సినిమా షూటింగ్ మొదలైన 15 రోజుల తర్వాత కథ విన్నాను: మహేష్

First Published | Oct 14, 2024, 1:10 PM IST

కేవలం క్యారక్టర్ చెప్పగాని కనెక్ట్ అయ్యిపోయి సినిమా మొదలెట్టేసామని చెప్పారు. పది హేను రోజులు షూటింగ్ జరిగాక పూరి జగన్నాథ్ పట్టుబట్టి కథ ని వినిపించారని చెప్పుకొచ్చారు.

Mahesh Babu


సినిమా పరిశ్రమలో కొన్ని విషయాలు వినటానికి ఆశ్చర్యంగా ఉంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోలు ..స్టార్ డైరక్టర్స్ పట్ల ఉండే నమ్మకం అలాంటిది. సాధారణంగా సినిమా ప్రారంభానికి ముందు డైరక్టర్ కథ పట్టుకుని హీరో దగ్గరకు వెళ్తాడు. నేరేషన్ ఇస్తారు. కథ నచ్చిన తర్వాతే పట్టాలు ఎక్కుతుంది. ఈ క్రమంలో హీరో ఏమైనా సజెషన్స్ ఇస్తే వాటిని తీసుకుని స్క్రిప్టు తిరగ రాస్తూంటారు. ఇదో ప్రాసెస్ గా సినిమా పరిశ్రమలో జరుగుతూంటుంది. అందుకు మహేష్ బాబు అతీతుడు కాదు. కానీ ఆయన కూడా కథ వినకుండా డైరక్టర్ మీద నమ్మకంతో కేవలం క్యారక్టరైజేషన్ విని షూటింగ్ ప్రారంభమయ్యాక పూర్తి కథ విన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది.


తన కెరీర్ లో అలాంటిది సంఘటన జరిగిందని మహేష్ బాబు స్వయంగా చెప్పుకొచ్చారు ఓ సారి. ఆ దర్శకుడు మరెవరో కాదు పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ మీద విపరీతమైన నమ్మకం మహేష్ బాబుకి. కాబట్టి సినిమా కథేంటి అని అడగాల్సిన అవసరం లేదనిపించిదంని అన్నారు. కేవలం క్యారక్టర్ చెప్పగాని కనెక్ట్ అయ్యిపోయి సినిమా మొదలెట్టేసామని చెప్పారు. పది హేను రోజులు షూటింగ్ జరిగాక పూరి జగన్నాథ్ పట్టుబట్టి కథ ని వినిపించారని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ సినిమా మరెదో కాదు.

Latest Videos



పూరి జగన్నాథ్, మహేష్ బాబుల కెరీర్ లో బ్లాక్ బస్టర్ అయిన బిజినెస్ మ్యాన్. సూపర్‌స్టార్‌ మహేష్‌ - డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ల 'పోకిరి' కాంబినేషన్‌లో ఆర్‌.ఆర్‌. మూవీ మేకర్స్‌ పతాకంపై అగ్రనిర్మాత డా|| వెంకట్‌ నిర్మించిన ప్రెస్టీజియస్‌ మూవీ 'బిజినెస్‌ మేన్‌'.   పోకిరి తర్వాత మహేష్‌, నేను కలిసి చేస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. వారి ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్‌ అయ్యేలా ఈ సినిమా వచ్చింది.


 ఈ సినిమాలో మహేష్‌ క్యారెక్టర్‌ పేరు సూర్య. హీరోయిజమ్‌ని పీక్‌ లెవల్‌కి తీసుకెళ్ళే సూర్య క్యారెక్టర్‌ని మహేష్‌ ఎక్స్‌లెంట్‌గా చేశారు. మహేష్‌, కాజల్‌పై తీసిన పాటలు చాలా ఎక్స్‌లెంట్‌గా వచ్చాయి.  'దూకుడు' తర్వాత థమన్‌ ఈ చిత్రానికి మళ్ళీ అద్భుతమైన మ్యూజిక్‌ చేశాడు.

ఈ సినిమా దాంతో మ్యూజికల్ గానూ సూపర్ హిట్ అయ్యింది. నెగిటివ్ రోల్ లాంటి డిఫ‌రెంట్ పాత్ర‌లో మ‌హేశ్ న‌ట‌న అదుర్స్ అనిపించేలా ఉండ‌డంతో ప్రేక్ష‌కులు ఈ చిత్రానికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.  ఈ చిత్రం వచ్చి ప‌దేళ్లు దాటినా క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. సినిమాలోని డైలాగ్‌లు మీమ్స్ రూపంలో ఇప్ప‌టికీ క‌నిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమా రీ రిలీజ్‌లో కూడా బాగానే వర్కవుట్ అయ్యింది.

ఈ సినిమా గురించి మహేష్ మాట్లాడుతూ...ఈ సినిమా ఈ స్దాయి సక్సెస్ కు కారణం టెర్రిఫిక్ క్యారక్టరైజేషన్. డైలాగ్స్.  అలగే మాఫియా డాన్ ...గవర్నమెంట్ ని రూల్ చేయటాన్ని సమర్దించటం వంటివేమీ లేవు. ఇది బేసిక్ గా సినిమా. చెడుని గ్లామరైజే చేస్తున్నట్లు అయితే అనిపించలేదు.

ఎందుకంటే మేము ప్రమోషన్స్ ఎప్పుడూ ఫ్యామిలీ డ్రామా తీస్తున్నామని చెప్పలేదు. సినిమా చూసినవాళ్లంతా చాలా ఇన్స్పైరింగ్ స్టోరీగా అనిపించిందని అన్నారు. ఇక ఈ చిత్రం కథ నేను కేవలం షూటింగ్ మొదలైన 15 రోజులు తర్వాతే విన్నాను. జగన్ గారు కేవలం పది నిముషాలే చెప్పారు. అప్పుడే అర్దమైంది. నాది చాలా టెర్రిఫిక్ క్యారక్టర్ అని. అని బిజినెస్ మేన్ కథ గురించి చెప్పుకొచ్చారు మహేష్ బాబు. 

 మహేష్ బాబుతో రాజమౌళి తదుపరి సినిమాకు ప్లాన్‌ చేస్తున్న విషయం తెల్సిందే. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా అద్భుతమైన కథాంశం ను రెడీ చేసినట్లు రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. రాజమౌళి ఇప్పటి వరకు టచ్ చేయని జోనర్‌, మహేష్ బాబు ఎప్పుడూ నటించని కాన్సెప్ట్‌ తో ఈ సినిమా రూపొందబోతున్నట్లు ఆయన చెప్పుకొచ్చాడు. సినిమా ఇంకా అధికారికంగా ప్రారంభం కాలేదు. కనీసం అధికారికంగా ప్రకటన కూడా రాలేదు. ఈ ఏడాదిలో సినిమా ను ప్రారంభించి, వచ్చే ఏడాది ఆరంభంలో రెగ్యులర్‌ షూటింగ్‌ కు వెళ్లాలని రాజమౌళి భావిస్తున్నాడు.

click me!