Intinti Gruhalakshmi: తులసిని సహాయం అడిగిన సామ్రాట్... లాస్యనందుల సరికొత్త ప్లాన్?

First Published Sep 21, 2022, 10:52 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు సెప్టెంబర్ 21వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... ఇంట్లో వాళ్ళందరూ అనసూయ, పరందామయ్య లు పాయసం తినడం చూసి నవ్వుతారు. అప్పుడు పరంధామయ్య, ఇందులో షుగర్ సరిపోయిందో లేదో చూడడానికి రుచి చూశానమ్మా అని అంటాడు. అప్పుడు తులసి,పాయసంలో షుగర్ కాదు మావయ్య మీ ఒంట్లో షుగర్ ఎంత ఉందో చూసుకోండి అని అంటుంది. అప్పుడు తులసి శృతి తో, నేను సామ్రాట్ గారి ఇంటికి వెళ్తున్నాను. హనీకి టిఫిన్ చేశాను డబ్బాలో కట్టేసి ఇవ్వమ్మా ఈలోపల నేను తయారవుతాను అని చెప్తుంది.
 

ఆ తర్వాత సీన్లో సామ్రాట్ హనీకి మందులు ఇవ్వడానికని వెతుకుతాడు. కానీ హనీ ఎక్కడా కనిపించదు బయటకు వచ్చి చూసేసరికి హనీ ఉయ్యాల మీద కూర్చొని ఒక్కతే ఊగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తున్నావమ్మా అని సామ్రాట్ అడగగా ఊసుపోవట్లేదు నాన్న,నన్ను బయటికి వెళ్ళనివ్వడం లేదు. ఒక్కదాన్నే ఉన్నాను అని అంటుంది.  ఇంతలో లాస్య నందులు వచ్చి ఇదిగో మేము మీకోసం ఆడుకోడానికి ఒక పెద్ద బొమ్మను తెచ్చాము అని చెప్పి లక్కీనీ ఇస్తారు.
 

ఈ బొమ్మతో నువ్వు ఎంతసేపు ఆడుకోవాలనుకున్న ఆడుకో అని అంటారు. అప్పుడు ఇద్దరూ కలిసి ఆడుకుంటారు. అప్పుడు సామ్రాట్ లాస్య తో, సరైన సమయానికి లక్కీని తీసుకొని వచ్చారు, మా బాధ తెలుసుకున్నారు థాంక్యూ అని అనగా, మేము మిమ్మల్ని ఫ్రెండ్స్ లాగే అనుకున్నాము సార్ ఇంతకీ హనీ టిఫిన్ చేసిందా అని అడగంగా లేదు చేయలేదు అని అంటాడు సామ్రాట్. నేను వెళ్లి పెడతాను అని లాస్య అనేలోగా తులసి ఆటో దిగుతూ అక్కడికి వస్తుంది. నేను ముందే ఊహించా ఇది వస్తుంది అని లాస్య నందుతో అంటుంది.
 

 సామ్రాట్ వాళ్ళ బాబాయ్, బ్యాగులో ఏముంది అని అనగా,హనీ కోసం టిఫిన్ చేసుకొని తీసుకువచ్చాను ఇంట్లో భోజనం చేస్తే హనీకి నచ్చుతుంది కదా అని అంటుంది తులసి. అప్పుడు హనీ ఏది అని తులసి అడగగా, లక్కీ తో ఆడుకుంటున్నాడు అని అంటుంది లాస్య. లక్కీ కూడా వచ్చడా! అని చెప్పి వాళ్ళని చూడడానికి వెళుతుంది తులసి. లోపలికి వెళ్ళిన వెంటనే తులసిని చూసి హనీ పరిగెత్తుకుంటూ వస్తుంది. రండి ఇద్దరికీ వెళ్లి టిఫిన్ పెడతాను. మీకోసం ఉప్మా పెసరట్టు చేశాను అని అంటారు.
 

వాళ్ళు టిఫిన్ చేస్తున్నప్పుడు నందు లాస్యలు మేము ఇంకా బయలుదేరుతాము ఆఫీస్ కి వెళ్ళాలి అని అనగా, మీకు చెప్పడం మర్చిపోయాను రేపటి నుంచి ఆఫీస్ ఇంట్లోనే.హనికి తగ్గేంత వరకు నేను ఇల్లు కదలాలనుకోవడం లేదు అని అంటారు. ఆ తర్వాత సీన్లో హనీ,లక్కీ ఇద్దరు స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో హనీకి దాహం వే, లక్కీ వచ్చి నీళ్ళు తాగిపిస్తాడు. ఈ సంఘటన చూస్తున్న సామ్రాట్ చాలా ఆనంద పడుతూ ఉంటాడు.ఇంతలో తులసి అక్కడికి వచ్చి  సంతోషపడుతున్నారా అని అనగా,ఎంత సంతోషంగా ఉన్నా, రాత్రికి అందరూ తిరిగి వెళ్ళిపోవాల్సిందే కదా అండి, మళ్లీ రాత్రికి మాకు ఒంటరి బతుకులే అని అనగా దీనికే నేను ఒక పరిష్కారం ఆలోచించాను. ఈరోజు నుంచి హనీకి తగ్గేంత వరకు మా ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నాము. 

అప్పుడు అందరూ కలిసి హనీ నీ బాగా చూసుకుంటాను అని అంటుంది. దానికి సామ్రాట్, హానీ నీ తీసుకెళ్లడం నాకు ఇష్టమే కానీ హనీ నీ చూడకుండా నేను ఉండలేను. హనీ నాకున్న ఏకైక వీక్నెస్ నాకు ఇంకొక చిన్న కోరిక ఉన్నది కావాలంటే మీ కుటుంబంతో సహా ఇక్కడకి వచ్చి ఉండొచ్చు కదా,అలాగే హానికీ మీ అందరి మధ్య ఉండడం ఇష్టం, నాకు హానిని చూడడం ఇష్టం అని అనగా నేను ఇంట్లో వాళ్ళని కనుక్కొని చెప్తాను అని అంటుంది తులసి. ఆ తర్వాత సీన్లో నందు లాస్యలు ఇంట్లో కూర్చొని, అయినా ఇంట్లో ఆఫీసు పెట్టడం ఏంటి? రేపటి నుంచి తులసి,సామ్రాట్ ని చూస్తే తట్టుకోలేము అని అనుకుంటారు. ఇంతలో లాస్య, అయినా లక్కీ హానితో కలిసి మంచి పని చేశాడు.
 

ఈ విధంగానైనా మనకి ఏదైనా లాభాలు రావచ్చు రేపటి నుంచి మనం కూడా అక్కడ వీలైనంతవరకు సామ్రాట్ ని మన వైపు లాగడానికి ప్రయత్నించాలి అని అనుకుంటుంది. మరోవైపు ఇంట్లో వాళ్ళందరూ సామ్రాట్ వాళ్ళ ఇంటికి వెళ్లడానికి ఒప్పుకున్నా సరే అభి మాత్రం అసలు ఒప్పుకోడు. అయినా చాలామంది ఉన్నారు కదా అమ్మ హ నీ చూసుకోవడానికి నువ్వు వెళ్లాల్సిన అవసరం ఏంటి అని అడగా, నీకు ఇప్పుడు ఏమైంది అభి అందరూ వెళ్తున్నాం అంటున్నారు కదా నువ్వు ఒక్కడికే ఎందుకు రాలేకపోతున్నావు అయినా హనీకి బాలేదనే కదా, మళ్లీ బాగున్నాక తిరిగి వచ్చేద్దాము అని అంటారు.అభి మాత్రం ఒప్పుకోడు. మరోవైపు లాస్య కూడా నందుని అక్కడికి వెళ్లడానికి ఒప్పించే ప్రయత్నాలు చేస్తుంది. ఇంతలో ప్రేమ్ అభితో మనందరం కలిసి అక్కడికి వెళ్ళమంటావా, లేకపోతే అమ్మను ఒక్కదానినే వెళ్ళమంటావా అని అడగగా అది అస్సలు కుదరదు అని అంటాడు అభి.

అప్పుడు తులసి, విను అభి అందరం కలిసి అక్కడికి వెళ్దాము నీకు ఏ లోటున్న చెప్పు తిరిగి వచ్చేద్దామని అంటుంది. మరోవైపు లాస్య కూడా నందుని హనీ వాళ్ళ ఇంటికి వెళ్లడానికి ఒప్పిస్తుంది. ఆ తర్వాత సీన్లో సామ్రాట్ మందు తాగుతూ ఉంటాడు. అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ వచ్చి, నీకు అతి  సంతోషం వేసిన, లేకపోతే అతి బాధ వేసిన మందు తాగుతావు,ఏమైంది రా అని అనగా, హనీకి దెబ్బ తగలడం ఒకందుకు మంచిదయింది బాబాయ్ దాని వల్లనైనా అందరూ మన ఇంటికి వస్తున్నారు. అందరూ కలిసి హాయిగా గడపొచ్చు హనీకి ఒంటరితనం పోతుంది అని అంటారు. అప్పుడు వాళ్ళ బాబాయ్, నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా రా పనికి ఒంటరితనం ఉండదు అని అనగా,నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు బాబాయ్ సంతోషమైన సమయాన్ని పాడు చేయడానికి వచ్చావా అని తిడతాడు సామ్రాట్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తరువాయి భాగం లో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!