1500 కోట్ల బడ్జెట్, 12 రోజుల్లో 45‌‌00 కోట్ల కలెక్షన్లు, దుమ్మురేపుతున్న సినిమా ఏదో తెలుసా?

Published : Jul 16, 2025, 06:27 PM IST

1500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఓ సినిమా భారీ వసూళ్ళతో సునామీ సృష్టిస్తోంది. కేవలం 12 రోజుల్లో 4500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి?

PREV
14

సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ప్రేమికులకు ఇది నిజమైన పండుగ. 2025లో విడుదలైన హాలీవుడ్ చిత్రం ‘జురాసిక్ వరల్డ్: రీబర్త్’ అంచనాలకు మించి విజయాన్ని సాధిస్తూ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా రిలీజైన 12 రోజుల్లోనే రూ.4500 కోట్లకు పైగా వసూలు చేయడం ద్వారా సరికొత్త రికార్డును నెలకొల్పింది.

24

జూలై 2, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. హాలీవుడ్‌లో గత 22 సంవత్సరాలుగా డైనోసార్లకు సంబంధించిన కథలు ప్రేక్షకులను ఆకట్టుకుంటునే ఉన్నాయి. అయితే ఆ కోవలోనే ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసిన జురాసిక్ సిరీస్‌లో ఇది ఏడవ సినిమా. ‘జురాసిక్ వరల్డ్: రీబర్త్’ ప్రస్తుతం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సినిమా కావడం విశేషం.

34

ఈ సినిమా 1541 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడింది. విడుదలైన పన్నెండు రోజుల్లోనే ఈ సినిమా దాదాపు మూడింతలు ఎక్కువ కలెక్షన్లు రాబట్టింది. భారతీయ మార్కెట్‌లో కూడా ఈ మూవీ మంచి ఆదరణను పొందింది. కేవలం 10 రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.86 కోట్లు వసూలు చేసింది.

44

ఈసినిమాలో ప్రముఖ హాలీవుడ్ నటి స్కార్లెట్ జోహన్సన్, ఎమ్మీ తో పాటు SAG నామినీ జోనాథన్ బెయిలీ, రెండుసార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న మహర్షలా అలీ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ యేడాది ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రికనింగ్’ తర్వాత హాలీవుడ్‌లో రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది నిలిచింది.

విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ , తో పాటు ఎమెషనల్ అంశాలతో స్క్రీన్ ప్లే అద్భుతంగా పండింది. ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌ను కూడా లక్ష్యంగా చేసుకొని రూపొందించిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories