గుర్రంపై అలా కూర్చొని కాజల్ హాట్ హాట్ రైడింగ్... ఎక్స్పీరియన్స్ అప్పటిలా లేదన్న బోల్డ్ భామ!

Sambi Reddy | Published : Sep 21, 2022 11:58 AM
Google News Follow Us


చందమామ కాజల్ సాహసాలు చేస్తుంది. ఏకంగా హార్ట్ రైడింగ్ కి పాల్పడి ఫ్యాన్స్ ని షాక్ లోకి నెట్టింది. తల్లై ఏడాది కూడా గడవక ముందే కాజల్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఔరా అనిపిస్తుంది. 
 

19
గుర్రంపై అలా కూర్చొని కాజల్ హాట్ హాట్ రైడింగ్... ఎక్స్పీరియన్స్ అప్పటిలా లేదన్న బోల్డ్ భామ!
Kajal Aggaral

కాజల్ కి చాలా కాలం నుండే హార్స్ రైడింగ్ అలవాటు ఉందట. ఆమె వ్యాయామంలో భాగంగా హార్స్ రైడింగ్ చేసేవారట. 2020 లో పెళ్లి చేసుకున్న కాజల్ కొద్ది నెలల క్రితం తల్లయ్యారు. ఆమె పండండి అబ్బాయికి జన్మనిచ్చారు. నీల్ కిచ్లు అని నామకరణం చేశారు.

29
Kajal Aggaral

గర్భం దాల్చినప్పటి నుండి కాజల్ గుర్రపు స్వారీ లాంటి కఠిన వ్యాయామాల జోలికి వెళ్ళలేదు. చాలా రోజుల తర్వాత ఆమె గుర్రపు స్వారీ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఆమె షేర్ చేశారు. అయితే మునుపటిలా ఫిట్ గా లేనని ఆమె చెప్పుకొచ్చారు.

39
Kajal Aggaral

తల్లి అయ్యాక శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఎవరి సహాయం లేకుండా గుర్రాన్ని ఎక్కడం, స్వారీ చేయడం మునుపటిలా ఈజీగా లేదని కాజల్ తెలియజేశారు. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితులను, బలహీనతలను గట్టి మనోధైర్యంతో ఎదిరించి ముందుకు పోవాలని కాజల్ కామెంట్ చేశారు.

Related Articles

49
Kajal Aggaral


కాజల్ గుర్రపు స్వారీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా... ఫ్యాన్స్ కామెంట్స్, లైక్స్ చేస్తున్నారు. కాజల్ సాహసాలను ఓ రేంజ్ లో పొగుడుతున్నారు. కాజల్ నిజంగా గ్రేట్ అంటున్నారు. 
 

59
Kajal Aggaral


ఇటీవల కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. మరోవైపు కొడుకు నీల్ కిచ్లు ఆలనా పాలన చూసుకుంటూ మాతృత్వపు అనుభూతి పొందుతుంది. సక్సెస్ వెనుకపడుతూ ఫ్యామిలీ లైఫ్ కి దూరమయ్యే హీరోయిన్స్ కాజల్ ని చూసి చాలా నేర్చుకోవాలి. ప్రొఫెషన్ లో కొనసాగుతూ కూడా ఎలా కుటుంబ విలువలు, సాంప్రదాయాలు పాటించవచ్చో కాజల్ నిరూపించింది.

69
Kajal Aggaral

ప్రస్తుతం కాజల్ భారతీయుడు 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. 

79
Kajal Aggaral

వివాదాల కారణంగా భారతీయుడు 2 చిత్రీకరణ మధ్యలో ఆగిపోయింది. కమల్ హాసన్ విక్రమ్ సక్సెస్ నేపథ్యంలో తిరిగి షూట్ ప్రారంభించారు.

89
Kajal Aggaral


భారతీయుడు 2 లో కాజల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రకుల్ మరో హీరోయిన్ గా చేస్తున్నట్లు సమాచారం. భారతీయుడు 2 తో పాటు రెండు తమిళ, ఒక హిందీ చిత్రంలో కాజల్ నటిస్తున్నారు. హీరోయిన్ గా ఆమె వరుస ఆఫర్స్ పట్టేస్తున్నారు.

99
Kajal Aggaral

మరోవైపు భర్తకు వ్యాపారంలో తన వంతు సహాయం చేస్తుంది. గౌతమ్ కిచ్లు ఓ ఫర్నిచర్ సంస్థ కలిగి ఉన్నాడు. ఈ సంస్థ ఉత్పత్తులకు కాజల్ ప్రచారం కల్పిస్తున్నారు. తన ఇమేజ్ ఉపయోగించి వ్యాపారం అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నారు.

Recommended Photos