నేను హ్యాండిల్ చెయ్యగలనా అని భయం ఉంది,స్టార్స్ ని పెట్టుకోకూడదు : రాజమౌళి

First Published | Sep 18, 2024, 7:58 AM IST

అంతేకాదు కొంచెం భయం కూడా ఉంది. నేను హ్యాండిల్ చెయ్యగదలనా అని. ఇందులో స్టార్స్ ని పెట్టుకోకూడదు.

rajamouli


బాహుబలి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. ఆ సినిమాతో తెలుగు సినిమాకు  పాన్ ఇండియా బిజినెస్ రుచి చూపించారు.అలాగే  RRRతో ఆస్కార్ వద్దకు తీసుకెళ్లి రాజమౌళి అందనంత ఎత్తుకు ఎదిగాడు.

అసలు ఇప్పటివరకు ఒక్క ఫెయిల్యూర్ కూడా లేని డైరెక్టర్ గా పేరు తెచ్చుకొని తన సినిమాలపై ప్రేక్షకులు భారీ ఎక్సపెక్టేషన్స్ పెట్టుకునేలా చేసాడు. అయితే అలాంటి రాజమౌళి కూడా నేను హ్యాండిల్ చెయ్యగలనా అని భయపడే పరిస్దితులు  ఉంటాయా. అసలు రాజమౌళి ఏ సినిమా విషయమై అలా చెప్పుకొచ్చారో చూద్దాం. 


ప్రతి డైరక్టర్ కి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్‌ ఉంటుంది. ఎప్పటికైనా ఫలానా కథతో సినిమా తీయాలని ఆశిస్తుంటారు. స్టార్ డైరక్టర్ ఎస్‌.ఎస్‌.రాజమౌళి (ss rajamouli)కి కూడా ఒక డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఉన్న సంగతి తెలిసిందే. అదే భారతీయ ఇతిహాసగాథ ‘మహాభారతం’ (mahabharata). ఎప్పటికైనా ఆ సినిమా తీస్తానని అనేక సందర్భాల్లో ఆయన  తెలిపారు. రీసెంట్ గా కూడా మరొకసారి అదే విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు, ‘మహాభారతం’ తాను తీస్తే బహుశా పది భాగాలు ఉంటుందేమోనని అభిప్రాయపడ్డారు.
 



అయితే ఆయనకు ఆ ప్రాజెక్టు విషయంలో కాస్త భయం ఉందని ఆ మధ్యన స్పష్టం చేసారు. రాజమౌళి మాట్లాడుతూ... మహాభారతం చెయ్యాలనేది నా యాంబిషన్ అని బోలెడు సార్లు చెప్పాను. ఎప్పుడు చేస్తాను అంటే అది మొదలు పెట్టడానికి ఓ పది సంవత్సరాలు పడుతుంది.

నా మైండ్ లో ఏముందో అది స్క్రీన్ మీదకు తీసుకురావాలంటే పదేళ్ల తర్వాత ఏమేం టెక్నాలిజీలు వస్తాయో...చూడాలి.  మహాభారతం అనేది మైండ్ లోనే వెళ్తూనే ఉంటుంది. దానికి ఒక ఇది అంటూ లేదు ,ఒక లెవిల్ అంటూ లేదు అన్నారు. 
 

 మహాభారతంలో అన్ని క్యారక్టర్లు ఏదేదో ఉంటాయి.  అంత పని పెట్టుకోవాలంటే చాలా ఏళ్లు పడుతుంది. అంతేకాదు కొంచెం భయం కూడా ఉంది. నేను హ్యాండిల్ చెయ్యగదలనా అని. ఇందులో స్టార్స్ ని పెట్టుకోకూడదు.

వాళ్లతో పెట్టుకుంటే అవ్వదు. మనం ఆ క్యారక్టర్స్ డిజైన్ చేసి ఏ పాత్రకు ఎవరు సరిపోతారో చూసి వాళ్ళను పట్టుకుని తోమి ,మోల్డ్ చేసి తయారు చేయాలి అని చెప్పుకొచ్చారు.  మహాభారతం నా డ్రీమ్ ప్రాజెక్టు అని చెప్పానంతే. అదే నా లాస్ట్ పిల్మ్ కావచ్చు. 
 

Kalki 2898 AD


ఓ ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ...‘‘చాలా పెద్దగా ఆ ప్రాజెక్టు చేయాలి. భారతీయ కథలను ప్రపంచానికి చెప్పాలి. ‘మహాభారతం’ నా చిరకాల ప్రాజెక్ట్‌. అయితే, ఆ మహాసముద్రంలోకి అడుగు పెట్టడానికి చాలా సమయం పడుతుంది. అంతకన్నా ముందు నాలుగైదు సినిమాలు తీస్తానేమో’’ అని అన్నారు. 
 


 ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళిని ఓ వ్యక్తి ప్రశ్నిస్తూ  ‘‘గతంలో మీరు ‘మహాభారతం’ తీస్తానని అన్నారు. అద్భుతమైన ఆ దృశ్య కావ్యం టెలివిజన్‌లో 266 ఎపిసోడ్స్‌గా ప్రసారమైంది. మీరు తీయాలనుకుంటే ఎన్ని భాగాలుగా తీస్తారు’ అని ప్రశ్నించారు.

ఇందుకు రాజమౌళి సమాధానం ఇస్తూ  ‘నాకు కూడా తెలియదండీ. ఇది చాలా కష్టమైన ప్రశ్న. ఒకవేళ ‘మహా భారతం’ తీయాలంటే భారతదేశంలో అందుబాటులో ఉన్న అన్ని వెర్షన్స్‌ చదవాలంటేనే ఏడాదిపైనే సమయం పట్టవచ్చు. అప్పటికి ఒక్క అక్షరం కూడా పేపర్‌పై పెట్టలేకపోవచ్చు. చాలా పెద్ద ప్రాజెక్టు. ‘మహాభారతం’ తీస్తే పది భాగాలు తీయాల్సి వస్తుందేమోనని నేను ఊహిస్తున్నా. అయితే, ఎన్ని భాగాలు అవుతుందో కచ్చితంగా చెప్పలేను’’ అని అన్నారు.
 

SS Rajamouli reveals about his dream project


‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ‘ఆస్కార్‌’కు తీసుకెళ్లారు. ఎన్టీఆర్‌ (NTR), రామ్‌చరణ్‌ (Ram charan) కథానాయకులుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌బాబు (Mahesh babu)తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు.

యాక్షన్‌ అడ్వెంచర్‌ కథతో ఈ మూవీ తెరకెక్కనుంది. ఇందుకు సంబంధించిన ప్రీప్రొడక్షన్‌ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా జరుగుతోంది. ఈ ఏడాది చివరిలో కానీ, వచ్చే ఏడాది ప్రథమార్ధంలో కానీ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు.
  
 

Latest Videos

click me!