Published : May 21, 2022, 07:53 AM ISTUpdated : May 21, 2022, 08:04 AM IST
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 21 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే స్వప్న (Swapna) మీ డాడీ ప్రేమించిన అమ్మాయి వేరేవాళ్లను పెళ్లి చేసుకున్నా.. ఇద్దరు పిల్లలను మీ డాడీ తోనే కనింది అని నిరూపమ్ (Nirupam) కి చెబుతుంది. ఇక మీ డాడీ నన్ను ఈ రకంగా మోసం చేశాడు కాబట్టి దూరం పెట్టాను అని తన మనసులోని బాధ బయట పెడుతుంది.
26
ఇక అదే క్రమంలో హిమ (Hima) పెద్ద నష్టజాతకురాలు అది ఒక దరిద్రం దాన్ని వదిలేయ్ అని స్వప్న నిరూపమ్ (Nirupam) కి చెబుతుంది. మరోవైపు హిమ మొత్తానికి నానమ్మ, సౌర్య లు కలుసుకోలేదన్న మాట అని ఊపిరి పీల్చుకుంటుంది. ఈ క్రమంలో హిమ, సౌర్య లు కారులో వెళ్తూ ఉంటారు.
36
ఇక హిమ (Hima) కారు రోడ్డు మీద ఆగిపోతుంది. దాంతో శోభ (Shobha) కారుకు అడ్డంగా ఉన్నందుకు శోభ హిమను గట్టిగా చెంప మీద కొడుతుంది. దాంతో జ్వాల శోభను రెండుసార్లు చెంప మీద కొడుతుంది. అంతేకాకుండా హిమకు సారీ కూడా చెప్పిస్తుంది. ఈలోపు స్వప్న శోభ కు ఫోన్ చేసి ఇంటికి రమ్మంటుంది.
46
ఇక జ్వాల (Jwala) హిమను ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడగగా.. నా టెన్షన్ అంతా నిన్ను నిరూపమ్ బావని కలపడం కోసమే అని మనసులో అనుకుంటుంది. నీకు ఎప్పుడు డాక్టర్ సాబ్ ను పెళ్లి చేసుకోవాలని అనిపించలేదా అని జ్వాల హిమ (Hima) ను అడుగుతుంది. ఇక హిమ డాక్టర్ సాబ్ నాకు నచ్చలేదు అంటుంది.
56
ఇక జ్వాల (Jwala) నా మనసు నిండా డాక్టర్ సాబె ఉన్నాడు. తనే నా ప్రాణం అని హిమకు చెబుతుంది. అంతేకాకుండా డాక్టర్ సాబ్ నాకు ఐ లవ్ యు కూడా చెప్పారు. ఆరోజు ఫుల్ గా మందుకొట్టి ఉన్నారు అని అంటుంది. హిమ కు ఆ రోజు నిరూపమ్ (Nirupam) ఎందుకు మందు తాగాడు అన్న విషయం గురించి ముందే తెలుసు.
66
ఇక డాక్టర్ సాబ్ కి నేను ప్రపోజ్ చేయలేదు. ఎందుకంటే నాకు ధైర్యం చాలటం లేదు అని జ్వాల (Jwala) అంటుంది. అంతేకాకుండా నేను ఈ విషయంలో చాలా అదృష్టవంతురాలిని అని మురిసిపోతుంది. ఇక ఈ విషయం లో నాకు హెల్ప్ చేయి అని హిమ (Hima) ను అడుగుతుంది. ఇక హిమ అది నా బాధ్యత అంటుంది.