ఎన్టీఆర్ నటించిన ఒకే ఒక్క తెలుగు సీరియల్ ? తారక్ అందులో ఏ పాత్ర చేశాడంటే?

Published : Aug 15, 2025, 10:13 AM IST

టాలీవుడ్ స్టార్ హీరో, పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఓ సీరియల్ లో నటించాడని మీకు తెలుసా? హీరోగా కెరీర్ స్టార్ట్ కాకముందే తారక్ నటించిన టెలివిజన్ సీరియల్ ఏంటీ?

PREV
17

పాన్ ఇండియా స్టార్ గా ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ఇండియా స్టార్ హీరో. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయన ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఇండియాలో ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుసగా హిట్ సినిమాలతో దూసుకుపోతున్న తారక్ తాజాగా బాలీవుడ్ లో వార్ 2 సినిమాతో పాన్ ఇండియా ఆడియన్స్ ను పలకరించాడు. బాలీవుడ్ యాక్షన్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి సందడి చేశాడు ఎన్టీఆర్. పాన్ ఇండియాను శాసిస్తున్న ఎన్టీఆర్ తో సినిమాకోసం బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు కూడా క్యూ కడుతున్నారు. కాని తారక్ మాత్రం పక్కా ప్లాన్ ప్రకారం సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు.

DID YOU KNOW ?
ఫస్ట్ హోస్ట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన మొట్టమొదటి షో బిగ్ బాస్ తెలుగు. ఈ షో ఫస్ట్ సీజన్ ను తారక్ సక్సెస్ ఫుల్ గా హోస్ట్ చేశారు.
27

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్

కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు ఎన్టీఆర్. డిజాస్టర్లు వచ్చినప్పుడు క్రుంగిపోకుండా రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేశాడు.అలా అని బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చినప్పుడు పొంగిపోకుండా ఆక్రెడిట్ ను ప్యాన్స్ కు ఇచ్చేశాడు తారక్. ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్న ఎన్టీఆర్ కెరీర్ బిగినింగ్ లో సీరియల్స్ లో కూడా నటించాడని మీకు తెలుసా? ఎన్టీఆర్ నటించిన ఏకైక టెలివిజన్ సీరియల్ ఏంటి? ఆ సీరియల్ లో జూనియర్ ఎన్టీఆర్ ఏ పాత్రలో కనిపించారు. అప్పుడు ఆయన ఎలా ఉన్నాడో చూస్తే నిజంగా షాక్ అవుతారు.

37

సీరియల్ లో నటించిన తారక్

ఈటీవీ ప్రస్తుతం 30 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ సంస్థ ప్రారంభ దశలో "భక్త మార్కండేయ" అనే ధారావాహిక ప్రసారం అయ్యింది. ఈ సీరియల్ లో జూనియర్ ఎన్టీఆర్ మార్కండేయుడిగా నటించారు. ఓ వైపు శివుని భక్తి, మరోవైపు బాలనటుడిగా ఎన్టీఆర్ నటన ఆ సీరియల్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సీరియల్ ఎక్కువ రోజులు ప్రసారం కాలేకపోయినా, ఇందులో ఎన్టీఆర్ లుక్‌ చాలా డిఫరెంట్ గా కనిపించింది. అయితే ప్రస్తుతం ఆ లుక్ సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది.

47

బాల నటుడిగా యంగ్ టైగర్

జూనియర్ ఎన్టీఆర్ చిన్ననాటి నుంచే కళారంగం పట్ల ఆసక్తి చూపారు. చదువుతో పాటు డాన్స్, నటనలలోనూ ప్రతిభను కనబరిచారు. స్కూలింగ్ చేస్తున్న రోజుల్లోనే ఆయన కూచిపూడి, భరత నాట్యం నేర్చుకున్నారు. ఇక చదువుకుంటూనే తారక్ 1997లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన "బాలరామాయణం" సినిమాతో బాల నటుడిగా సినీ రంగంలో అడుగుపెట్టారు. ఇందులో చిన్న రాముడి పాత్రలో ఎన్టీఆర్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తరువాత తాత నందమూరి తారకరామారావు , బాబాయ్ బాలకృష్ణలతో కలిసి "బ్రహ్మర్షి విశ్వామిత్ర" హిందీ వెర్షన్లో చిన్నప్పుడే నటించాడు ఎన్టీఆర్. అయితే ఆ చిత్రం ఇప్పటివరకు విడుదల కాలేదు.

57

చిన్న వయస్సులోనే హీరోగా ఎంట్రీ

ఇక చాలా చిన్న వయస్సులోనే అంటే కాలేజీ చేస్తున్న రోజుల్లోనే ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 2000 సంవత్సరంలో "నిన్ను చూడాలని" సినిమాతో హీరోగా పరిచయమైన తారక్, కొద్ది కాలంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరో హోదాను సంపాదించుకున్నారు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో తొలి హిట్ ను అందుకున్న ఎన్టీఆర్.. ఆతరువాత ఆది, సింహాద్రి సినిమాలతో మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించారు. తనకంటూ ప్రత్యేకమైన మాస్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు ఎన్టీఆర్. నందమూరి అభిమానులతో పాటు తన టాలెంట్ తో సొంతంగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు తారక్.

67

హోస్ట్ గా కూడా సక్సెస్ అయిన జూనియర్ ఎన్టీఆర్

కెరీర్ మొదట్లు బుల్లితెరపై కనిపించిన ఎన్టీఆర్ స్టార్ హీరో అయిన తరువాత కూడా బుల్లితెరపై సందడి చేశాడు. టీవీ ప్రేక్షకుల్లోనూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు.స్టార్ మా ఛానెల్‌లో "బిగ్ బాస్ తెలుగు" ఫస్ట్ సీజన్ కు హోస్ట్ గా ఎన్టీఆర్ దూసుకుపోయాడు. ఫస్ట్ సీజన్ నే బ్లాక్ బస్టర్ హిట్ చేశాడు ఎన్టీఆర్. ఆ తర్వాత జెమినీ టీవీలో "మీలో ఎవరు కోటీశ్వరుడు" షోకు కూడా హోస్ట్‌గా వ్యవహరించారు. ఆతరువాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాలతో బిజీ కావడంతో టీవీ హోస్టింగ్‌కు గ్యాప్ వచ్చేసింది. ప్రస్తుతం ఫోకస్ అంతా సినిమాలపైనే పెట్టాడు తారక్.

77

ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాలు

రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్, భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌ "వార్ 2" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి మంచి స్పందన సాధించింది. ఇక ప్రస్తుతం తారక్ కెజియఫ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈమూవీపై పాన్ ఇండియా రేంజ్ లో భారీగా అంచనాలుఉన్నాయి. ఎన్టీఆర్ కు తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడాలో కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాంతో అక్కడ కూడా ఈ సినిమాపై ఎక్కువగా అంచనాలు ఉన్నాయి. ఇక ప్రశాంత్ నీల్ సినిమా తరువాత ఎన్టీఆర్ దేవర 2 సెట్స్ లో జాయన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories