OM Movie 3 Days Collections: నెగటివ్‌ టాక్‌తోనూ దుమ్ములేపే వసూళ్లు.. ఓం కి 3 రోజుల్లో ఎంత వచ్చాయంటే?

Published : Nov 23, 2026, 07:23 AM IST

ధనుష్‌, మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `ఓం` బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతోంది. ధనుష్‌ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్ల దిశగా వెళ్తోంది. మరి మూడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే.

PREV
13
నెగటివ్‌ టాక్‌తోనూ ఓం కి మతిపోయే కలెక్షన్లు

ధనుష్, మమ్ముట్టి తొలిసారి కలిసి నటించిన చిత్రం 'ఓం'. సాయి పల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషించారు. `అమరన్` ఫేమ్‌ రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వండర్‌ బార్‌ ఫిల్మ్స్, ఆర్‌ టేక్‌ స్టూడియోస్‌ పతాకాలపై ధనుష్‌, శ్రద్ధా అగర్వాల్‌, అజ్మత్‌ జాగ్‌మగ్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా శుక్రవారం(నవంబర్‌ 20)న విడుదలైంది. ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందనని రాబట్టుకుంది. మమ్ముట్టి పాత్రపై విమర్శలు వచ్చాయి. సెకండాఫ్‌ తేలిపోయిందనే కామెంట్స్ వినిపించాయి. కానీ భారీ స్టార్‌ కాస్ట్ ఉండటంతో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతోంది. అదిరిపోయే వసూళ్లని రాబడుతోంది. మరి ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసిందనేది చూస్తే.

23
ఓం మూవీ మూడు రోజుల కలెక్షన్లు

ఓం మూవీ మూడో రోజు కూడా అదిరిపోయే వసూళ్లని రాబట్టింది. ఇండియాలో రూ.18.45కోట్ల గ్రాస్‌, 15.90కోట్ల నెట్‌ కలెక్షన్లని సాధించింది. ఓవర్సీస్‌లో ఐదు కోట్లు వచ్చాయి. మొత్తంగా ఆదివారం ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.23.45కోట్లు వచ్చాయి. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్పొచ్చు. మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ ఈ రేంజ్‌ వసూళ్లు రావడం విశేషం. ఇక మూడు రోజుల్లో ఈ మూవీ ఇండియాలో గ్రాస్‌ రూ.58.30కోట్లు(రూ.50.30కోట్ల నెట్‌) కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్‌లో రూ.27కోట్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో ఇది రూ.85.30కోట్లు వసూలు చేయడం విశేషం. ఇది బాక్సాఫీసు వద్ద ర్యాంపేజ్‌ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ధనుష్‌ నటించిన `తేరే ఇష్క్ మెయిన్‌`, `రాయన్‌`, `కుబేర`, `సార్‌` చిత్రాలు వంద కోట్లు దాటాయి. ఇప్పుడు `ఓం` కూడా వాటి జాబితాలో చేరబోతుంది.

33
ఓం మూవీ బడ్జెట్, బిజినెస్‌, బ్రేక్‌ ఈవెన్ టార్గెట్‌

ఇక `ఓం` మూవీ బడ్జెట్‌, బిజినెస్‌, బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ లెక్కలు చూస్తే, ఈ చిత్రానికి రూ.120కోట్లకుపైగానే బడ్జెట్‌ అయినట్టు సమాచారం. థియేట్రికల్‌ బిజినెస్‌ రూ.55కోట్లు అని సమాచారం. అంటే రూ.56కోట్ల బ్రేక్‌ ఈవెన్ టార్గెట్ తో ఇది రిలీజ్‌ అయ్యింది. 8కోట్లకు తెలుగు రైట్స్ తీసుకున్నారట. తెలుగులో ఈ చిత్రం రూ.15కోట్లకుపైగానే రాబట్టాలి. ఇప్పటి వరకు దీనికి 13.35కోట్లు వచ్చాయి. మరో మూడు కోట్లు వస్తే ఇక్కడ సేఫ్‌ అవుతారు. ఇక ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ.43కోట్ల షేర్‌ వచ్చింది. ఇంకో రూ.25-30కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు వస్తే, ఓవరాల్‌గా ఈ చిత్రం అన్ని ఏరియాల్లోనూ బ్రేక్‌ అవుతుందని చెప్పొచ్చు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద జోరు చూస్తుంటే ఈ వారంలోనే బ్రేక్‌ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories