అప్పుడు మల్లిక కి లోపల ఎంత మండిపోతున్నా సరే బయటికి చాలా నవ్వుతూ మేనేజ్ చేస్తూ ఉంటుంది.అప్పుడు జ్ఞానాంబ జానకి ని దగ్గరికి తీసుకొని, నిన్ను,రామా ని చూస్తే చాలా గర్వంగా ఉన్నదమ్మా. ఇంటి బాధ్యతలు మాత్రమే కాకుండా,సొంత కలలు కోసం తపనపడుతున్నారు. కొన్ని మందున్నారు ఎందుకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారు అని జెస్సీ వైపు చూస్తూ, ఇంకొన్ని మంది వాళ్ళ జీవితాలు సరిదిద్దుకుందాం అని చూడకుండా వాళ్లతోపాటు ఆడదాని జీవితం కూడా నాశనం చేసేస్తారు అని అఖిల్ ని చూస్తూ అంటుంది జ్ఞానాంబ.