ఫిల్మ్ ఇండస్ట్రీలో విలువలకు విలువిచ్చేవారు ఎంతో మంది ఉన్నారు. కోట్లు ఇస్తామన్నా.. తమరూల్స్ ను వారు బ్రేక్ చేయరు.. ఓ యాడ్ ఫిల్మ్ కోసం 40 కోట్లు ఆఫర్ చేసినా.. స్టార్ హీరో మాత్రం నో చెప్పాడట. ఇంతకీ ఎవరా హీరో? ఎందుకు నో చెప్పాడో తెలుసా.
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు కోట్లు సంపాదిస్తుంటారు. సినిమాలు మాత్రమే కాకుండా.. ఇతర మార్గాల ద్వార కూడా వారికి భారీ గా ఆదాయం వస్తుంటుంది. సినిమాల్లో నటించడంతో పాటు కొంత మంది ప్రకటన ద్వారా కోట్లు గడిస్తున్నారు. నాలగైదు నిమిషాల కోసం 10 కోట్లు పైనే తీసుకునే తారులు ఎంతో మంది ఉన్నారు. వాటితో పాటు హీరోయిన్లు సొంతంగా క్లాత్, జ్యువెల్లరీ బ్రాండ్స్ ను స్ట్రార్ట్ చేసి.. ఆన్ లైన్ వ్యాపారాల ద్వారా కూడా భారీగా సంపాదిస్తుంటారు. ఈ క్రమంలో కొంత మంది తారలు మాతరం కొన్ని నియమాలు పెట్టుకుని.. వాటి పరిదులు దాటకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
24
యాడ్ ఫిల్మ్స్ ద్వారా కోట్ల ఆదాయం..
కొంత మంది నటీనటులు ఒక్క సినిమాతో ఎంత పారితోషికం అందుకుంటారో, అదే స్థాయిలో కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా సంపాదిస్తుంటారు. అయితే, ఆ ప్రకటనల ఎంపిక విషయంలో కొందరు స్టార్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాంటిదైనా సరే.. రెమ్యునరేషన్ భారీగా ఇస్తే చేసేవారు చాలామంది ఉన్నారు. కానీ ప్రజలను ఇబ్బంది పెట్టి, వారి ఆరోగ్యాలకు హానికర ఉత్పత్తులను ప్రోత్సహించే ప్రకటనలు వస్తే.. నిర్మొహమాటంగా తిరస్కరించే వారు కొందరు ఉన్నారు. వారిలో బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి ఒకరు.
34
40 కోట్ల ఆఫర్ ను తిరస్కరించిన సునీల్ శెట్టి..
బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి.. యాడ్ ఫిల్మ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్వవహరిస్తున్నారు. ఎన్ని కోట్లు ఇస్తామన్నా.. ప్రజలకు హాని కలిగించే ప్రాడెక్ట్స్ విషయంలో.. తాను ప్రకటన చేయను అని చెప్పేశాడట సునీల్ . రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి మాట్లాడుతూ, పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన ఓ ప్రకటన నా దగ్గరకు వచ్చింది. దానికోసం 40 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తామంటూ.. ఆఫర్ చేశారు. కానీ ఆ యాడ్‌ను నేను చేయను అని చెప్పి తిరస్కరించాను. నా పిల్లలు అహాన్, అతియా ఏ విషయంలో అయినా సరే నేను ఆదర్శంగా ఉండాలని అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఇలా పొగాకు ఉత్పత్తులను ప్రమోట్ చేసి.. ఎలా ఆదర్శం అవ్వగలుగుతాను. అందుకే తన పిల్లలకు చెడ్డ పేరు వచ్చే పనులు నేను చేయదలుచుకోవడంలేదు''. అని సునిల్ శెట్టి అన్నారు.
కెరీర్ బిగినింగ్ లో సునీల్ శెట్టి చాలా తిరస్కారాలు ఫేస్ చేశాడు. ఆయన లుక్ కారణంగా ఆయన్ను రకరకాలుగా అవమానించారు. ఏ దర్శకుడు సునీల్ కు అవకాశం ఇవ్వలేదు, ఏ హీరోయిన్ కూడా ఆయనతో జత కట్టడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. సినిమాలు ఆయనకు చేతకావని విమర్శించారట. 1992లో 'బల్వాన్' సినిమాతో సునీల్ శెట్టి కెరీర్ మొదలైంది. 1994లో వచ్చిన 'మొహ్రా' ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. తర్వాత 'గోపి కిషన్'లో డబుల్ రోల్ చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత తిరిగి చూసుకోలేదు బాలీవుడ్ హీరో.