త్రివిక్రమ్ పై పూనమ్ ఆరోపణలు: ఫిల్మ్ ఛాంబర్ రియాక్షన్

First Published | Sep 18, 2024, 8:10 AM IST

నటి పూనమ్ కౌర్ ట్వీట్ తో త్రివిక్రమ్ వ్యవహారం టాలీవుడ్ సినీపరిశ్రమలో హాట్  టాపిక్ గా మారింది. దీంతో త్రివిక్రమ్ విషయంలో సినీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై ఆసక్తి నెలకొంది.

Poonam Kaur

తెలుగులో స్టార్ దర్శకుడుగా వెలుగుతున్న  త్రివిక్రమ్‌తో హీరోయిన్ పూనమ్ కౌర్ గొడవ చాలా ఏళ్ల నుంచి ఉంది. అవకాసం దొరికినప్పుడల్లా  త్రివిక్రమ్ పై పూనమ్ విమర్శలు చేస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి అలాంటి కామెంట్స్ చేసి వార్తలకు ఎక్కింది. ఇండస్ట్రీ పెద్దలు త్రివిక్రమ్‌ని గట్టిగా ప్రశ్నించాలని కోరింది.    కొరియోగ్రాఫర్ కమ్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో ఈ ట్వీట్ వేసినట్లు అర్దమవుతోంది. దాంతో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది.
 

జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో అతడిని మాస్టర్ అని పిలవొద్దు అని ట్వీట్ చేసింది పూనమ్. అదే సమయంలో ఊహించని విధంగా స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై పూనమ్ కౌర్ ఆరోపణలు చేసింది. తొలిసారి ఆమె త్రివిక్రమ్ పేరును నేరుగా ప్రస్తావిస్తూ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను కార్నర్ చేసింది. తను ఇచ్చిన ఫిర్యాదును ఇప్పటికైనా స్వీకరిస్తారా అని డైరక్ట్ గా ప్రశ్నించింది.  
 


Poonam Kaur


  'త్రివిక్రమ్‌పై గతంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశా. కానీ సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదు. నన్ను రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. సినీ పెద్దలు ఈ విషయమై త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలి.' అని పూనమ్ కౌర్ అని ట్విటర్(ఎక్స్)లో రాసుకొచ్చింది.
 


ఈ అంశంపై ‘మా’ ఇంకా స్పందించలేదు. అయితే ఫిలింఛాంబర్ మాత్రం స్పందించింది. లైంగిక దాడుల కేసుల పరిష్కారానికి సంబంధించి ఏర్పాటుచేసిన ప్యానెల్ లో సభ్యుడిగా ఉన్న తమ్మారెడ్డి భరధ్వాజ… పూనమ్ కౌర్ ఆరోపణలపై స్పందించారు.

పూనమ్ కౌర్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఎందుకు ఫిర్యాదు చేసిందో.. ఎప్పుడు ఫిర్యాదు చేసిందో ఛాంబర్ కు తెలియదన్నారు తమ్మారెడ్డి. కంప్లయింట్ లేకుండా తాము ముందుకు వెళ్లలేమని, నిజంగా తనకు అన్యాయం జరిగినట్టు పూనమ్ భావిస్తే, ముందుకొచ్చి ఛాంబర్ లో కంప్లయింట్ ఇవ్వాలని ఆయన కోరారు.


కనీసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అయినా ముందుకొచ్చి, పూనమ్ కౌర్ ఇచ్చిన ఫిర్యాదును తమకు ఫార్వర్డ్ చేస్తే, తమ పని తాము చేస్తామని అన్నారు. ఫిలింఛాంబర్ లో రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓ బాక్స్ పెడతాము.

ఎవరైనా మహిళలు తమపై లైంగిక వేధింపులు జరిగాయని భావిస్తే, ఆ డబ్బాలో ఫిర్యాదు వేసి వెళ్లిపోవచ్చని ఆయన అన్నారు. డబ్బా మాత్రమే కాకుండా.. వాట్సాప్, ఈమెయిల్ ద్వారా కూడా లైంగిక వేధింపుల అంశాల్ని ఫిర్యాదు చేయొచ్చన్నారు తమ్మారెడ్డి. 


ఇంతకీ  పూనమ్ కౌర్ చెప్పినట్లు త్రివిక్రమ్‌.. మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్‌లో ఫిర్యాదు చేసేంతలా ఏం చేశారు? ఈ విషయం సినీ పెద్దలు ఎందుకు బయటకు రానీయటం లేదా,  పూనమ్ కౌర్‌ని   వెనక ఎవరైనా ఉన్నారా ? అనే డిస్కషన్ మొదలైంది. ఇదంతా చూస్తుంటే కేరళ ఇండస్ట్రీలోని హేమ కమిటీలా ఇక్కడ కూడా ఒకటి ఏర్పాటు చేయాలేమో? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
 

Latest Videos

click me!