Bigg Boss Telugu 10: హౌస్ లో ఉండలేకపోయా, ఎలిమినేట్ అయ్యాక నీతూ కామెంట్స్.. నాగార్జునతో రష్మిక సందడి

Published : Nov 22, 2026, 10:55 PM IST

బిగ్ బాస్ హౌస్ లో 77వ రోజు నీతూ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. నీతూ మాస్టర్ ఎలిమినేషన్ హైడ్రామా మధ్య చోటు చేసుకుంది. బిగ్ బాస్ స్టేజీపై నాగార్జునతో కలిసి రష్మిక మందన సందడి చేసింది. ఆ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

PREV
14
బిగ్ బాస్ తెలుగు 10

బిగ్ బాస్ హౌస్ నుంచి నీతూ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. నామినేషన్స్ లో ఉన్న వారు ఒక్కొక్కరుగా సేవ్ అవుతూ వచ్చారు. చివరికి సుధీర్, నీతూ మాస్టర్ బాటమ్ లో మిగిలారు. ఎలిమినేషన్ ప్రక్రియ నాటకీయ పరిణమాల మధ్య సాగింది. నాగార్జున వారిద్దరికీ కళ్ళకు గంతలు కట్టమని చెప్పారు. దీనితో అమన్, ముకేశ్ వారికి కళ్ళ గంతలు కట్టి గార్డెన్ ఏరియాకు తీసుకుని వచ్చారు.

24
నీతూ సేఫ్ అనుకున్నారు, కానీ ఎలిమినేట్

వీరిద్దరినీ తీసుకెళ్లడానికి సుజుకీ కంపెనీ కారు వస్తుంది. ఇద్దరూ కారులో బయటకు వెళతారు. తిరిగి కారు వెనక్కి వచ్చినప్పుడు అందులో ఒక్కరే ఉంటారు. ఇంకొకరు ఎలిమినేట్ అవుతారు అని నాగార్జున చెప్పారు. ఎవరు వెనక్కి తిరిగి వస్తారు అని నాగార్జున ఇంటి సభ్యులని గెస్ చేయమన్నారు. ఎక్కువ మంది నీతూ మాస్టర్ అని చెప్పారు. కానీ నీతూ మాస్టర్ రాలేదు. ఆమె ఎలిమినేట్ అయ్యారు.

34
వర్షిణి, ముకేశ్ పై కామెంట్స్

సుధీర్ తిరిగి వచ్చాడు. దీనితో నీతూ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున తెలిపారు. స్టేజీ పైకి వెళ్లిన నీతూ.. తాను హౌస్ నుంచి వెళ్లిపోవాలని కోరుకున్నట్లు తెలిపారు. హౌస్ లో ఉండలేకపోయాను. ఎలిమినేట్ అయినందుకు సంతోషంగా ఉంది అని అన్నారు. హౌస్ లో త్రిగున్, అమన్ గేమ్ చాలా బాగా ఆడుతున్నారు అని నీతూ పేర్కొంది. వర్షిణి, ముకేశ్, సుధీర్ గేమ్ ఆడట్లేదు అని పేర్కొంది.

44
రష్మిక సందడి

అంతకు ముందు బిగ్ బాస్ స్టేజీపై రష్మిక మందన్న సందడి చేసింది. మైసా మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చింది. ఇంటి సభ్యులు ఆమెతో సరదాగా ముచ్చటించారు. మైసా ట్రైలర్ చూసి నాగార్జున గారు ఆశ్చర్యపోయారు. అసలు అది రష్మికనేనా అని అన్నట్లు రష్మిక గుర్తు చేసుకుంది. నేను అలా అనుకోలేదు.. విజయ్ ని చూసి నువ్వు కూడా రక్తం చూడడం అలవాటు చేసుకున్నావా అని నాగార్జున సెటైర్ వేశారు. అవును సార్.. ట్రైనింగ్ అంతా ఇంట్లోనే ఉంటోంది అంటూ రష్మిక కూడా ఫన్నీగా బదులిచ్చింది.

Read more Photos on
click me!

Recommended Stories