గాడ్ ఫాదర్ సినిమా ఫస్ట్ రివ్యూ : "చిరంజీవి దయచేసి సినిమాలు మానేయండి" , దారుణంగా రేటింగ్..!

First Published Oct 4, 2022, 11:03 AM IST

చిరంజీవి ఫ్యాన్స్ కి ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. గాడ్ ఫాదర్ చిత్ర ఫస్ట్ రివ్యూ కంగారు పెట్టేదిగా ఉంది. సినిమా ఏమి బాగోలేదంటూ ఫిల్మ్ క్రిటిక్ ఒకరు ట్వీట్ చేశారు. 
 

Godfather Movie Review

ఆచార్య రిజల్ట్ చిరంజీవిని పీడకలలా వెంటాడుతుంది. ఆ మూవీ ఫెయిల్యూర్ నన్నేమి ఎఫెక్ట్ చేయదంటూనే పదే పదే దాన్ని తలచుకుంటున్నారు. సందర్భం దొరికితే ఆ చిత్ర దర్శకుడు కొరటాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. రెండో రోజే థియేటర్స్ నుండి వెళ్ళిపోయిన ఆచార్య చిరంజీవి స్టార్ డమ్, ఇమేజ్ నే ప్రశ్నించింది. దానికి తోడు బయ్యర్లలో పంచాయితీలు. 
 

Godfather Movie Review

ఇవన్నీ మర్చిపోవాలంటే చిరంజీవికి ఒక సాలిడ్ హిట్ కావాలి. అది గాడ్ ఫాదర్ తో నెరవేరుతుందని చిరంజీవి గట్టిగా నమ్ముతున్నాడు. అంత నమ్మకం ఉంది కాబట్టే నాలుగు భాషల్లో విడుదల చేస్తున్నాడు. తెలుగు, హిందీ వెర్షన్ కి బాగా ప్రచారం కల్పిస్తున్నారు.

Godfather Movie Review

అయితే చిరంజీవికి ఆయన ఫ్యాన్స్ కి ఫస్ట్ రివ్యూ పెద్ద షాక్ ఇచ్చింది. ఫిలిం క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఉమర్ సంధు గాడ్ ఫాదర్ చిత్రం ప్లాప్ అని తేల్చేశారు. మూవీలో మేటర్ లేదంటూ ట్వీట్ చేశారు. చిరంజీవి సినిమాలు మానేయడం మంచిదని దారుణమైన కామెంట్స్ చేశాడు. ఉమర్ సంధు కేవలం 2.5 రేటింగ్ ఇచ్చాడు. 
 

Godfather Movie Review


గాడ్ ఫాదర్ పక్కా యావరేజ్ మూవీ. అది కూడా కేవలం బి, సి సెంటర్స్ మాస్ ఆడియన్స్ మాత్రమే. కొత్త జాడీలో సిద్ధం చేసిన పాత చింతకాయ పచ్చడి లాంటి సినిమా. చిరంజీవి సినిమాలు మానేయడం మంచిది. గాడ్ ఫాదర్ చిత్రానికి నా రేటింగ్ 2.5\5 అని ట్వీట్ చేశారు. గాడ్ ఫాదర్ పై ఉమర్ సంధు ట్వీట్ వైరల్ గా మారింది. 

Godfather Movie Review


గతంలో ఉమర్ సంధు స్టార్ హీరోల చిత్రాలకు బ్లాక్ బస్టర్ రేటింగ్ ఇచ్చేవాడు. ఆయన అద్బుతమన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ఆయన రేటింగ్స్ నమ్మడం మానేశారు. ఇటీవల పొన్నియిన్ సెల్వన్ రేటింగ్ విషయంలో కూడా ఆయన విమర్శల పాలయ్యారు. మణిరత్నం భార్య నటి సుహాసిని ఉమర్ సంధు పై ఫైర్ అయ్యారు. 

Godfather Movie Review

ఈ క్రమంలో గాడ్ ఫాదర్ ఎలాంటి ఫలితం అందుకుంటుందనే ఆసక్తి మొదలైపోయింది. కాగా గాడ్ ఫాదర్ మలయాళ హిట్ మూవీ లూసిఫర్ అధికారిక రీమేక్. ఐతే గాడ్ ఫాదర్ మూవీలో అనేక మార్పులు చేసినట్లు దర్శకుడు మోహన్ రాజా చెప్పారు. లూసిఫర్ లో కేవలం 50 నిమిషాలు మాత్రమే మోహన్ లాల్ కనిపిస్తారు. కానీ గాడ్ ఫాదర్ లో చిరంజీవి రెండు గంటలు కనిపిస్తారు.

Godfather Movie Review


దాదాపు పది పాత్రలు అధికంగా గాడ్ ఫాదర్ చిత్రంలో జొప్పించినట్లు మోహన్ రాజా తెలిపారు. అంటే ఒరిజినల్ చిత్రానికి చాలా మార్పులు చేసినట్లు అర్థం అవుతుంది. సల్మాన్ కీలక క్యామియో రోల్ చేస్తున్న గాడ్ ఫాదర్ మూవీలో నయనతార, సత్యదేవ్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. గాడ్ ఫాదర్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. 

click me!