Karthika Deepam: హిమను గెంటేసిన శౌర్య.. సౌందర్య ముఖం మీదే తలుపులు వేసిన జ్వాల!

Published : Jun 28, 2022, 07:49 AM ISTUpdated : Jun 28, 2022, 07:52 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 28 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
15
Karthika Deepam: హిమను గెంటేసిన శౌర్య.. సౌందర్య ముఖం మీదే తలుపులు వేసిన జ్వాల!

 ఈరోజు ఎపిసోడ్ లో జ్వాలా(jwala) సీసీ నాకు థాంక్స్ చెప్పి అలవాటు లేదు అని అనడంతో వెంటనే సౌందర్య నిన్ను ఎవరు థాంక్స్ చెప్పమన్నారు ఈ ఉండు అని చెప్పి జ్వాలాకు ఒక గిఫ్ట్ ఇస్తుంది. అందులో చిరిగిపోయిన నిరుపమ్(Nirupam)ఫోటోని సౌందర్య అతికిస్తుంది. నన్ను మోసం చేసింది అంటూ హిమ పై కోప్పడగా అప్పుడు సౌందర్య జ్వలా కు దైర్యం చెబుతుంది.
 

25

డాక్టర్ సాబ్ చెప్పాడు అని ఆ తింగరిని నా మనస్ఫూర్తిగా ప్రేమతో నా చుట్టూ తిప్పుకున్నాను. ఈ జ్వాలా ప్రేమించినా విపరీతంగానే ద్వేషించిన విపరీతంగానే ఉంటుంది అని అంటుంది. అప్పుడు సౌందర్య ఎదురుగానే హిమ(hima)ను వదిలేదే లేదు అంటూ హిమ పై ఫైర్ అవుతుంది జ్వాలా. మరొకవైపు హిమ,  శోభ (shobha)చెంప చెల్లు మనిపిస్తుంది. అప్పుడు హిమ ఇంకొక్కసారి జ్వాల కి ఫోన్ చేస్తే నేను బావ దగ్గరికి వెళ్లి నాకు క్యాన్సర్ లేదు అని చెబితే ఏమవుతుందో తెలుసుకదా అని అంటుంది హిమ.
 

35

అయితే అదంతా కూడా శోభ(shobha) ఇంట్లోనే ఉంటూ కల కంటుంది. మరొకవైపు  సౌందర్య, జ్వలా మాట్లాడుతూ వుండగా అప్పుడు సౌందర్య(soundarya) ఆ అబ్బాయి నాకు బాగా తెలుసు నేను మాట్లాడతాను అని అనడంతో జ్వాలా వద్దు అని అంటుంది. అప్పుడు సౌందర్య, జ్వలా నీకు గోరింటాకు పెడతాను అని అనగా ఏంటి తీసి నాకు పెళ్లి చేయాలని చాలా ఆశ పడుతున్నట్టు ఉన్నావు అని అంటుంది జ్వాలా.
 

45

ఆ తర్వాత సౌందర్య (soundarya)అక్కడి నుంచి వెళ్లిపోయాక జ్వాలా, నిరుపమ్ అన్న మాటలను తలుచుకుని బాధ పడుతూ ఉంటుంది. మరొకవైపు నిరుపమ్,స్వప్న ఇంటికి రాగా అక్కడ జ్వాలా ఆటో చూసి షాక్ అవుతారు. అప్పుడు స్వప్న(swapna) ఏంటే ఇలా ఆటో ని ఏకంగా ఇంట్లోకి తీసుకువచ్చావ్ అని అనగా అప్పుడు జ్వాలా కొన్ని లెక్కలు తేలాలి అని చెప్పాను కదా ఎందుకు ఎక్కువ చేస్తున్నారు అని అనగా అప్పుడు స్వప్న జ్వాల చెంప చెల్లు మనిపిస్తుంది.
 

55

అప్పుడు జ్వాలా, నిరుపమ్(Nirupam)ఇచ్చిన ఆటోని తిరిగి ఇచ్చేసి ఎమోషనల్ గా మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తరువాత నిరుపమ్, స్వప్న(swapna) పెళ్లి పత్రికలు ఎవరు ఎవరికి ఇవ్వాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. అంతలోనే శోభ అక్కడికి వస్తుంది. రేపటి ఎపిసోడ్ లో జ్వాలా ఇంటికి సౌందర్య హిమను తీసుకురావడంతో,జ్వాలా కోపంతో హిమను బయటకు గెంటేస్తుంది. అప్పుడు సౌందర్య, ఆనంద్ రావ్ లను ఇంకొకసారి మా ఇంటికి రా వద్దండి నా బతుకును బతకనివ్వండి అని చెప్పి వారి ముఖం మీదే తలుపులు వేస్తుంది.

click me!

Recommended Stories