Karthika Deepam: వచ్చావా.. క్యారీ తెచ్చావా అన్నట్టే ఉండాలి.. జ్వలాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ప్రేమ్!

Published : May 30, 2022, 07:56 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 30 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Karthika Deepam: వచ్చావా.. క్యారీ తెచ్చావా అన్నట్టే ఉండాలి.. జ్వలాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ప్రేమ్!

ఈ రోజు ఎపిసోడ్ లో సౌందర్య(soundarya), ఆనందరావు లు ఎలా అయినా పెళ్లి చేయాలి అని నిర్ణయం తీసుకుని ఆ విషయాన్ని హిమతో చెప్తారు. కానీ హిమ మాత్రం ఏమి చెప్పకుండా మౌనంగా ఉండి పోతుంది. అప్పుడు సౌందర్య చిన్నప్పటి నుంచి బావా బావా అని తిరిగి, భావను పెళ్లి చేసుకుంటానని చెప్పి చివరి మాటతప్పింది అంటూ హిమ(hima) పై ఫైర్ అవుతుంది సౌందర్య.
 

26

కానీ హిమ మాత్రం సౌర్య కోసమే ఇదంతా చేస్తున్నానని ఎలా చెప్పాలి నానమ్మ అని లోలోపల బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు ఇంద్రమ్మ(Indramma) దంపతులు స్వప్న(swapna)కారు డోర్ రాకుండా డూప్లికేట్ కీ తో లాక్ చేసి వెళ్తారు. ఇంతలో స్వప్న అక్కడికి వచ్చి డోరు తీయడానికి ఎంత ప్రయత్నించినా కూడా రాదు. ఇంతలో ఇంద్రమ్మ దంపతులు అటుగా వచ్చి కార్ డోర్ తీస్తారు.
 

36

మరొకవైపు సత్య ఇంటికి నిరుపమ్(Nirupam) రావడంతో తిన్నావా అని అడగగా పర్లేదు అని నిరుపమ్ అనడంతో వెంటనే సత్య జ్వాలా కి ఫోన్ చేసి మీ డాక్టర్ సాబ్ కూడా కలిపి అందరికీ భోజనం సరిపోయేటట్టు తీసుకొని రా అని చెప్తాడు. ఇక ఆ తర్వాత సత్య(sathya), హిమ గురించి మాట్లాడుతూ కనీసం జ్వాలా హెల్ప్ తీసుకొని హిమ మనసులో ఏముందో తెలుసుకో అని అంటాడు.
 

46

 మరొకవైపు జ్వాలా భోజనం తీసుకుని వస్తూ ఉంటుంది. ఇంతలో రోడ్డు పైన నిలబడి ఆలోచిస్తు ఉండగా ఇంతలో జ్వాలా అక్కడికి రావడంతో అప్పుడు సౌందర్య(soundarya)నీకోసం ఎక్కడ ని వెతకాలి నాకు కావాలి అన్నప్పుడు నువ్వు దొరకవు అని చెప్పి కొద్దీ సేపు జ్వాలా తో మాట్లాడుతుంది. మరొకవైపు సత్య,నిరుపమ్, ప్రేమ్ (pream)లు కూర్చుని మాట్లాడుతూ ఉండగా ఇంతలో జ్వాలా భోజనం తీసుకొని వస్తుంది.
 

56

అప్పుడు జ్వాలా,ప్రేమ్ ని మాట్లాడించగా అప్పుడు ప్రేమ్,జ్వాలా(jwala) పై సీరియస్ అవుతడు. అప్పుడు మధ్యలో నిరుపమ్,ప్రేమ్ (pream)ని ఆపాలని చూసిన కూడా ప్రేమ్ ఆగకుండా జ్వాలపై విరుచుకు పడతాడు. వచ్చావా భోజనం తెచ్చావా డబ్బులు తీసుకున్నావా వెళ్ళిపోయావా అంతే అంటూ జ్వాలపై మండిపడతాడు. 
 

66

అప్పుడు జ్వాలా, ప్రేమ్(pream) మాటలకు ఎమోషనల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నిరుపమ్ హాస్పిటల్ కి వెళ్లి హిమ గురించి ఆలోచిస్తూ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాడు. రేపటి ఎపిసోడ్ లో నిరుపమ్(Nirupam), హిమ ను ఎవరితోనో పెళ్లికి సిద్ధపడ్డావంట కదా ఆ పెళ్లి నేను ఆపేస్తాను అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో జ్వాలా వచ్చి వారి మాటలను వింటుంది.

click me!

Recommended Stories