ఈ కార్యక్రమానికి రాజమౌళి, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, కీరవాణి ఇతర చిత్ర యూనిట్ హాజరై రాయల్ ఆల్బర్ట్ హాల్ లో సందడి చేశారు. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ మరోసారి ఒకే వేదికపై కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. చరణ్, ఎన్టీఆర్ మధ్య బాండింగ్ కనుల పండుగగా నిలిచింది.