రామ్‌ చరణ్‌లో ఉన్న పెద్ద బలహీనత బయటపెట్టిన ఎన్టీఆర్‌.. ర్యాగింగ్‌ వేరే లెవల్‌

First Published | Dec 29, 2024, 5:25 PM IST

రామ్‌ చరణ్‌లో ఒక బలహీనత ఉంది. దాన్ని బయటపెట్టాడు ఎన్టీఆర్‌. అంతేకాదు దారుణంగా ఆడుకున్నాడు. ఓ రకంగా ర్యాగింగ్‌ చేశాడు. మరి ఇంతకి ఆ బలహీనత ఏంటి?
 

గ్లోబల్‌ స్టార్‌గా అభిమానుల చేత పిలిపించుకుంటున్న రామ్‌ చరణ్‌ ప్రస్తుతం `గేమ్‌ ఛేంజర్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతుంది. దిగ్గజ దర్శకుడు శంకర్‌ డైరెక్షన్‌లో రూపొందిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి.

మొదటగా ఈ కాంబినేషనే అందరిలోనూ ఆసక్తిని పెంచింది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో టీమ్‌ బిజీగా ఉంది. ఏపీలోని విజయవాడలో గల వజ్ర గ్రౌండ్‌లో రామ్‌ చరణ్‌ ది అత్యధిక పొడవులో కటౌట్‌(256 ఫీట్స్) ఏర్పాటు చేశారు. దాన్ని ఈ రోజు లాంఛ్‌ చేస్తున్నారు. 
 

త్వరలోనే ఏపీలో ఓ భారీ స్థాయిలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఉండబోతుందట. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో చిరంజీవి, పవన్‌, బన్నీ, చరణ్‌తోపాటు ఇతర మెగా హీరోలంతా పాల్గొంటారని సమాచారం.

ఇది `గేమ్‌ ఛేంజర్‌` సినిమాకి ప్రమోషన్స్ ని తీసుకురావడమే కాదు, మెగా ఫ్యామిలీ ఒక్కటే అనే సందేశాన్నిచ్చే ఈవెంట్‌ కూడా కాబోతుందని తెలుస్తుంది. మరి బన్నీ నిజంగానే వస్తాడా అనేది ప్రశ్న. వస్తే మాత్రం వేరే లెవల్‌. పవన్‌, బన్నీ ఒకే స్టేజ్‌పై చూస్తే దాని రేంజ్‌ వేరేలా ఉండబోతుందని చెప్పొచ్చు. 
 


ఇదిలా ఉంటే తాజాగా రామ్‌ చరణ్‌కి సంబంధించిన ఓ వీక్‌ నెస్‌ బయటకు వచ్చింది. చరణ్‌, ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఇండస్ట్రీలో ఎక్కువగా ఈ ఇద్దరు కలుసుకుంటారు. వీరికి మహేష్‌ బాబు కూడా ఫ్రెండ్‌. ఈ ముగ్గురు స్నేహం చాలా రోజులుగా కొనసాగుతుంది.

మహేష్‌ ని పక్కన పెడితే ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కలిసి చివరగా `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో నటించారు. ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది. ఏకంగా ఆస్కార్‌ని కూడా గెలుచుకుంది. `నాటు నాటు` పాటకి ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో ఆస్కార్‌ వరించిన విషయం తెలిసిందే. 
 

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో రామ్‌ చరణ్‌కి సంబంధించిన పెద్ద రహస్యాన్ని బయటపెట్టాడు ఎన్టీఆర్‌. చరణ్‌ వీక్‌నెస్‌ని రివీల్‌ చేశాడు. రామ్‌ చరణ్‌లో మతి మరుపు లక్షణం ఉందట. అది పేర్ల విషయంలో అని తెలిపారు ఎన్టీఆర్. ఇప్పుడు చెప్పిన పేరు కాసేపు తర్వాత అడిగితే చెప్పలేడటని తెలిపారు. ఈ సందర్భంగా `ఆర్‌ఆర్‌ఆర్‌` షూటింగ్‌ జరిగిన ఓ అనుభవాన్ని కూడా చెప్పాడు.
 

ఒక అసిస్టెంట్‌ ఒక పేరు చెబితే అతని కాసేపు తర్వాత మరోలా పిలిచాడట, ఆ తర్వాత ఇంకో పేరుతో పిలిచాడట. అదేంటని ఆ కుర్రాడిని అడిగితే, పేరు తప్పు ఉన్నా సర్‌పిలిచేది తననే అని అర్థమవుతుంది.

పేరు సరిచేయడం ఇంపార్టెంట్‌ అనిపించలేదటన్నాడట. ఇది విన్న యాంకర్‌ నా పేరు గుర్తుందా అని అడిగింది. దెబ్బకి దొరికిపోయాడు రామ్‌ చరణ. నవ్వుతూ దాన్ని కవర్‌ చేశాడు. మొత్తంగా తన బలహీనత బయటపెట్టి చరణ్‌ని బాగా ఆడుకున్నాడు ఎన్టీఆర్‌. 

ఇక రామ్‌ చరణ్‌ ఇప్పుడు `గేమ్‌ ఛేంజర్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. సోలో హీరోగా ఆయన వచ్చి ఆరేళ్లు అవుతుంది. `వినయ విధేయ రామ` తర్వాత ఆయన సోలోగా సినిమా చేయలేదు. `ఆర్‌ఆర్‌ఆర్‌`లో తారక్ తో కలిసి నటించాడు.

ఆ తర్వాత `ఆచార్య`లో ఫాదర్‌ చిరంజీవితో కలిసి నటించాడు. ఇప్పుడు సోలోగా `గేమ్‌ ఛేంజర్‌` సినిమా చేశాడు. ఈ చిత్రం జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. దిల్‌ రాజు నిర్మాత. 

read more: వారం రోజుల్లో `మెగా` ఫెస్టివల్‌.. ఒకే వేదికపైకి చిరంజీవి, పవన్‌, అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్?

also read: `దేవర 2` స్టార్ట్ అయ్యేది అప్పుడే, ఎన్టీఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌?.. గూస్‌ బంమ్స్ తెప్పించే స్టోరీ?

Latest Videos

click me!