Allu Arjun, #Pushpa2, sukumar
పుష్ప2 సినిమా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేయడానికి తహతహలాడుతోంది. ఈక్రమంలో ఎక్కడాతగ్గడంలేదు ఈమూవీ కలెక్షన్లు. మరీముఖ్యంగా తెలుగు రాష్ట్రాల కంటే కూడా బాలీవుడ్ లో పుష్ప2 తగ్గేదేలే అన్నట్టుగా దూసుకుపోతోంది. ఇప్పటికే నార్త్ లో 800 కోట్లు దాటి.. పరుగులు పెడుతున్నాయి ఈసినిమా కలెక్షన్లు. బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ.. దూసుకుపోతుంది పుష్ప2.
Also Read: ముగ్గరు అక్క చెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా..?
Allu Arjun, #Pushpa2, sukumar, #kALKI
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్.. పుష్ప2 తో బాలీవుడ్ లో కూడా స్టార్ హీరో స్టేటస్ ను సంపాదించుకున్నాడు. ఇక ఈసినిమాతో యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాల్లో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
ఇక బన్నీ నుంచి ఏసినిమా వచ్చినా సరే ఇక్కడ ఆడియన్స్ బ్రహ్మరధం పట్టడానికి రెడీగా ఉన్నారు. ఈక్రమంలో పుష్ప2 సినిమా ఇలా ఉంటే..పుష్ప3 ఎలా ఉంటుందా అన్నటాక్ నడుస్తుంది జనాల్లో. అసలు షూటింగే స్టార్ట్ కాని పుష్ప3పై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోతున్నాయి.
Also Read:వంద పాముల మధ్య వెంకటేష్ వణుకుతూ చేసిన సీన్ ఏదో తెలుసా..?
ఇక అందరి ఆలోచన పుష్ప 3 సినిమాపై పడింది. ఈసినిమా ఎలా ఉంటుందా.. ఏ విధంగా ప్లాన్ చేస్తారా అని చాలా ఆలోచనలో బన్నీ ప్యాన్స్ లో మెదులుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే పుష్ప 3 సినిమాలో నటించబోయేది ఎవరు అనే విషయంలో ఎన్నో పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే చాలామంది పేర్లు లిస్ట్ లో వినిపిస్తున్నాయి. పుష్ప2 ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే పుష్ప3 అంతకు మించి హిట్ అవ్వాలి అంటే టీమ్ ఎంత కష్టపడాలి.
Also Read:రామ్ చరణ్ నుంచి ఎన్టీఆర్ వరకు.. రిచ్ భార్యలను కలిగి ఉన్న స్టార్ హీరోలు ఎవరంటే..?
ఇక ఈమూవీలో ఎవరిని తీసుకుంటారు అనేది కూడా ముఖ్యంమే. ఈక్రమంలో పుష్ప3 లో నటించబోయే సెలబ్రిటీలు అంటూ కొంద మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో ఈ లిస్ట్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు కూడా వినిపిస్తుంది.
ఈ సినిమాలో ఆయన ఒక కీలక పాత్రలో నటించబోతున్నారనే వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రజినీకాంత్ ఈసినిమాలో నటిస్తే.. తమిళ, మలయాళ మార్కెట్ లో కూడా ఈసినిమ బాగా కలెక్ట్ చేస్తుందని మేకర్స్ భావిస్తున్నారట.
Also Read:రోజుకు 1 కోటి వసూలు చేసే హీరోయిన్, పెళ్ళై పిల్లలు ఉన్నా తగ్గని డిమాండ్, ఎవరా బ్యూటీ..?
అంతే కాదు పుష్ప2కి భారీకలెక్షన్లు వచ్చాయి కాని.. అన్ని నార్త్ నుంచే ఎక్కువగా వచ్చాయి. సౌత్ లో అది కూడా మలయాళం. తమిళంలో పెద్దగా కనెక్ల్ చేయలేదు ఈసినిమా దాంతో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రజినీకాంత్ ను పవర్ ఫుల్ రోల్ లో చూపించే ప్రయత్నం చేయబోతున్నాడట సుకుమార్.
నిజానికి రజనీకాంత్ ఈ సినిమాలో నటిస్తే ఎలాంటి క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడనేది కూడా తెలియాల్సి ఉంది. ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడా? లేదంటే సిండికేట్ లోనే ఒక పవర్ ఫుల్ లీడర్ గా కనిపించబోతున్నాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. అసలు ఈ వార్తల్లో నిజం ఎంతా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం ఇది రూమర్ గానే ఉంది. అంతే కాదు ఇక రజినీకాంత్ తో పాటు విజయ్ దేవరకొండ పేరు కూడా ఇందులో ప్రధానంగా వినిపిస్తుంది. పుష్ప2 క్లైమాక్స్ లో కనిపించింది విజయ్ దేవరకొండే అని టాక్.
మరి వస్తున్న వార్తల్లో నిజం ఎంత.. ? పుష్ప3 లో బన్నీతో పాటు ఇంకెవరు కనిపించబోతున్నారు అనేది చూడాలి. ఇక పుష్ప3 షూటింగ్ కు బాగా టైమ్ పట్టే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే.. పుష్స2 వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు అల్లు అర్జున్.. ఈ స్టాయిలో రికార్డ్ అయితే సాధించింది కాని.. సంధ్య థియేటర్ ఘటన, బన్నీ అరెస్ట్ ఈవివాదాల నుంచి ఐకాన్ స్టార్ కోలుకోవడానికి టైమ్ పట్టే అవకాశం ఉంది.