KA Paul Mass Warning to Balakrishna, Vijay Deverakonda
KA Paul Mass Warning to Vijay Deverakonda: స్టార్ సెలబ్రిటీలకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. మర్యదగా చెప్పింది చేయండి. ప్రకాశ్ రాజ్ లాగా తప్పు ఒప్పుకోండి. లేకుంటే వదిలేదిలేదంటూ బెదిరించారు. మీరు మారుతారా లేక నేను రంగంలోకి దిగాలా అంటూ రెచ్చిపోయారు. ఓ 25 మంది సెలబ్రిటీల పేర్లు చెపుతూ.. వాళ్లను అరెస్ట్ చేస్తారా లేక నన్న సుప్రీమ్ కోర్ట్ వరకూ వెళ్ళమంటారా అంటూ పోలీసులకు కూడా పాల్ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ పాలకు ఇంత కోపం రావడానికి గల కారణం ఏంటి?
Also Read: లేడీ వాయిస్‌లో ఇళయరాజా పాడిన సూపర్ హిట్ సాంగ్ ఏదో తెలుసా?
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
ప్రస్తుతం టాలీవుడ్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు సంచలనంగా మారింది. తవ్వే కొద్ది వివరాలు బయటకు వస్తున్నారు. ప్రముఖులపై కేసులు పెట్టారు కాని వారిపై ఎటువంటి చర్చలు ఎందకు తీసకోవాడంలేదు అంటూ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పందించారు. ఇక బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారికి పాల్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. వారికి 72 గంటలు టైమ్ కూడా ఇచ్చారు. విజయ్ దేవరకొండ, బాలకృష్ణ సహా 25 మంది అరెస్ట్ అవుతారని హెచ్చరిస్తూ కేఏ పాల్ ఓ వీడియో రిలీజ్ చేశారు.
Also Read: మోహన్ బాబు బదులు, ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో, యముడి పాత్ర మిస్ అయిన స్టార్ నటుడు ఎవరో తెలుసా?
KA Paul
అంతే కాదు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో వినిపిస్తున్న వాళ్లంతా బయటకు రావాలని, వారు స్పందించి తమ తప్పును ఒప్పుకోవాలన్నారు. ప్రకాశ్ రాజ్ మాదిరిగా స్వతహాగా బయటకు వచ్చి 72 గంటల్లో చేసిన తప్పు ఒప్పుకోవాలని.. లేదంటే అందరిని సుప్రీంకోర్టుకు ఈడ్చుతానంటూ వార్నింగ్ ఇచ్చారు కేఏ పాల్. ఈ వార్నింగ్ లిస్ట్ లో స్టార్ క్రికెటర్ సచిన్ కూడా ఉన్నారు.
Also Read: రాత్రి 9 తర్వాత కోట్లు ఇచ్చినా, సాయి పల్లవి మాత్రం ఆ పని చేయదని తెలుసా?
police have registered a case against celebrities for promoting Betting apps
ఇక ప్రస్తుతం సంచలనంగా మారిన బెట్టింగ్ యాప్ యాడ్స్ వ్యవహారంలో స్టార్ సెలబ్రిటీలు ఉన్నారు. అందులో క్రికెటర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు. సినిమా సెలబ్రెటీలు, ఇలా చాలామంది నోటీసులు పొందడంతో, ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. తాజాగా, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ఈ వ్యవహారంలోకి రావడంతో జనాల్లో ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది.
Also Read: నయనతార తమ్ముడిగా పాన్ ఇండియా స్టార్ హీరో, సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించిన మేకర్స్
ఈ కేసులో ఇప్పటికే ప్రముఖ నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, నటి నిథి అగర్వాల్ సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. బిగ్‌బాస్ స్టార్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా ఇందులో భాగమైనట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. యాంకర్, వైసీపీ నేత శ్యామల తో పాటు గా ఈ బెట్టింగ్ యాప్ కేసులో ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, ప్రణీత, లక్ష్మీ మంచు, నిధి అగర్వాల్ లతో పాటు మరో 19 మంది సోషల్ మీడియా స్టార్స్ ఉన్నారు.
Also Read: కోటా శ్రీనివాసరావు పర్ఫామెన్స్ తో పిచ్చెక్కించిన సినిమా? ఓవర్ నైట్ స్టార్ ను చేసిన మూవీ ఏదో తెలుసా?
Betting Apps
వీరిలో అనన్య నాగళ్ల, సిరి హన్మంతు, శ్రీముఖి, వర్షిణీ సౌందరాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణు ప్రియ, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, , టేస్టీ తేజ, రీతు చౌదరి, బందారు శేషయని సుప్రిత ఉన్నారు. మరి వీరి వ్వవహారం ఎంత వరకూ వెళ్తుందో చూడాలి.
Also Read: లేడీ వాయిస్‌లో ఇళయరాజా పాడిన సూపర్ హిట్ సాంగ్ ఏదో తెలుసా?