`కే ర్యాంప్‌` బాక్సాఫీసు వసూళ్లు.. కిరణ్‌ అబ్బవరం కెరీర్‌లోనే హైయ్యెస్ట్.. ఎంత లాభం వచ్చిందంటే?

Published : Nov 02, 2025, 07:15 PM IST

కిరణ్‌ అబ్బవరం `కే ర్యాంప్‌`తో మరో హిట్‌ని అందుకున్నారు. ఈ సినిమా కిరణ్‌ కెరీర్‌లోనే హైయ్యెస్ట్ కలెక్షన్లు రాబట్టిన మూవీ కావడం విశేషం. ప్రస్తుతం లేటెస్ట్ కలెక్షన్ల రిపోర్ట్ వచ్చింది. 

PREV
15
బాక్సాఫీసు వద్ద ఇంకా ర్యాంప్‌ ఆడిస్తున్న `కే ర్యాంప్‌`

యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్ అందుకుంటున్నారు. `క` మూవీతో అదిరిపోయే కమ్‌ బ్యాక్‌ అయిన కిరణ్‌ ఇప్పుడు `కే ర్యాంప్‌`తో మరో హిట్‌ అందుకున్నారు. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తూనే ఉంది. ఈ వీకెండ్స్ లోనూ మంచి వసూళ్లని రాబట్టుకుందట. దీంతో 15 రోజుల్లో ఈ చిత్రం కిరణ్‌ అబ్బవరం కెరీర్లోనే అత్యధిక వసూళ్లని రాబట్టడం విశేషం.

25
దీపావళి కానుకగా విడుదలైన `కే ర్యాంప్‌`

కిరణ్‌ అబ్బవరం హీరోగా రూపొందిన `కే ర్యాంప్‌` చిత్రంలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. జైన్స్ నాని దర్శకత్వం వహించారు. హాస్య మూవీస్‌, రుద్రాంశ్‌ సెల్యులాయిడ్‌ బ్యానర్లపై రాజేష్‌ దండా, శివ బొమ్మన సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా దీపావళి పండుగని పురస్కరించుకుని అక్టోబర్‌ 18న విడుదలైన విషయం తెలిసిందే. ప్రారంభం నుంచే హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. సూపర్‌ హిట్‌గా దూసుకుపోయింది. పండగకి కావాల్సిన మాస్‌ ఎలిమెంట్లు, ఫ్యామిలీ అంశాలు, కామెడీ, దీనికితోడు యాక్షన్‌ కూడా ఉండటంతో ఆడియెన్స్ ని సినిమా బాగా ఆకట్టుకుంది. ఆ వారం విడుదలైన మిగిలిన చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో `కే ర్యాంప్‌`కి కలిసి వచ్చింది.

35
`కే ర్యాంప్‌` 15 రోజుల బాక్సాఫీసు వసూళ్లు

తాజాగా `కే ర్యాంప్‌` కలెక్షన్ల రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ మూవీ 15 రోజుల్లో ఏకంగా రూ.40కోట్లు వసూలు చేయడం విశేషం. తాజాగా ఈ విషయాన్ని టీమ్‌ ప్రకటించింది. కిరణ్‌ అబ్బవరం కెరీర్‌లోనే అత్యధికం కావడం విశేషం. ఈ చిత్రానికి దాదాపు రూ.8కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగింది. దాదాపు తొమ్మిది కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌తో విడుదల కాగా, ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా నలభై కోట్ల గ్రాస్‌ని సాధించడం విశేషం. అంటే ఈజీగా ఈ మూవీకి ఇరవై కోట్లకుపైగా షేర్‌ వచ్చింది. అంటే డబుల్‌ ప్రాఫిట్‌ అని చెప్పొచ్చు. కిరణ్‌ అబ్బవరం నిర్మాతలకు, బయ్యర్లకి కాసుల వర్షం కురిపించింది. 

45
కిరణ్‌ అబ్బవరం కెరీర్‌ని మలుపుతిప్పిన `కేర్యాంప్‌`

కిరణ్‌ అబ్బవరం చివరగా `క` మూవీతో హిట్‌ అందుకున్నారు. ఈ మూవీ టోటల్‌ కలెక్షన్లు ముప్పై కోట్లు. దీంతో ఆ మూవీని వసూళ్లని `కే ర్యాంప్‌` దాటేసింది. కిరణ్‌ కెరీర్‌లోనే హైయ్యెస్ట్ వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. అయితే ఈ వారం కూడా ఈ మూవీ ఆడే ఛాన్స్ ఉంది. ఈజీగా మరో కోటి, రెండు కోట్ల వరకు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఏదేమైనా కిరణ్‌ అబ్బవరం కెరీర్‌ని `కే ర్యాంప్‌` మలుపు తిప్పిందని చెప్పొచ్చు. అదే సమయంలో ఆయన మార్కెట్‌ని పెంచింది.

55
`కేర్యాంప్‌` మూవీ స్టోరీ ఇదే

ఇక `కేర్యాంప్‌` సినిమా కథేంటనేది చూస్తే, కిరణ్‌ అబ్బవరం బాగా సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయనకు చిన్నప్పుడే తల్లి లేదు. దీంతో తండ్రి సాయికుమార్‌ అల్లారుముద్దుగా పెంచుతాడు. బాగా గారాబం చేస్తాడు. దీంతో చదువు పక్కన పెట్టి జల్సాలు చేస్తుంటాడు. రోజూ తాగుడూ, ఫ్రెండ్స్, ఎంజాయ్‌ ఇవే ఆయ పనులు. దీనికితోడు గొడవలు. హైదరాబాద్‌లో ఉంటే మరింతగా పాడవుతాడని భావించిన తండ్రి కేరళాలో తమ బంధువుల వద్దకు పంపిస్తాడు. అక్కడ కూడా ఇదే తంతు.  ఓ రోజు బాగా తాగిన మత్తులో పడిపోయి ఉండగా, హీరోయిన్‌ ఆసుపత్రిలో చేర్పిస్తుంది. ఆమె గొప్ప హృదయానికి ఫిదా అయిన హీరో ఆమె ప్రేమలో పడతాడు. ఆమె వెంటపడతాడు. కొన్ని రోజులకు ఆమె కూడా పడిపోతుంది. అయితే అసలు విషయం అప్పుడే బయటపడుతుంది. హీరోయిన్‌కి ఒక సైకలాజికల్‌ డిజార్డర్‌ ఉంటుంది. దాని ప్రకారం ఆమె తనకు ఎవరైనా మాటిస్తే, ఆ మాటకి కట్టుబడి ఉండాలి, టైమ్‌ చెబితే ఆ టైమ్ లోపే పని అయిపోవాలి. ఆ టైమ్‌ దాటిందా ఆమె తట్టుకోలేదు, ఆత్యహత్య ప్రయత్నాలు చేస్తుంది. ఈ విషయం తెలిసి హీరో పడే బాధలే మూవీ. ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా రూపొందింది. అలరించింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories