బాలకృష్ణ, ఎన్టీఆర్‌కి ఈ మధ్య పడటం లేదు. వారి మధ్య గ్యాప్ వచ్చింది. కానీ బాలయ్య బాబాయ్‌పై ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నా గుండె కోస్తే వచ్చేది బాలకృష్ణనే అని చెప్పడం విశేషం.
బాలకృష్ణ నటించిన `అఖండ 2` సినిమా విడుదలకు ఇంకా రెండు రోజులే ఉంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది టీమ్. అయితే బాలయ్యకి, ఎన్టీఆర్‌కి ఈ మధ్య పడటం లేదనే విషయం తెలిసిందే. చాలా రోజులుగా వీరి మధ్య గ్యాప్ కొనసాగుతుంది. అది ఈ మధ్య చాలా పెరిగిపోయింది. చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ స్పందించకపోవడంతో ఆ గ్యాప్ మరింత పెరిగింది. ఎన్టీఆర్‌ని ఇప్పుడు బాలయ్య అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు బాలయ్యపై కూడా తారక్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఓ రకంగా అభిమానుల మధ్య వార్ నడుస్తోంది. అదే సమయంలో ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.
25
బాలయ్య బాబాయ్‌పై ఎన్టీఆర్ ప్రశంసలు
ఈ క్రమంలో ఇప్పుడు ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బాలయ్యపై జూ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి. బాలయ్య సినిమా విడుదల సమయంలో ఆయనపై తారక్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. గతంలో ఎన్టీఆర్.. తన బాబాయ్ బాలయ్యని ఉద్దేశించి పాజిటివ్‌గా కామెంట్స్ చేశారు. ఆయన్ని ఆకాశానికి ఎత్తేశారు. ఆయన మనసు చాలా మంచిది అని, ఫ్యామిలీలో ఆయనంటేనే తనకు ఎక్కువ ఇష్టమని, ఆయన తర్వాతనే ఎవరైనా అని కామెంట్ చేశారు తారక్. దీన్ని ఇప్పుడు నందమూరి అభిమానులు వైరల్ చేయడం విశేషం. ఇంతకి తారక్ ఏం కామెంట్ చేశాడనేది చూస్తే,
35
నా గుండె కోస్తే వచ్చేది బాలయ్య బాబాయ్
`అదుర్స్` ఆడియో ఈవెంట్‌కి బాలయ్య గెస్ట్ గా వచ్చారు. ఆ సమయంలో బాబాయ్‌ని ఉద్దేశించి ఎన్టీఆర్ మాట్లాడుతూ, నా గుండె కోస్తే వచ్చేది ఎన్టీఆర్ అని బాలయ్య చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, నా గుండె కోస్తే వచ్చేది బాలయ్య బాబాయ్` అని చెప్పడం విశేషం. ఈ మాటతో అక్కడ ప్రాంగణమంతా హోరెత్తిపోయింది. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో పాల్గొన్న ఎన్టీఆర్‌కి నందమూరి ఫ్యామిలీలో మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు అని రాధాకృష్ణ ప్రశ్నించగా, బాలయ్య బాబాయ్ అంటే చాలా ఇష్టమని తెలిపారు. ఆయన అద్భుతమైన మనిషి, చాలా మంచి మనసు ఆయనది అని తెలిపారు. ఆయన ఎప్పుడూ మూడీగా ఉంటారని అంటుంటారు అని అడగ్గా, బయట తెలిసీ తెలియకుండా ఏదేదో వాగుతుంటారని చెప్పాడు.
`సింహ` మూవీ ఈవెంట్‌కి ఎన్టీఆర్ గెస్ట్ గా వెళ్లారు. అందులో మాట్లాడుతూ, `మా బాలయ్య బాబాయ్‌కి కొడుకుకి తక్కువగా, అభిమానిగా ఎక్కువ. మీ అందరితోపాటే నేను కూడా. చాలా కాలంగా ఎదురుచూశాను బాబాయ్. ఈ సారి రావాల్సిందే, వచ్చేస్తున్నాం, కొట్టేస్తున్నాం. ఇక మొహమాటమే లేదు` అని తెలిపారు. దీనికి బాలయ్య కూడా నవ్వుతూ, ఆయనకు ఓకే అంటూ తలూపడం విశేషం. ఈ అరుదైన వీడియో క్లిప్స్ ని మెర్జ్ చేసి అభిమానులు వైరల్ చేస్తున్నారు. నందమూరి అభిమానులను ఇది ఎంతగానో ఆకట్టుకుంటుంది.
55
ఈ నెల 5న అఖండ 2 విడుదల
ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన `అఖండ 2 తాండవం` భారీ స్థాయిలో ఈ నెల 5న విడుదల కాబోతుంది. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ఆయన మూడు రకాల గెటప్స్ లో కనిపించబోతున్నారు. సినిమాలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తుండగా, హర్షాలి, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆదిపినిశెట్టి విలన్‌గా నటిస్తుండటం విశేషం. సినిమాపై భారీ అంచనాలున్నాయి. పైగా ఈ శుక్రవారం సింగిల్‌గా ఈ మూవీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ ని రాబట్టే అవకాశం ఉంది.