద్‌.. దేబ్జానీ తనకు దగ్గరైందని, అందమైన స్వార్థం ఉంటుందని, అది నచ్చిందని తెలిపాడు. అన్న ఫీలింగ్‌తో ఉంటుందన్నాడు. దూరం.. శాలిని అని చెప్పాడు. కృష్ణుడు.. దేబ్జానీ మనసుకి దగ్గరైందని, తనది క్యూట్‌ హార్ట్ అని చెప్పాడు. అంతేకాదు తనకు బ్రెయిన్‌ లెస్‌ అని, బ్రెయిన్‌తో గేమ్‌ ఆడాలని చెప్పిందన్నాడు. హార్ట్ కి దూరంగా ఉన్నది రోహిత్‌ అని, తనని వీక్‌ పర్సన్‌గా భావిస్తున్నట్టు చెప్పాడు. వీక్ పర్సన్‌ ఎవరూ ఉండరని కౌంటర్‌ ఇచ్చాడు. ముఖేష్‌ గౌడ.. తన మనసుకి జాన్సీ దగ్గరైందని, తనది ప్యూర్‌ హార్ట్ అని, ప్రతిదీ తనతో పంచుకుంటుందని, సలహాలు అడుగుతుందన్నారు. రోహిత్‌ ఇంకా మనసుకి దగ్గర కాలేదని, యాక్సెప్టెన్సీ లేదన్నాడు. చాలా వరకు ఇంగ్లీష్‌ లో మాట్లాడతాడని, ఏదో నెగటివ్‌ పోట్రే చేసే ప్రయత్నం చేస్తుంటాడని చెప్పాడు.

35
దేబ్జానీ బెస్ట్ ఎంటర్‌టైనర్‌

నరేష్‌.. దేబ్జానీ తన మనసుకి దగ్గరైందని, మమ్మల్ని తను బాగా ఎంటర్‌టైన్‌ చేస్తుందని, కానీ సృష్టి హార్ట్ కి దూరంగానే ఉందని, సరిగా మాట్లాడలేదని, దగ్గర కావాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. శాలిని.. రాం ప్రసాద్‌ హార్ట్ కి దగ్గరయ్యాడని, కొన్ని కారణాలతో తమ మధ్య డిస్టర్బెన్స్ వచ్చిందని, ఇకపై అది ఉండదని తెలిపింది. చెల్లిలా ఉంటానని తెలిపింది. అమన్‌ హార్ట్ కి దూరమవుతున్నాడని తెలిపింది. అగ్నిపరీక్షలో బాగా ఉన్నాడు, ఇప్పుడు ఎందుకో దూరమవుతున్నాడని తెలిపింది. సుధీర్‌ రెడ్డి.. ముఖేష్‌ గౌడ మనసుకి దగ్గరయ్యాడని, తనని రైట్‌ ట్రాక్‌లో పెడతాడని తెలిపాడు. వర్షిణి దూరంగానే ఉంటుందన్నాడు. వంశీ.. రోహిత్‌ హార్ట్ కి దగ్గరయ్యాడని, తనలో గెలవాలనే తపన కనిపిస్తుందని, ఆ జీల్‌తో ఉంటాడని తెలిపాడు. సుధీర్‌ హార్ట్ కి దగ్గర కావాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు.

45
దేబ్జానీ అందరి ఫేవరేట్‌.. ఆమె సీక్రెట్ రివీల్‌

ఇందులో ఎక్కువగా దేబ్జానీ హార్ట్ కి దగ్గరైన వ్యక్తిగా ఓట్లు పడ్డాయి. ఆమెని అంతా కోరుకుంటున్నారని, అలానే ఉండాలని, ఎంటర్‌టైన్ చేయాలని నాగార్జున తెలిపారు. అలాగే రోహిత్‌ మనసుకి దూరమైన వ్యక్తిగా ఎక్కువ మంది చెప్పడంతో ఇది మీకు డేంజర్‌ బెల్ అని తెలిపారు నాగ్‌. ఇందులో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. దేబ్జానీకి కాఫీ కావాలని కోరగా, ఏదైనా ఇప్పటి వరకు చెప్పని రహస్యం చెప్పాలని నాగ్‌ అడిగాడు. దీనికి ఆమె రియాక్ట్ అవుతూ, తాను 6వ తరగతి ఫెయిల్‌ అయ్యానని, రెండు సార్లు చదివానని తెలిపింది. దీనికి హౌజ్‌ మొత్తం నవ్వులు పూయించింది. నాగ్‌ సైతం ఆశ్చర్యపోయాడు. దేబ్జానీ అమాయకత్వానికి ఫిదా అయ్యారు. ఆ తర్వాత మరో సీక్రెట్‌ చెబుతూ, ముఖేష్‌ గౌడ తనకు ఇష్టమని, ఇప్పటి వరకు చెప్పలేదని, చెప్పాలని ప్రయత్నించినా కుదరలేదని వెల్లడించింది. ఆయన అటువైపు పులిహోర కలుపుతున్నాడు, ఇటు వైపు కలుపుతున్నాడు, నా వద్దకు రావడం లేదని, కాఫీ ఎంత ఇష్టమో, నువ్వు అంతే ఇష్టమని చెప్పడం విశేషం. దీంతో హౌజ్‌లో వీరిద్దరి మధ్య లవ్‌ ట్రాక్‌ స్టార్ట్ అయ్యిందని అంతా భావిస్తున్నారు.

55
ఆడియెన్స్ చేతికి పవర్‌

ఇక 9 మంది కంటెస్టెంట్ల వద్ద పవర్‌ కీస్‌ ఉన్నాయి. ఒక బ్లాక్‌ కీ ఉంది. వీరిలో ఒకరికి బ్లాక్‌ కీ ఇవ్వాల్సి వస్తే ఎవరికి వస్తారని అందరిని ప్రశ్నించారు. ఇందులో సృష్టికి ఎక్కువ మార్కులు పడ్డాయి. దీంతో ఆమె పవర్‌ పోయింది. బ్లాక్‌ కీ వచ్చింది. ఇక ఆమె వద్ద ఉన్న పవర్‌ కీ గెలుచుకునే అవకాశం ఆ పవర్‌ లేని వారికి కల్పించే అవకాశం కల్పించడానికి గేమ్ పెట్టగా, ఇందులో సుధీర్‌ విన్‌ అయ్యాడు. దీంతో సృష్టి పవర్‌.. సుధీర్‌కి చేరింది. ఫైనల్‌గా నాగార్జున వెళ్తూ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. రెండో వారంలో ప్రజల చేతికే పవర్‌ ఇచ్చాడు. దీని ప్రకారం రెండో వారంలో ఆడియెన్స్ చేతిలో కెప్టెన్సీ కండెండర్‌ని ఎంపిక చేసే అవకాశం కల్పించారు. నచ్చిన వారికి ఓట్‌ వేయాలని తెలిపారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories