ఈరోజు ఎపిసోడ్లో జెస్సి వాళ్ళ నాన్న జ్ఞానాంబ ఇంటికి వస్తాడు. అప్పుడు రామచంద్ర,జ్ఞానాంబ వాళ్ళు వెళ్లి ప్రేమగా పలకరిస్తారు. ఇంతలోనే అక్కడికి అఖిల్ వచ్చి జెస్సి వాళ్ళ నాన్నను పలకరిస్తాడు. అప్పుడు జ్ఞానాంబ జానకి లోపలికి పిలుచుకొని వెళ్ళి కాఫీ ఇవ్వు అని అంటుంది. మరికొవైపు మల్లికా ఒకచోట కూర్చొని ఉండగా ఇంతలో అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ బాధపడకు మల్లిక అని చెబుతూ ఉండగా అప్పుడు మల్లిక అబ్బా నాకు ఈ కడుపు పోయే విషయం ఏమో కానీ ఆ మాట విని విని నేను పేషెంట్ అయిపోయేలా ఉన్నాను అని అనుకుంటూ ఉంటుంది.