చిరంజీవి, పవన్, నాగార్జున తర్వాత ఎన్టీఆర్ కు హైకోర్టులో ఊరట, తారక్ ప్రత్యేక కృతజ్ఞతలు ఎవరికో తెలుసా?

Published : Dec 29, 2025, 08:03 PM IST

పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. చిరంజీవి, నాగార్జున మాదిరగా తన వ్యక్తిగత భద్రతను కాపాడాలని తారక్ వేసిన పిటిషన్ పై కోర్టు తీర్పును వెల్లడించింది.

PREV
16
ఢిల్లీ హైకోర్టుకు ఎన్టీఆర్ కృతజ్ఞతలు

పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తన వ్యక్తిగత హక్కులను పరిరక్షిస్తూ కీలక తీర్పు ఇచ్చినందుకు ఎన్టీఆర్ థ్యాంక్స్ చెపుతూ.. ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో సెలబ్రిటీల పర్సనాలిటీ రైట్స్ ఎంత ముఖ్యమో మరోసారి రుజువు చేసిన న్యాయస్థానం ఉత్తర్వులపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

26
ఎన్టీఆర్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు తీర్పు..

రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.. తన పేరు, పోటో, వాయిస్ ను అనుమతి లేకుండా ఎవరు ఊపయోగించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం, ఎన్టీఆర్  వ్యక్తిగత హక్కులను కాపాడేలా స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, ఆయన అనుమతి లేకుండా ఆయన వ్యక్తిగత గుర్తింపుకు సంబంధించిన ఏ అంశాన్నీ దుర్వినియోగం చేయరాదని కోర్టు ఆదేశించింది.

36
తారక్ స్పెషల్ థ్యాంక్స్ ఎవరికి?

ఈ న్యాయపోరాటంలో తనకు చాలా స్ట్రాంగ్ గా సపోర్ట్ చేసిన న్యాయవాదులు, న్యాయ నిపుణులకు కూడా ఎన్టీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయవాదులు డాక్టర్ బాలజానకి శ్రీనివాసన్, డాక్టర్ అల్కా డాకర్‌లతో పాటు రైట్స్ అండ్ మార్క్స్ సంస్థకు చెందిన రాజేందర్ తో పాటు ఆయన టీమ్ కి ఎన్టీఆర్ స్పెషల్ థ్యాంక్స్ తెలిపారు. వారి నిరంతర సహకారం, న్యాయపరమైన మార్గనిర్దేశానికి తాను ఎంతో రుణపడి ఉంటానని ఆయన అన్నారు.

46
ఫిల్మ్ స్టార్స్ కు శాపంగా మారిన సోషల్ మీడియా

ఈ అమధ్య కాలంలో సోషల్ మీడియా సెలెబ్రిటీల పాలిట శాపంగా మారింది. ముఖ్యంగా ఏఐ వచ్చిన తరువాత వారి ఫోటోలు,పేర్లు,వాయిస్ కూడా మిస్ యూజ్ అవుతున్నాయి. సెలెబ్రిటీల పేర్లు, ఫోటోలు, వీడియోలని వారి అనుమతి లేకుండా.. తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు కొందరు . సోషల్ మీడియాలో వారు చేస్తున్న కొన్ని పోస్టుల వల్ల స్టార్ హీరోలు, హీరోయిన్ల ప్రతిష్ఠ దెబ్బ తింటోంది. దాంతో ఈ ప్రమాదాన్ని పసిగట్టిన సెలబ్రిటీలు.. వెంటనే కోర్టులను ఆశ్రయిస్తున్నారు.

56
కోర్టులను ఆశ్రయించిన సెలబ్రిటీలు వీళ్లే..

రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవికి కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. దీనితో చిరంజీవి వెంటనే కోర్టుని ఆశ్రయించి తన వ్యక్తిగత హక్కులని కాపాడేలా పిటిషన్ వేశారు. చిరంజీవి, ఎన్టీఆర్ తో పాటు గతంలో నాగార్జున, పవన్ కళ్యాణ్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ లాంటి సెలెబ్రిటీలు కూడా తమ హక్కుల కోసం కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వారికి అనుకూలంగా తీర్పు కూడా వచ్చింది. ఇక తాజాగా తారక్ కూడా ఆ లిస్ట్ లో చేరిపోయాడు.

66
ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ దేవర, వార్ 2 సినిమాల్లో నటించగా.. వార్ 2 ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే.. దేవర పార్ట్ 2 షూటింగ్ లో ఎన్టీఆర్ జాయిన్ కాబోతున్నట్టు సమాచారం.

Read more Photos on
click me!

Recommended Stories