Jr NTR : టాలీవుడ్ స్టార్స్ లో ఓపిక సహనం ఎక్కువగా ఉన్న హీరోలలో ఎన్టీఆర్ ముందుంటాడు. సినిమా కోసం ఎంత కష్టానైనా.. ఆయన అనుభవిస్తాడు. అటువంటి తారక్ కే చిరాకు పుట్టి.. బీపీ పెరిగిన సందర్భం ఏంటి? ఏ సినిమా షూటింగ్ లో ఆయన సహనం కోల్పోయాడో తెలుసా?
వారసులుగా వచ్చినవారంతా స్టార్ హీరోలు కాలేరు.. అందుకు ప్రత్యేకంగా కొన్ని క్వాలిఫికేష్లు ఉంటాయి. కష్టపడే మనస్థత్వం, సినిమాకోసం ఏదైనా చేయాలనే తపన, ఓపిక, ఉత్సాహం, ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే స్టార్ హీరో గుర్తింపు సాధించగలుగుతారు. అలా చేయలేకనే చాలామంది వారసులు ఇండస్ట్రీలో నిలబడలేక మాయమైపోయారు. కానీ అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ వారసులు మాత్రం తమలో టాలెంట్ కు పదును పెట్టి.. ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ సహనం అనే పదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తున్నారు. సినిమా కోసం ఏం చేయడానికైనా ఆయన రెడీగా ఉంటాడు. నటనను ప్రాణంలా ప్రేమిస్తాడు తారక్.
25
జూనియర్ ఎన్టీఆర్ సహనానికి పరీక్ష పెట్టిన దర్శకుడు
సినిమాల విషయంలో ఎన్టీఆర్ చాలా ఓపికతో ఉంటాడు. ఎంత కష్టం అయినా భరిస్తాడు. కానీ ఓ సందర్భం మాత్రం ఆయన సహనానికి పరీక్షలా మారిందట. ఆషూటింగ్ మరేదో కాదు దేవర సినిమా సముద్రం షూట్. ఈసినిమా కోసం సముద్రంలో ఒక సన్నివేశం షూట్ చేస్తున్నారు. మంచి ఎండాకాల..పైన ఎర్రని సూరీడు, కింద సముద్రం నీరు.. ఆ నీటిలో చాలాసేపు తారక్ ను నిలబెట్టాడు దర్శకుడు కొరటాల. ఆ వేడి తట్టుకోలేకపోతున్నాడు ఎన్టీఆర్.. చెమటలు కారిపోతున్నాయి. ఆ పక్కనే ఏసీ రూమ్ ఒకటి ఉంది. ఆ బోర్డ్ చూస్తేనే ప్రాణం లేచి వస్తోంది. ఎప్పుడు డైరెక్టర్ వదిలేస్తాడా..? ఎప్పుడు వెళ్లి ఆ రూమ్ లోపడిపోవాలా అని తారక్ ఎదురు చూశాడు.
35
ఎన్టీఆర్ కు బీపీ పెరిగి ఇరిటేషన్ వచ్చిన సమయం..
ఎండలో నిల్చుని మాడిపోతున్న తారక్ కు ఇరిటేషన్ తో బీపీ పెరిగిపోయింది. ఇంకా ఎంతసేపు శివన్నా అంటూ కొరటాలను విసుగ్గా అడిగాడు తారక్. దానికి కొరటాల ఆన్సర్ చేస్తూ.. ఇంకా కొద్దిసేపు ప్లీజ్ అన్నారు. అలా షాట్ కంప్లీట్ అవ్వగానే.. ఒక్క పరుగున్ రూమ్ లోపడి.. ఏసీ ఆన్ చేసుకుని.. అలా కింద పడిపోయాడు తారక్. కాస్త చల్లగా అవుతోంది.. ఇక హాయిగా ఉంది అనుకున్న టైమ్ లో.. కరెట్ పోయింది.. ఎన్టీఆర్ కు అది పెద్ద షాక్ ఇచ్చినట్టు అయ్యింది. అప్పుడు ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక... ఇరిటేషన్, బీపీ పెరిగిపోయాయి జూనియర్ కు. ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఎన్టీఆర్. తన కెరీర్ లో ఇరిటేషన్ తో పాటు బీపీ పెరిగిన సందర్భం అదే అన్నారు.
పెద్దాయన ఎన్టీఆర్ తరువాత నందమూరి నట వారసత్వాన్ని బాలయ్య నిలబెట్టారు. ఆయన తరువాత ఆ వంశంలో జూనియర్ ఎన్టీఆర్ ఆ స్థాయిలో హీరోగా వెలుగొందుతున్నాడు. టాలీవుడ్ వరకే పరిమితం అయిన తన ఇమేజ్ ను.. ఆర్ఆర్ఆర్ , దేవర సినిమాలతో ప్రపంచ వ్యాప్తం చేసుకున్నాడు ఎన్టీఆర్. నటన, డ్యాన్స్, ఎమోషన్ సీన్స్, రొమాంటిక్ సాంగ్స్... యాక్షన్ సీక్వెన్స్ లు.. ఇలా ఒక్కటేంటి.. నటనలో ఎన్టీఆర్ చేయలేనిదంటూ ఉండదు. అంత ట్యాలెంట్ చూపించాడు కాబట్టే.. పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతున్నాడు తారక్. ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ సినిమాలతో సందడి చేస్తున్నాడు ఎన్టీఆర్
55
ఎన్టీఆర్ సినిమాలు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి ఈ ఏడాది వచ్చిన వార్ 2 మూవీ అభిమానులను నిరాశపరిచింది. అందుకే సాలిడ్ సినిమాతో ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అవుతున్నాడు తారక్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తరువాత దేవర పార్ట్ 2 షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు ఎన్టీఆర్. ఇక ఆతరువాత ఓ భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నట్టు సమాచారం.