ఎన్టీఆర్, త్రివిక్రమ్, సమంత ఎవరూ కాపాడలేకపోయారు.. మొత్తానికి నేలమట్టం, పదేళ్లలో ఇదే దారుణం

First Published | Oct 14, 2024, 2:16 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల హవా సాగుతోంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేదు. మంచి కంటెంట్ తో వస్తే దేశం మొత్తం ఆదరణ లభిస్తోంది.

ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల హవా సాగుతోంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేదు. మంచి కంటెంట్ తో వస్తే దేశం మొత్తం ఆదరణ లభిస్తోంది. కల్కి, దేవర లాంటి చిత్రాలు దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ని మెప్పించే కంటెంట్ తో వచ్చి విజయం సాధించాయి. 

ఈ క్రమంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా సత్తా చాటుతున్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్రంతో అలియా భట్ సౌత్ లో కూడా గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లయ్యాక అలియా భట్ వైవిధ్యమైన చిత్రాలపై దృష్టిపెట్టింది. అలియా భట్ నటించిన లేటెస్ట్ మూవీ జిగ్రా. వాసన్ బాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 11న విజయదశమి కానుకగా ఈ చిత్రం విడుదలైంది. పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి తెలుగులో కూడా చాలా గ్రాండ్ గా ప్రొమోషన్స్ చేశారు. 


ఆర్ఆర్ఆర్ క్రేజ్ ని ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. ప్రతి ఇంటర్వ్యూలో రాంచరణ్, ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చింది. దేవర చిత్ర ప్రమోషన్స్ తో కలిపి కరణ్ జోహార్ జిగ్రా చిత్రాన్ని కూడా ప్రమోట్ చేశారు. కరణ్ జోహార్ ఇంటర్వ్యూలో దేవర X జిగ్రా అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. ఎన్టీఆర్, అలియా భట్ కలసి ఇంటర్వ్యూలో పాల్గొన్న సంగతి తెలిసిందే. దీనితో జిగ్రా చిత్రానికి మంచి హైప్ వచ్చింది. 

Also Read : విధి విచిత్రం అంటే ఇదే.. అన్నా చెల్లెళ్లుగా నటించారు, అదే ఏడాది పెళ్లి చేసుకున్నారు.. వాళ్ళు పెద్ద స్టార్లు

Trivikram Srinivas

అదే విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సమంత, త్రివిక్రమ్ లాంటి వాళ్ళు అతిథులుగా హాజరయ్యారు. దీనితో వామ్మో అలియా భట్ ఈ సరి గట్టిగా కొట్టేట్లు ఉందే అని అంతా భావించారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక అసలు రంగు బయట పడింది. సినిమాలో మ్యాటర్ లేదు. దీనితో కనీసం ఓపెనింగ్స్ రాలేదు. పండుగ రోజు కూడా ఈ చిత్రానికి అంతగా కలసి రాలేదు. 

Also Read: దేవర, కల్కి, సలార్ చిత్రాలపై విషం కక్కారు.. 3 గంటల పాటు కర్ణుడినే చూపించాలా?

పండుగ రోజు మాత్రమే జిగ్రా చిత్రానికి 6.5 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చింది. మిగిలిన అన్ని రోజుల్లో వసూళ్లు దారుణంగా పడిపోయాయి. సోమవారం నుంచి థియేటర్లు పూర్తిగా ఖాళీ అయినట్లు టాక్. అలియా భట్ పదేళ్ల కెరీర్ లో ఆమె చిత్రానికి ఇదే అత్యంత దారుణమైన ఓపెనింగ్ కలెక్షన్స్ అని హిందీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంతో దారుణ నష్టాలు ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా అలియా భట్ జిగ్రా చిత్రాన్ని ఎన్టీఆర్, త్రివిక్రమ్, సమంత ఎవరూ కాపాడలేకపోయారు. 

Latest Videos

click me!