సూపర్ హిట్ ఇచ్చిన హీరోయిన్ ని సెట్ లో కావాలని ఏడిపించిన మహేష్ బాబు! 

First Published | Oct 17, 2024, 6:27 PM IST

మహేష్ బాబు ఓ స్టార్ హీరోయిన్ ని సెట్స్ లో ఏడిపించాడట. దర్శకుడు చెప్పుకున్నా అలా చేశాడని సీనియర్ నటి తాజాగా కామెంట్స్ చేసింది. 
 

చైల్డ్ ఆర్టిస్ట్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన మహేష్ బాబు అనంతరం పూర్తి స్థాయి హీరోగా అరంగేట్రం చేశాడు. 1999లో విడుదలైన రాజకుమారుడు ఆయన డెబ్యూ మూవీ. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ మూవీలో సాంగ్స్ అద్భుతంగా ఉంటాయి. 

25 ఏళ్లకు పైగా కెరీర్లో మహేష్ బాబు ఆచితూచి సినిమాలు చేశాడు. టాక్ తో సంబంధం లేకుండా మహేష్ బాబు సినిమాలు బాక్సాఫీస్ కొల్లగొడతాయి. ముఖ్యంగా మహేష్ సినిమాలకు యూఎస్ లో మంచి మార్కెట్ ఉంది. అక్కడి ఆడియన్స్ అమితంగా ఇష్టపడతారు. 
 

Murari

మహేష్ నటించిన మురారి లవ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంది. మహేష్ బాబు-సోనాలీ బింద్రే జంటగా నటించారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ మురారి చిత్రానికి దర్శకుడు. మహేష్ బాబు ఇమేజ్ కి మురారి మూవీ చాలా ప్లస్ అయ్యింది. ఇక మణిశర్మ సాంగ్స్ అయితే ఎవర్ గ్రీన్. 

కాగా ఈ మూవీలో ఓ సాంగ్ లో సోనాలీ బింద్రేని నిజంగానే ఏడిపించేశాడట మహేష్ బాబు. ఈ విషయాన్ని నటి సుధ తాజాగా వెల్లడించింది. మురారి రీ రిలీజ్ నేపథ్యంలో సుధ అప్పటి సంగతులు పంచుకున్నారు. సోనాలీ బింద్రేను నేను, మహేష్ నిజంగానే ఏడిపించేశాము. షాట్ అయ్యాక సోనాలీ వచ్చి... డైరెక్టర్ చెప్పకపోయినా మీరు నన్ను ఏడిపించేశారు. నాకు తెలుసు అన్నదట. 


Murari

మురారి మూవీ గొప్ప అనుభవం. సోనాలీ బింద్రే గేదెను కడుగుతూ ఇచ్చే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా భలేగా ఉంటాయని సుధ చెప్పుకొచ్చారు. మహేష్ బాబుతో వంశీ, మురారి, పోకిరి, దూకుడు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించానని ఆమె వెల్లడించారు. 

రాజమౌళి-మహేష్ కాంబోలో మొదటి ప్రాజెక్ట్ గా ఎస్ఎస్ఎంబి 29 తెరకెక్కనుంది. దాదాపు రూ. 800 కోట్ల రూపాయల బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా ప్లాన్ చేస్తున్నారు. జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా అని ఇప్పటికే రాజమౌళి తెలియజేశారు. హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ తరహాలో సాగుతుందట 

Mahesh Babu

స్క్రిప్ట్ వర్క్ కోసమే రెండేళ్ల సమయం తీసుకున్నారు. జనవరి నుండి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మహేష్ బాబు ఈ చిత్రం కోసం సరికొత్తగా సిద్ధం అవుతున్నారు. ఎన్నడూ లేని విధంగా జుట్టు, గడ్డం పెంచాడు. ఎస్ఎస్ఎంబి 28లో మహేష్ ఎలా కనిపించనున్నాడనే ఆసక్తి పెరిగిపోయింది. 
 

Rajamouli and Mahesh Babu

రెండేళ్లకు పైగా ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ జరగనుందని సమాచారం. ఇండియా వైడ్ ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో హైప్ నెలకొంది. ఎస్ఎస్ఎంబి 29తో మహేష్ బాబు పాన్ ఇండియా బరిలో దిగనున్నారు. నెక్స్ట్ మహేష్ బాబు సందీప్ రెడ్డి వంగతో మూవీ చేసే అవకాశం కలదు. మహేష్ బాబు గత చిత్రం గుంటూరు కారం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. వసూళ్ల పరంగా మాత్రం సత్తా చాటింది. గుంటూరు కారం వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 
 

Latest Videos

click me!