భాను ప్రియా తల్లికి ఇష్టమైన తెలుగు హీరో ఎవరో తెలుసా? క్లాస్‌ మేట్‌ లాగా అంటూ ట్విస్ట్ !

First Published | Dec 29, 2024, 1:42 PM IST

భాను ప్రియా తెలుగులో ఎన్నో సినిమాలు చేసి స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. మరి ఆమెకి, ఆమె తల్లికి తెలుగులో ఇష్టమైన హీరో ఎవరు? ఆమె చెప్పింది వింటే ఆశ్చర్యమే. 
 

భానుప్రియా.. తెలుగు తెరపై ఆమెది ప్రత్యేకస్థానం. మరీ గ్లామర్‌ షోకి వెళ్లకుండా నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలతోనే మెప్పించింది. అద్భుతమైన నటిగా అలరించింది. తెలుగు ఆడియెన్స్ హృదయాల్లో తనకంటూ ఓ స్థానం సంపాధించింది. ఆమె ఎక్కువగా హుందాతనంతో కూడిన పాత్రలతోనే మెప్పిస్తుంది. అలా ఆమెది ప్రత్యేక స్థానంగా చెప్పొచ్చు. అయితే హీరోయిన్‌గా సినిమాలకు గుడ్‌ బై చెప్పాక కొంత గ్యాప్‌తో అడపాదడపా సినిమాలు చేస్తుంది. 

read more: 'రామారావు' టైటిల్ తో బాలయ్య మూవీ, డైలాగ్ మాత్రం వైల్డ్ .. ఎందుకు ఆగిపోయింది ?

మ్యారేజ్‌ చేసుకుని పిల్లలు పెద్దగా అయ్యాక మళ్లీ సినిమాల్లో నటిస్తుంది భాను ప్రియా. ఆ మధ్య `ఛత్రపతి` సినిమాలో నటించింది. ప్రభాస్‌కి తల్లిగా చేసింది. ఆ తర్వాత మళ్లీ ఒకటి రెండు సినిమాలు తప్పితే పెద్దగా చేసింది లేదు. చాలా సెలక్టీవ్‌గా వెళ్లుంది. కొన్ని సీరియల్స్ కూడా చేస్తుంది. ఈ క్రమంలో ఆ మధ్య తెలుగు మీడియాతో ముచ్చటించింది భాను ప్రియా. చెన్నైలో ఉంటున్న ఆమె తెలుగు సినిమాలు చేయాలని ఉందని తెలిపింది. ఈ క్రమంలో తనకు బాగా ఇష్టమైన హీరోల గురించి చెప్పుకొచ్చింది. 
 


సుమన్‌తో 11 సినిమాలు చేసిన భానుప్రియా, ఆ తర్వాత బాలకృష్ణతో దాదాపు పది సినిమాల వరకు నటించారు. వీరి కాంబినేషన్‌లో `అశోక చక్రవర్తి`, `అపూర్వ సహోదరులు`, `బ్రహ్మర్షి విశ్వామిత్ర`, `అనసుయమ్మ గారి అల్లుడు`, `భరతంలో బాల చంద్రుడు`, `పల్నాటి పులి`, `తిరుగబడ్డ తెలుగు బిడ్డ`, `అల్లరి కృష్ణయ్య`, `ఆత్మబలం` వంటి సినిమాలు చేశారు. ఇందులో చాలా వరకు మంచి విజయాలు సాధించాయి. 

`దేవర 2` స్టార్ట్ అయ్యేది అప్పుడే, ఎన్టీఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌?.. గూస్‌ బంమ్స్ తెప్పించే స్టోరీ?
 

ఈ క్రమంలో బాలయ్యతో అనుబంధం గురించి చెప్పింది భానుప్రియా. ఆయన ఎంతో లైవ్‌లీగా ఉంటారని వెల్లడించింది. చాలా జోవియల్‌గా మాట్లాడతారని, బాలయ్య తనకు ఒక క్లాస్‌ మేట్‌లా అని తెలిపింది. అంతేకాదు అమ్మతో కూడా ఎంతో ప్రేమగా మాట్లాడతాడని, అమ్మకి ఇష్టమైన హీరో బాలయ్య అని చెప్పింది. ఎప్పుడు కలిసినా అప్యాయంగా పలకరిస్తారని, ఓ సారి ఎయిర్‌ పోర్ట్ లో కలిస్తే హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఇంటికి రావాలని చెప్పి ఫోన్‌ నెంబర్‌ కూడా ఇచ్చారని, బాలయ్య స్వీట్‌ పర్సన్‌ అంటూ కితాబిచ్చింది భానుప్రియా. ఈ వీడియో క్లిప్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. 
 

బాలకృష్ణ తన ఐదు దశాబ్దాల సినిమా జీవితంలో 109 సినిమాలు చేశారు. ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించారు. ఎంతో మంది హీరోయిన్లని వెండితెరకు పరిచయం చేశారు. అదే సమయంలో ఎంతో మంది హీరోయిన్లతో అద్భుతమైన కెమిస్ట్రీని పండించారు. బెస్ట్ జోడీగా అనిపించుకున్నారు. అందులో భానుప్రియతో సినిమాలు కూడా మంచి ఆదరణ పొందాయి. వీరిద్దరి కాంబినేషన్‌ బెస్ట్ జోడీ అనిపించుకుంది. 

 బాలకృష్ణ ప్రస్తుతం `డాకు మహారాజ్‌` చిత్రంలో నటిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. సరికొత్త కథతో, యాక్షన్‌ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రగ్యా జైశ్వాల్‌, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాబీ డియోల్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ అదిరిపోయింది. సినిమాపై అంచనాలను పెంచింది. సంక్రాంతికి జనవరి 12న ఈ మూవీ విడుదల కాబోతుంది. దీన్ని నాగవంశీ నిర్మిస్తున్నారు.  

read more: వారం రోజుల్లో `మెగా` ఫెస్టివల్‌.. ఒకే వేదికపైకి చిరంజీవి, పవన్‌, అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్?
 

Latest Videos

click me!