NTR:'ఉప్పెన' డైరక్టర్ షాకింగ్ ట్విస్ట్... నెక్ట్స్ ఎన్టీఆర్ తో కాదా? అందుకే ప్రకటన లేదా?

First Published | May 21, 2022, 6:52 AM IST

 ఎన్టీఆర్ 30,ఎన్టీఆర్ 31 ఈ రెండు ప్రాజెక్టుల మేకర్స్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20 లేదా ఒక రోజు ముందుగానే మే 19న అభిమానుల కోసం అదిరిపోయే ట్రీట్ అందించారు. 

ntr, buchibabu sana


జూనియ‌ర్ ఎన్టీఆర్  RRR సినిమా ఏయే డైరక్టర్స్ తో ఫైనల్ చేస్తారనే టాక్ గత కొంతకాలంగా నడుస్తూనే ఉంది. అందుకు సమాధానం నిన్నటి ప్రకటనలతో వచ్చేసింది. ఆయన వరసగా రెండు సంవత్సరాల పాటు  బిజీగా ఉండనున్నారు. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ లతోనే మొదట తన ప్రాజెక్టులు ఉండబోతన్నాయని తేల్చేసాడు. దాంతో  ఈ రెండు ఈ సినిమాతోనే మ‌రో రెండేళ్ల పాటు బిజీగా ఉంటాడ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. మధ్య గ్యాప్ లో కానీ   ఆ తర్వాత కానీ ఇప్పటికే ఎనౌన్స్ చేసిన త్రివిక్రమ్ తో సినిమా ఉంటుంది.  హారిక హాసిని, నందమూరి తారకరామారావు ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అంతా బాగానే ఉంది కానీ డైరక్టర్ బుచ్చిబాబుతో ఎనౌన్సమెంట్ ఏది అనేది ఇప్పుడు పజిల్ గా మారింది.


బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకున్నారు. ప్రేమకథా చిత్రాలలో ఈ సినిమా ఒక కొత్త ట్రెండ్ సృష్టించింది. రికార్డుస్థాయిలో ఈ సినిమా వసూళ్లను రాబట్టింది. ఆ తరువాత సినిమాను ఆయన ఎన్టీఆర్ తో చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమాకి 'పెద్ది' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. 


అయితే ఈ రోజున ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో, కొరటాల సినిమా నుంచి ఫస్టు పోస్టర్ ను రిలీజ్ చేశారు. అలాగే ప్రశాంత్ నీల్ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. బుచ్చిబాబు సినిమాకి సంబంధించిన ప్రస్తావన మాత్రం ఎక్కడా లేదు. దాంతో ఈ ప్రాజెక్టు లేదని అంతా అనుకుంటున్నారు. 

ఆయన ఎన్టీఆర్ తో చేయబోయేది ఓ  స్పోర్ట్స్ డ్రామా అన్నారు. స్క్రిప్ట్ మరియు కథనంతో ఇంప్రెస్ అయిన తారక్ సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. దీనికి ముందు కొరటాల శివ, ప్రశాంత్ నీల్‌లతో చర్చలు జరిపారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ 30, ఎన్టీఆర్ 31 చిత్రాలను ప్రకటించారు. బుచ్చిబాబు ఇప్పుడు ఎన్టీఆర్‌తో తన ప్రాజెక్ట్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది.


ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో, కొరటాల సినిమా నుంచి ఫస్టు పోస్టర్ ను రిలీజ్ చేశారు. అలాగే ప్రశాంత్ నీల్ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. బుచ్చిబాబు సినిమాకి సంబంధించిన ప్రస్తావన మాత్రం ఎక్కడా లేదు. దాంతో ఈ ప్రాజెక్టు లేదని అంతా ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ ప్రాజెక్టు ఉందనే తెలుస్తోంది. ఇంకా సెకండాఫ్ విషయంలో ఎన్టీఆర్ ను బుచ్చిబాబు ఒప్పించవలసి ఉందని అంటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పైనే కసరత్తు జరుగుతోందని చెబుతున్నారు. త్వరలోనే స్క్రిప్ట్ లాక్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. 


సుకుమార్ ద్వారా ఎన్టీఆర్ ను బుచ్చిబాబు ఒప్పించాడట. ఈ కథ అంతా కూడా విజయనగరం నేపథ్యంలో నడుస్తుందని చెబుతున్నారు. ఇంతవరకూ ఎన్టీఆర్ తెరపై కనిపిస్తూ వచ్చినదానికీ, ఇంతవరకూ ఆయన చేస్తూ వచ్చిన పాత్రలకి ఈ సినిమా పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. 


అయితే ఎన్టీఆర్ రెండేళ్లు బిజీగా ఉంటే ఆయన కోసం  రెండేళ్లు ఎదురుచూడడం బుచ్చిబాబుకు తెలివైన నిర్ణయం కాదు. స్టార్ హీరోలు, యంగ్  నటులందరూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజిగా ఉండటంతో, బుచ్చిబాబు తన తదుపరి చిత్రాన్ని ఖరారు చేయడం మరియు ఎప్పుడైనా షూటింగ్ ప్రారంభించడం చాలా కష్టం.  

 
అయితే ఎన్టీఆర్ రెండేళ్లు బిజీగా ఉంటే ఆయన కోసం  రెండేళ్లు ఎదురుచూడడం బుచ్చిబాబుకు తెలివైన నిర్ణయం కాదు. స్టార్ హీరోలు, యంగ్  నటులందరూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజిగా ఉండటంతో, బుచ్చిబాబు తన తదుపరి చిత్రాన్ని ఖరారు చేయడం మరియు ఎప్పుడైనా షూటింగ్ ప్రారంభించడం చాలా కష్టం.  


ప్రస్తుతం బుచ్చిబాబు... మైత్రి మూవీ మేకర్స్‌తో చర్చలు జరుపుతున్నాడు. బుచ్చిబాబు తన తదుపరి ప్రాజెక్ట్‌పై త్వరలో ఫైనల్ కాల్ తీసుకోనున్నారు.  ఎన్టీఆర్ కమిట్ మెంట్స్ పూర్తయ్యేలోగా బుచ్చిబాబు మరో కథను మరో హీరోతో కానిచ్చేస్తాడని చెబుతున్నారు.


ఇక అభిమానులంతా తన హీరో ఎప్పుడెప్పుడు కేజీఎఫ్ లాంటి సినిమా చేస్తాడా అని ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్‌ 31 ను ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ కోసం ఎన్టీఆర్‌ పై ప్రశాంత్‌ నీల్‌ ఫోటో షూట్‌ టెస్ట్‌ షూట్‌ నిర్వహించాడు. ఈ పోస్టర్ కోసం ప్రశాంత్ నీల్ ఏకంగా 32 కెమెరాలు ఉపయోగించాడని సమాచారం. 

అయితే ఎన్టీఆర్ తో  సినిమా ప్రారంభంకు కనీసం ఇంకా ఆరు నెలల సమయం ఉంది. షూటింగ్‌ పూర్తి అయ్యి విడుదల అయ్యేప్పటికి ఏడాది కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం సాలార్‌ మూవీతో బీజీగా ప్రశాంత్‌ నీల్‌... వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి ఎన్టీఆర్‌ మూవీ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ ఈ సినిమాని నిర్మిస్తాయి.

ntr, buchibabu


ఇక మరో లవ్ స్టోరీ రాసుకున్న బుచ్చిబాబు ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ హీరోగానే మరో సినిమాను చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ వైష్ణవ్ తేజ్ వరుస సినిమాలు ఒప్పుకోవడం వలన, డేట్లు కుదరలేదనే టాక్ వినిపించింది. దాంతో మరో యంగ్ హీరోతో సినిమా చేసే ఆలోచనలో ఆయన ఉన్నాడని అంటున్నారు. మరి ఆ యంగ్ హీరో ఎవరో .. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందనేది చూడాలి.  

Latest Videos

click me!