నాగార్జున.. మహాభారతంలో ద్రోణాచార్యుడు తండ్రి ఎవరు అని ప్రశ్నించారు. వసిష్ఠుడు, జమదగ్ని, గౌతముడు, భరద్వాజుడు అనే ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ప్రశ్నకి తారక్ కూడా కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు. దీనితో తారక్ తన తాతగారు నటించిన దానవీర శూర కర్ణ చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ చిత్రంలో ఎన్టీఆర్ ఏమంటివి ఏమంటివి అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే డైలాగ్ కి మార్పులు చేసి జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ చిత్రంలో చెప్పారు.