60 కోట్ల ఖర్చు చేస్తే 400 కోట్లు తెచ్చిపెట్టింది, బాలీవుడ్ లో సంచలనంగా మారిన తెలుగు రీమేక్ సినిమా

Published : Aug 09, 2025, 05:41 PM IST

పాన్ ఇండియా సినిమాలు రాజ్యం ఏలుతున్న టైమ్ లో, తెలుగు రీమేక్ సినిమా 400 కోట్లతో సత్తా చాటింది. కేవలం 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమా బాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎవరా హీరో? 

PREV
16

టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సంచలనం

తెలుగు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన చిత్రం అర్జున్ రెడ్డి బాలీవుడ్‌లో కబీర్ సింగ్ విడుదలై ఘన విజయం సాధించింది. ఇది పక్కా తెలుగు రీమేక్ సినిమాగా భారీ వసూళ్లు సాధించడమే కాకుండా, అప్పటికి వరుస ఫ్లాపుల్లో ఉన్న నటుడు షాహిద్ కపూర్‌కు తిరిగి స్టార్ హోదా తెచ్చిపెట్టిన సినిమాగా నిలిచింది.

DID YOU KNOW ?
అర్జున్ రెడ్డి బడ్జెట్, కలెక్షన్స్
విజయ్ దేవరకొండ హీరోగా నటించి, టాలీవుడ్ లో సంచలనం సృస్టించిన అర్జున్ రెడ్డి సినిమా 5 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే 50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.
26

5 కోట్ల బడ్జెట్ 50 కోట్ల వసూళ్లు

2017లో తెలుగులో విడుదలైన అర్జున్ రెడ్డి సినిమాను దాదాపు 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపింది. 5 కోట్లు పెడితే 50 కోట్లకు పైగా వసూలు చేసింది. విజయ్ దేవరకొండ, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం యూత్‌ ఆడియన్స్ ను ఉర్రూతలూగించింది. ఎన్నో వివాదాలు మూటకట్టుకుని సంచలనంగా మారింది. ఈసినిమాతో విజయ్ దేవరకొండకు రౌడీ హీరో ట్యాక్ వచ్చింది. ఇక ఈసినిమాకు కాస్త మసాలా యాడ్ చేసి హిందీలో రీమేక్ చేశారు.

36

అర్జున్ రెడ్డి రీమేక్ గా కబీర్ సింగ్

అర్జున్ రెడ్డి సినిమాను హిందీలోకి 2019లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశారు. తెలుగులో ఈసినిమాను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా హిందీలో కూడా దర్శకత్వం వహించారు. షాహిద్ కపూర్, కియారా అద్వాని హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను 60 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ఈసినిమా ప్రపపంచ వ్యాప్తంగా ఓవర్ ఆల్ రన్ లో 400 కోట్లకు పైగా వసూలు చేసి, బాక్సాఫీస్ ను షేక్ చేసింది. తెలుగు సినిమా నుంచి హిందీ రీమేక్‌ గా రూపొందిన సినిమాల్లో ఈ సినిమా చరిత్ర సృష్టించిందని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన మార్క్ దర్శకత్వ శైలిని హిందీలోనూ కొనసాగించి, కథలోని ఎమోషన్స్ ను అద్భుతంగా చూపించారు.

46

యూత్ ఆడియన్స్ ను ఊర్రూతలూగించిన సినిమా

కబీర్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్ నటనకు విమర్శల నుంచి ప్రశంసలు కూడ వచ్చాయి. ఫిల్మ్‌లో చూపిన కోపం, ప్రేమలోని పిచ్చి, తాగుడు అలవాట్లపై కొన్ని విమర్శలు వచ్చినా, ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ముఖ్యంగా యువతకు ఈ సినిమా బాగా ఎక్కేసింది. ఈసినిమా చూసి చాలామంది ఈ స్టైల్స్ ను పాలో అవ్వడం స్టార్ట్ చేశారు. ఇక మ్యూజిక్ అయితే యూత్ ను ఉర్రూతలూగించింది. అర్జిత్ సింగ్ పాడిన పాటలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.

56

కబీర్ సింగ్ కథ ప్రకారం, మెడికల్ స్టూడెంట్ కబీర్ తన జూనియర్ ప్రీతిపై ప్రేమలో పడతాడు. ఆమెను విడిచిపెట్టలేని స్థాయికి వారి ప్రేమ చేరుతుంది. కానీ ఆ తర్వాత పరిస్థితుల వల్ల ఇద్దరి మధ్య దూరం ఏర్పడుతుంది. ప్రేమలో ఓడిపోయిన కబీర్ తాగుడులో మునిగిపోతాడు. ఈ కథను సందీప్ వంగా తెరపై నిజాయితీగా చూపించారు. దాంతో రా ఎమోషన్స్ కు తెరపై అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కబీర్ సింగ్ సూపర్ హిట్ అయ్యింది.

66

షాహిద్ కపూర్ కు బ్రేక్ ఇచ్చిన మూవీ

పద్మావత్ తర్వాత వరుస ఫ్లాపులతో షాహిద్ కపూర్ కెరీర్ డీలాపడుతుందన్న అంచనాల మధ్య, కబీర్ సింగ్ ఆయనకు మళ్లీ బ్రేక్ ఇచ్చింది. సినిమా విడుదలైన కొద్ది రోజులలోనే 300 కోట్ల క్లబ్‌లో చేరి బాలీవుడ్‌ను ఆశ్చర్యపరిచింది. ఒవర్ ఆల్ రన్ లో ఈసినిమా 400 కోట్ల వరకూ కలెక్షన్స్ సాధించింది. అటు డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగా కూడా బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఆతరువాత ఆయన రణబీర్ కపూర్ తో చేసిన యానిమల్ కూడా సంచలన విజయాన్ని నమోదు చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories