శృతి హాసన్, హనీ రోజ్ కాదు..ఆ మూవీలో బాలకృష్ణ తర్వాత నేనే, రిపోర్టర్ కి వరలక్ష్మి దిమ్మతిరిగే సమాధానం

First Published Apr 24, 2024, 1:22 PM IST

సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె గా ఇండస్ట్రీలో వచ్చింది వరలక్ష్మి. అయితే ఆమె హీరోయిన్ గా పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్, నెగిటివ్ రోల్స్ తో అదరగొడుతోంది. 

Varalaxmi sarathkumar

సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె గా ఇండస్ట్రీలో వచ్చింది వరలక్ష్మి. అయితే ఆమె హీరోయిన్ గా పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్, నెగిటివ్ రోల్స్ తో అదరగొడుతోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఆమెని వరిస్తున్నాయి. రీసెంట్ గా వరలక్ష్మి శరత్ కుమార్ పాన్ ఇండియా సంచలనం హను మాన్ చిత్రంలో హీరో సోదరి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. 

వరలక్ష్మి నిర్భయంగా మాట్లాడే నటి. ఎలాంటి విషయాన్ని అయినా ఆమె మొహమాటం లేకుండా చెప్పేస్తారు. ప్రస్తుతం ఆమె కెరీర్ పీక్ స్టేజ్ లో ఉందనే చెప్పాలి. ఇటీవల ఆమె తన ప్రియుడు సచ్ దేవ్ అనే వ్యక్తిని నిశ్చితార్థం చేసుకుంది. త్వరలో పెళ్లి కూడా ఉండబోతోంది. 

అయితే వరలక్ష్మి తనకి వస్తున్న ఆఫర్స్ తో బిజీగా ఉంది. వరలక్ష్మి నటించిన శబరి చిత్రం మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా వరలక్ష్మి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశంలో రిపోర్టర్ తో వరలక్ష్మికి స్వల్ప వాగ్వాదం జరిగింది. తనని రిపోర్టర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని సంబోధించడంతో వరలక్ష్మి నచ్చలేదు. 

దీనితో తనదైన శైలిలో రిపోర్టర్ కి వరలక్ష్మి ఘాటు కౌంటర్ ఇచ్చింది. నేను క్యారెక్టర్ ఆర్టిస్టా.. నేను క్యారెక్టర్ ఆర్టిస్టా, మెయిన్ లీడా, హీరోయినా అనేది పట్టించుకోను. అయినా నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని ఎవరు చెప్పారు ? అని ప్రశ్నించింది. సాధారణంగా హీరో హీరోయిన్లు కాకుండా వేరే పాత్రలని క్యారెక్టర్ రోల్స్ అంటారు అని రిపోర్టర్ అన్నారు. వీరసింహారెడ్డి, హనుమాన్, నాంది లాంటి చిత్రాల్లో అలాంటి పాత్రలే చేసారు కదా అని రిపోర్టర్ అన్నారు. 

సరే అయితే.. వీర సింహారెడ్డి చిత్రంలో హీరోయిన్ల కంటే ఎవరి పాత్ర ఎక్కువ ఉంది అని ప్రశ్నించింది.. మీదే అని రిపోర్టర్ అన్నారు. అయితే బాలకృష్ణ తర్వాత ఆ సినిమాలో నేనే లీడ్. హీరోయిన్లకంటే నా పాత్రే ఎక్కువ కాబట్టి నేనే లీడ్. బాలయ్యతో డ్యాన్స్ చేయలేదు కాబట్టి నన్ను క్యారెక్టర్ రోల్ అని అనొద్దు అంటూ వరలక్ష్మి పేర్కొంది. ఈ చిత్రంలో శృతి హాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. 

శబరి లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో కొత్త దర్శకుడు, కొత్త నిర్మాతతో వర్క్ చేయడం రిస్క్ అనిపించలేదా అని ప్రశ్నించగా.. రిస్క్ తీసుకుంటేనే సక్సెస్ వస్తుంది. ఏ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో ఎవరూ చెప్పలేరు అని వరలక్ష్మి పేర్కొంది. 

click me!