సుధ కాలు పట్టుకుని సపర్యలు చేసిన తారక్
ఈక్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ సంఘటనలో తారక్ ఎంతో వినయంగా ఎలా స్పందించాడో ఆమె వివరించారు. సుధ ఏమన్నారంటే? "బాద్షా సినిమా సమయంలో ఓ పాట షూటింగ్ లో పాల్గొన్నాను.
ఆ సీన్‌లో నేను డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. అదే సమయంలో నా కాలు జారి తడబడిపోయాను. వెంటనే ఎన్టీఆర్ పరిగెత్తి వచ్చి నా కాలు పట్టుకుని – 'ఏం కాలేదే కదా అమ్మ' అంటూ నన్ను ఓదార్చాడు. స్ప్రే తెప్పించి కాలుకు స్వయంగా సపర్యలు చేశాడు.
ఈ రోజుల్లో ఇంత పెద్ద హీరో అయినా ఇంతగా మర్యాదగా ఉండడం నిజంగా ఆశ్చర్యం. అలా ఎంత మంది ఉంటారు. అతను ఉన్న స్టార్ డమ్ కు నా కాలు గురించి పట్టించుకోవలసిన అవసరం లేదు. ఒక వేళ నా కాలుకి దెబ్బ తగిలినా కూడా వేరే వాళ్లకు చూడండయ్య అని చెప్పవచ్చు.
కానీ ఎన్టీఆర్ అలా కాదు. ఆయన మర్యాధ, వినయం వేరు. చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు, ఇప్పుడు కూడా అనుకుంటే అల్లరి చేస్తాడు. కానీ ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉంటాడు." అని అన్నారు సుధ