సూపర్ స్టార్ మహేష్ బాబు 50వ జన్మదిన వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మహేష్ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల నుంచి, సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మహేష్ బాబు రెండు దశాబ్దాలకి పైగా టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ తనకంటూ సపరేట్ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.
25
మహేష్ బాబు ఆస్తులు
మహేష్ ఇప్పటివరకు 28 చిత్రాల్లో నటించారు. మహేష్ బాబు ఆస్తుల విలువ 400 కోట్ల వరకు ఉంటుందని అంచనా. మహేష్ బాబు ప్రతి చిత్రానికి 70 నుంచి 80 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటారు. రాజమౌళి చిత్రానికి మహేష్ బాబు 125 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది మహేష్ బాబు కెరీర్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్.
35
వివిధ నగరాల్లో లగ్జరీ హౌస్ లు
మహేష్ బాబుకి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో 30 కోట్ల విలువైన లగ్జరీ హౌస్ ఉంది. అదే విధంగా గోవా, చెన్నై, బెంగళూరులో కూడా మహేష్ కి ప్రాపర్టీలు ఉన్నాయి. మహేష్ బాబుకి ప్రైవేట్ జెట్ కూడా ఉన్నట్లు సమాచారం. ఇక మహేష్ కార్పొరేట్ సంస్థలకి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉన్నారు.
తాను ప్రమోట్ చేసే బ్రాండ్ ని బట్టి మహేష్ బాబు 12 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. పెరుగుతున్న రెమ్యునరేషన్ కారణంగా ప్రతి ఏడాది మహేష్ ఆస్తులు కూడా పెరుగుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంతో మహేష్ బాబు పాన్ ఇండియా స్థాయిలో టాప్ లీగ్ లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
55
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా బిజినెస్ మ్యాన్
మహేష్ బాబు సిల్వర్ స్క్రీన్ పైనే కాదు రియల్ లైఫ్ లో కూడా బిజినెస్ మ్యాన్ అనే చెప్పాలి. మహేష్ కి అనేక వ్యాపారాలు ఉన్నాయి. జిఎంబి పేరుతో మహేష్ బాబుకి నిర్మాణ సంస్థ కూడా ఉంది. తన బ్యానర్ లో మహేష్ బాబు మేజర్ లాంటి చిత్రాలని నిర్మించి లాభాలు పొందారు. అదే విధంగా ఎంఎబి సినిమాస్ పేరుతో మహేష్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్స్ లో భాగస్వామిగా ఉన్నారు. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ ఇంకా ఏ రేంజ్ కి వెళతాడో చూడాలి.