టీవీ షోస్‌లో తనని చాలా అమాయకురాలు, ఎంతో అణకువగా ఉంటుందని బయట టాక్ ఉందని, కానీ తన ఒరిజినల్ వేరే ఉందని చెప్పింది రష్మి. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టిమరీ తన ఒరిజినల్ బయటపెట్టింది. రియల్‌లైఫ్‌లో తనొక ఖిలాడీ అని, ఫుష్ జోష్‌లో ఉంటానని, అనుకున్నంత అమాయకురాలిని కాదని, తనొక మాస్ అని, సీన్ దొరికితే రచ్చరచ్చ చేస్తాననే అర్థంలో ఆమె డాన్సు చేస్తూ, షోస్‌లో హాట్ అండ్ మాస్ మూవ్‌మెంట్స్ తో డాన్సు చేసిన వీడియోని పంచుకుంది రష్మి.