Illu Illalu Pillalu Today Episode Dec 3: తిరుపతిని ఇంట్లోంచి గెంటేసిన రామరాజు, వల్లికి వార్నింగ్

Published : Dec 03, 2025, 09:11 AM IST

Illu Illalu Pillalu Today Episode Dec 3: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో పోయిన నగలను పట్టుకొని తిరుపతి రామరాజు దగ్గరకు వస్తాడు. నగలను తానే దాచానని చెబుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకోండి. 

PREV
15
నగలను తెచ్చిన తిరుపతి

వల్లి తన పేరు బయటకు రాకుండా ఉండాలని తిరుపతిని తన మాటలతో బుట్టలో పడేస్తుంది. పోయిన నగలను తీసుకొచ్చి తిరుపతే దాచి ఉంచినట్టు చెప్పమని అడుగుతుంది. ప్రేమ కోసమే ఇదంతా చేయమని బతిమిలాడుతుంది. వల్లి మాట్లాడిన సెంటిమెంట్ డైలాగులకు తిరుపతి ఆమె ట్రాప్ లో పడిపోతాడు. ఆ నగలను పట్టుకొని రామరాజు దగ్గరకు వెళ్తాడు. ‘పోయిన నగలను దాచి పెట్టాను బావ’ అని రామరాజుకి చెబుతాడు. రామరాజు ఆ నగలు ఎక్కడి నుంచే వచ్చేయని అడుగుతాడు. 

దీంతో తిరుపతి ప్రేమ పుట్టింటి జ్ఞాపకాలను తిరిగి ఇవ్వడం ఇష్టం లేక తానే దాచి పెట్టి ఉంచానని, ప్రేమ సంతోషం కోసమే అలా చేశానని చెబుతాడు. తిరుపతి అసలైన నగల స్థానంలో రోల్డ్ గోల్డ్ నగలను పెట్టి పంపించానని చెప్పడంతో రామరాజు చెంపలు వాయిస్తాడు. దీంతో నర్మద, ప్రేమ ఎంతో బాధపడతారు.

25
పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చేది

రామరాజు కోపంతో తిరుపతి షర్టును పట్టుకొని ‘నీకు తమాషాగా ఉందా? చిన్న పిల్లల ఆటలా ఉందా? వారు ఎన్నెన్ని మాటలు అంటున్నారు.. వినలేదా? నన్ను ఎలా అవమానించడానికి గోతి కాడ నక్కలాగా కాచుకొని ఉన్నారు. ఈ విషయం తెలిసి కూడా నువ్విలా నగలు దాచిపెట్టి వారికి రోల్డ్ గోల్డ్ నగలు పంపిస్తావా’ అంటూ కొట్టడానికి వెళ్తాడు. తిరుపతి కొట్టొద్దు బావ అని ఎంత వేడుకున్నా రామరాజు ఆగకుండా తిడుతూనే ఉంటాడు. ‘ఒకవేళ నువ్వు నగలు తీసుకురాకపోతే మీ వాళ్ళు చెప్పినట్టుగా నేను మరొకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించేవారు కదా’ అని అరుస్తాడు. ఈ లోపు వల్లి వచ్చి అడ్డుకుంటుంది.

 ‘తిరుపతి బాబాయ్ చేసింది తప్పే మామయ్య’ అంటుంది. కానీ ప్రేమ మనసులోని బాధను ఒక బాబాయిగా తండ్రి స్థానంలో ఉండి ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నాడని సర్ది చెబుతుంది. ప్రేమ పుట్టింటి నగలు ప్రేమ దగ్గరే ఉండాలన్న విశాల హృదయంతో ఆలోచించి ఇలా చేశాడు మామయ్యా అని ఏదో సర్ది చెబుతుంది. తిరుపతిని క్షమించి వదిలేయమని కోరుతుంది. వేదవతి కూడా తిరుపతి నే సపోర్ట్ చేస్తుంది. ప్రేమ కోసమే అలా చేశాడని అంటుంది.

35
నగలతో సేనా ఇంటికి

దాంతో రామరాజు కాస్త చల్లబడతాడు. తర్వాత తిరుపతి తో ‘ఇప్పుడు నువ్వు నాకు చెప్పినదంతా మీ వాళ్లకు కూడా చెప్పి ఆ నగలు వారికి ఇచ్చేసి రా’ అని చెబుతాడు. దీంతో తిరుపతి ఆ నగలను పట్టుకుని ఎదురింటికి బయలుదేరుతాడు. భద్రావతి, సేనాపతి ఇలా ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తాడు. భద్రావతితో ‘అక్కా ఇవి ప్రేమ నగలు. మీరు అప్పుడు ప్రేమకు పంపించిన నగలు ఇవే. కావాలంటే మీరు ఎవరినైనా పిలిపించి చెక్ చేయించుకోండి’ అని చెబుతాడు. 

దానికి భద్రావతి ‘ఇప్పటివరకు తెలియదని అన్నావు. ఇప్పుడు ఎలా దొరికాయి’ అని ప్రశ్నిస్తుంది. సేనాపతి కోపంతో తిరుపతి చెంప మీద కొడతాడు. కోపంగా భద్రావతి, సేనాపతి రామరాజు ఫ్యామిలీ దగ్గరికి వస్తారు. ‘ఏంట్రా రామరాజు తమాషాగా ఉందా? నగల గురించి తెలియదని చెప్పి ఇప్పుడు పంపిస్తే వెంటనే తీసుకుంటామని ఎలా అనుకున్నావు ’అని అరుస్తుంది.

45
ప్రేమ దగ్గరికే చేరిన నగలు

దానికి రామరాజు కోపంగా తిరుపతితో ‘నువ్వు చేసిన ఘనకార్యం ఏంటో వాళ్లకు చెప్పు’ అని అంటాడు. తిరుపతి తానే ప్రేమ నగలను దాచి పెట్టానని, పుట్టింటి నగలను ప్రేమ జ్ఞాపకంగా దాయాలనుకున్నానని ఏదో కామెడీగా చెప్పేస్తాడు. దాంతో మళ్లీ సేనాపతి చేతిలో దెబ్బలు తింటాడు. రామరాజు మాట్లాడుతూ ‘వాడు చెప్పింది విన్నారు కదా.. ఆ నగల గురించి నాకు తెలియదని, నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా నగలు కొట్టేయడానికి ప్లాన్ వేశానని అన్నారు కదా ఇప్పుడు ఏమంటారు’అని ప్రశ్నిస్తారు. భద్రావతి మాత్రం నగలు కొట్టేసి గిల్టు నగలు పంపించి ఇప్పుడు బండారం బయటపడ్డాక ఇలాంటి కట్టు కథలు అల్లుతున్నామంటూ రామరాజును తిడుతుంది. 

తిరుపతితో ‘వాడు మన నాన్న ప్రాణాలకు పోవడానికి కారణమైన నమ్మకద్రోహి. అలాంటి వాడి ఇంట్లో నువ్వు ఉంటావా’ అని ప్రశ్నిస్తుంది. ఆ నగలు తీసుకోకుండా భద్రావతి విసిరేస్తుంది. చెల్లిని, మేనకోడల్ని పోగొట్టుకున్నాను ఈ నగలు నాకు ఒక లెక్క? ముష్టి వేస్తున్నాను తీసుకోండి అనేసి వెళ్ళిపోతుంది. ఆ ఆ నగలను ప్రేమ తల్లి తీసుకొచ్చి ‘ఇవి నీ నగలు నీకు మాత్రమే చెందాల్సినవి’ అని చెప్పి ప్రేమకు ఇచ్చేస్తుంది.

55
తిరుపతికి ఇంట్లోకి నో ఎంట్రీ

తిరుపతి ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నం చేసేసరికి రామరాజు అడ్డుకుంటాడు. చెంప దెబ్బ కొట్టి ఈ గొడవ జరగడానికి నువ్వే కారణం ఇకనుంచి నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెబుతాడు. తిరుపతి ఎంత బతిమిలాడిన రామరాజు ఒప్పుకోడు. దాంతో తిరుపతి ఒంటరిగా మిగిలిపోతాడు. ఇక్కడ నుంచి సీన్ వల్లి దగ్గరికి మారుతుంది. ఈ సమస్య నుంచి బయటపడడంతో రిలాక్స్ అవుతుంది. చావు దాక వెళ్లి వచ్చినట్టు ఉంది.. తిరుపతి తన మీద నగల విషయం వేసుకున్నాడు కాబట్టి సరిపోయింది లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో అని భయంతో తనలోతానే మాట్లాడుకుంటుంది వల్లి. ఈలోపు అక్కడికి నర్మద, ప్రేమ వస్తారు. 

నర్మద మాట్లాడుతూ ‘నా కాపురాన్ని కూల్చొద్దని వేడుకున్నావు కదా.. ఆ ఒక్క మాట దగ్గరే ఆగిపోయి నీ గురించి బయట పెట్టలేదు. ఇప్పటివరకు నువ్వు మీ అమ్మ చెప్పినట్టు ఆడావు. కుట్రలు చేశావు. ఇకపై ఒళ్ళు దగ్గర పెట్టుకొని మా విషయాల్లో వేలు పెట్టకుండా.. నీ పని నువ్వు చూసుకో. నీకు కాపురం సంగతి నువ్వు చూసుకో’ అని వార్నింగ్ ఇస్తుంది. వల్లి తను పూర్తిగా మారిపోయానని అంటుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories