ఊరంతా ఆనందంతో గంతులు వేస్తూ ఉంటారు. జ్ఞానాంబ పూజలో ఉంటుంది. మల్లికా మాత్రం జానకి, అఖిల్, రామాలు ఎక్కడ ఇంట్లో కనిపించలేదు అని ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. అత్తయ్య గారికి చెబుదామా అంటే మళ్ళీ పూజకి భంగం కలిపిస్తున్నాను అని నాన్నే తిడతారు మనమే వెళ్లి వెతుక్కుందామని అనుకుని బయట అంతా వెతుకుతూ ఉంటుంది..ఇంతలో అక్కడికి ఒక కారు వచ్చి ఆగుతుంది. జానకిరామాలు అందులో నుంచి దిగుతారు. అప్పుడు మల్లికా,వీళ్ళిద్దరూ ఉన్నారు మరి అఖిల్ ఏడి అని అనుకోగా, వెనకాతల నుంచి పూలదండలు మార్చుకొని అఖిల్,జెస్సీ లు దిగుతారు.దానిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు.మల్లిక కళ్ళు నిలుపుకొని మళ్ళీ చూస్తూ, నేను చూసేది నిజమేనా వెంటనే వెళ్లి అత్తయ్యకి చెప్పాలి అని చెప్తుంది.అప్పటికే జ్ఞానాంబ కళ్ళు తెరిచి మనసు ఎందుకో కీడు సంకిస్తుంది అని అనుకుంటుంది.