నయనతార బాటలో సమంత, డైరెక్టర్లను పెళ్లాడిన హీరోయిన్లు ఇంకెవరున్నారో తెలుసా?

Published : Dec 03, 2025, 10:41 AM IST

Heroines Married Directors హీరోయిన్ సమంత.. డైరెక్టర్ రాజ్ నిడిమోరును ప్రేమించి పెళ్లాడింది. అంతకు ముందు నయనతార, రోజా..సోనాలీ బింద్రే.. ఇలా డైరెక్టర్లు పెళ్ళి చేసుకున్న తెలుగు స్టార్ హీరోయిన్లు ఇంకా ఎవరున్నారో తెలుసా? 

PREV
17
సమంత - రాజ్ నిడుమోరు

ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సమంత - రాజ్ నిడుమోరు పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజ్ ను రెండో పెళ్లి చేసుకుంది. అక్కినేని నాగ చైతన్యకు విడాకుల తర్వాత సమంత తనతో రెండు వెబ్ సిరీస్ లను తెరకెక్కించిన దర్శకుడితో ప్రేమలో పడింది. రాజ్ అండ్ డీకే దర్శక ద్వయంలో.. రాజ్ నిడిమోరు ఒకరు. ఇక వీరి పెళ్లి డిసెంబర్ 1 సోమవారం ఈషా ఫౌండేషన్ లో జరిగింది.

27
నయనతార -విఘ్నేష్ శివన్

ఫిల్మ్ ఇండస్ట్రీలో దర్శకులను పెళ్ళాడిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. వారిలో నయనతార కూడా ఒకరు. గతంలో శింబు, ప్రభుదేవతో ప్రేమలో పడి విఫలం అయిన నయనతార.. ముచ్చటగా మూడోసారి దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది. దాదాపు 5 ఏళ్లు లివింగ్ లో ఉన్న వీరు... పెళ్లి చేసుకుని సరోగసి ద్వారా కవలపిల్లలకు తల్లీ తండ్రులు కూడా అయ్యారు. నయనతార తో పలు చిత్రాలను తెరకెక్కించాడు విఘ్నేష్ శివన్.

37
రమ్యకృష్ణ - కృష్ణవంశీ

టాలీవుడ్ శివగామి రమ్యకృష్ణ కూడా దర్శకుడు కృష్ణవంశీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 90స్ లో రమ్యకృష్ణ స్టార్ హీరోయిన్. ఆతరువాత కాలంలో ఆమె క్యారెక్టర్ రోల్స్ చేసింది. ఇక తనతో ఒకటి రెండు చిత్రాలను తెరకెక్కించిన క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీని ప్రేమించి పెళ్లి చేసుకుంది శివగామి. వీరిద్దరి కాంబోలో వచ్చిన చంద్రలేఖ సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా టైమ్ లోనే వీరి మనసులు కలిసి ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది.

47
రోజా - సెల్వమణి

90వ దశకంలో తెలుగు, తమిళ తెరను ఏలింది రోజా. హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉన్న టైమ్ లోనే రోజా తమిళ దర్శకుడు, నిర్మాత అయినసెల్వమణితో ప్రేమలోపడింది. రోజాతో తమిళంలో హిట్ సినిమాలు చేశారు సెల్వమణి. పెద్దల అంగీకారంతో రోజా సెల్వమణి ఒక్కటయ్యారు. వారికి ఇద్దరు పిల్లలుకాగా ఇద్దరు ఉన్నత చదువుల్లో బిజీగా ఉన్నారు. సెల్వమణి తమిళ వ్యక్తి అయినా.. రోజా తెలుగు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.

57
షుహాసిని - మణిరత్నం

ఇక తెలుగు, తమిళ తెరపై స్టార్ హీరోయిన్ గా వెలిగిన మరో హీరోయిన్ సుహాసిని. కమల్ హాసన్ అన్న కూతురుగా వారసత్వంతో ఇండస్ట్రీకి వచ్చినా.. తన నటనతో ఆమె అద్భుతంచేసింది. ఇక దేశం గర్వంచే దర్శకుల్లో ఒకరైన మణిరత్నంను సుహాసిన ప్రేమించి పెళ్లి చేసుకుంది. 80, 90 దశకంలో సుహాసిని తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటింది. తెలుగులో ఆమె మెగాస్టార్ చిరంజీవి, శోభన్ బాబు లాంటి స్టార్స్ తో నటించి మెప్పించింది.

67
కుష్బూ - సుందర్

డైరక్టర్ ను పెళ్లాడిన మరో సీనియర్ హీరోయిన్ కుష్బూ. తెలుగుతో పాటు తమిళంలో హీరోయిన్ గా రాణించిన కుష్బూ.. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే.. దర్శకుడు సుందర్ సి ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సుందర్ తమిళంలో స్టార్ డైరెక్టర్ గా ఉన్నారు. రజినీకాంత్ తో అరుణాచలం లాంటి సూపర్ హిట్ సినిమాలు ఆయన డైరెక్ట్ చేశారు.

77
డైరెక్టర్లను పెళ్లాడిన మరికొందరు హీరోయిన్లు

డైరెక్టర్లతో ప్రేమలో పడి పెళ్ళాడిన హీరోయిన్లు ఇంకా చాలామంది ఉన్నారు. తెలుగువారి మనసులు దోచిన హీరోయన్ సోనాలీ బింద్రే.. దర్శకుడు గోల్డీ బెహల్ ను ప్రేమించి పెళ్లాడింది. ఆమెకు క్యాన్సర్ వచ్చిన టైమ్ లో ఎంతో సపోర్ట్ గా నిలిచి.. తన భార్యకు అండగా నిలబడ్డాడు గోల్డీ. ఇక కొంత మంది హీరోయిన్లు మాత్రం దర్శకులను పెళ్లి చేసుకుని.. విడాకులు కూడా తీసుకున్నారు. వారలోఅమలా పాల్, విజయ్, కల్యాణి, కిరణ్ లాంటి వారు ఉన్నారు. పాత తరం హీరోయిల్లలో భానుమతి డైరెక్టర్ రామకృష్ణను, అంజలీ దేవి ఆదినారయణ రావు ను పెళ్లాడారు.

Read more Photos on
click me!

Recommended Stories