సినిమా విడుదలయ్యే సమయంలో తనకు కలిగే ఎమోషన్స్ గురించి కూడా ఎన్టీఆర్ వివరించారు. ఇప్పటికీ తన సినిమా రిలీజ్ అవుతుందంటే నిద్ర పట్టదని, ఎంతో నెర్వస్‌గా ఉంటానని ఆయన చెప్పారు. ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా, కొత్త సినిమా విడుదలయ్యే ప్రతిసారీ ఆ ఉత్కంఠ, ఆందోళన తనలో అలాగే ఉంటాయని స్పష్టం చేశారు. సినిమా విడుదలకు ముందు ఉండే ఆ టెన్షన్ తనకు సహజంగానే ఉంటుందని ఆయన మాటల్లో కనిపిస్తుంది.
హిట్, ఫ్లాప్‌లను తీసుకునే విధానం
సినిమా ఫలితాలను తాను ఎలా స్వీకరిస్తారనే దానిపై కూడా ఎన్టీఆర్ స్పష్టత ఇచ్చారు. సినిమా ఫ్లాప్ అయినా లేదా హిట్ అయినా, దాని ప్రభావాన్ని తాను పెద్దగా ఎక్కువ రోజులు మనసులో ఉంచుకోనని తెలిపారు. ఎక్కువలో ఎక్కువ.. ఒక రోజు మాత్రమే ఆ ఫలితం గురించి ఆలోచిస్తానని, ఆ ఒక్క రోజు కంటే ఎక్కువ సమయం తాను దానిని తీసుకోనని చెప్పారు. విజయం వచ్చినా, పరాజయం ఎదురైనా ఒక రోజుకే పరిమితం చేసి, ఆ తర్వాత ముందుకు సాగడమే తన పద్ధతి అని ఆయన వెల్లడించారు.