David Warner Robinhood
క్రికెట్ అభిమానులు డేవిడ్ వార్నర్ ని ముద్దుగా వార్నర్ భాయ్, వార్నర్ మామ అని పిలుచుకుంటారు. ఐపీఎల్ ద్వారా డేవిడ్ వార్నర్ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. దీనికి తోడు తెలుగు సినిమాలకి సంబంధించిన డైలాగులు, స్టెప్పులతో ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేయడంతో వార్నర్ పాపులారిటీ ఇంకా పెరిగింది. పుష్ప చిత్రంలోని స్టెప్పుని వార్నర్ క్రికెట్ ఆడుతున్నప్పుడు స్టేడియంలో కూడా వేసి అలరించారు.
Nithiin, david warner
దీనితో వార్నర్ కి తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. వార్నర్ త్వరలో తెలుగు సినిమాలో కనిపించబోతున్నారు. వార్నర్ కామియో రోల్ లో నటించిన నితిన్ రాబిన్ హుడ్ చిత్రం మరో నాలుగు రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఈ చిత్రంలో వార్నర్ సెకండ్ హాఫ్ లో కొన్ని నిమిషాల పాటు అలరించబోతున్నారు.
David Warner with Sreeleela & Ketika Sharma
ఎక్కడో ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగి క్రికెట్ ద్వారా అభిమానులకు చేరువై ఇప్పుడు తెలుగు సినిమాలో నటించడం అంటే విచిత్రమే అని చెప్పాలి. వార్నర్ ఈ చిత్రంలో నటించి చేతులు దులుపుకోలేదు.. సినిమా ప్రమోషన్స్ లో కూడా భాగం అవుతున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వార్నర్ హాజరైన సంగతి తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వార్నర్ ప్రసంగం ఆకట్టుకుంది. గత 15 ఏళ్లుగా మీరు నాపై కురిపిస్తున్న ప్రేమకి ధన్యవాదాలు. రాబిన్ హుడ్ చిత్ర ఫ్యామిలీలోకి నన్ను ఆహ్వానించినందుకు డైరెక్టర్ వెంకీకి థ్యాంక్స్.
ఈ చిత్రం అద్భుతంగా ఉండబోతోంది అని డేవిడ్ వార్నర్ అన్నారు. చివర్లో ఏదైనా తెలుగులో మాట్లాడాలి అని డైరెక్టర్ వెంకీ వార్నర్ ని రిక్వస్ట్ చేశారు. దీనితో వార్నర్ వచ్చీ రాని తెలుగులో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి నవ్వులు పూయించారు. ఈ చిత్రంలో వార్నర్ 3 నిమిషాల పాత్రలో నటిస్తున్నారు అని నితిన్ ఆల్రెడీ రివీల్ చేశారు. అయితే ఈ పాత్ర కోసం వార్నర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అందుతున్న సమాచారం మేరకు వార్నర్ ఈ మూవీ కోసం ఏకంగా 3 కోట్ల పారితోషికం అందుకున్నారట.
అంటే ఒక్కో నిమిషానికి వార్నర్ కోటి రూపాయలు ఛార్జ్ చేశారు. ఇది కేవలం సినిమాలో రోల్ కి మాత్రమే. ఇక ప్రమోషన్స్ లో పాల్గొన్నందుకు లెక్క వేరే ఉందట. ప్రమోషన్స్ కోసం కోటి రూపాయలు అదనంగా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే మొత్తంగా వార్నర్ మామ రాబిన్ హుడ్ నుంచి 4 కోట్లు పిండుకున్నాడు.