జయసుధ అన్నయ్య అని పిలిచే ఇద్దరు హీరోలు ఎవరు? వాళ్ళు మాత్రమే ఎందుకు ?

Published : Aug 13, 2025, 08:09 AM IST

సహజనటి జయసుధ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరినీ బంధుత్వం కలుపుకుని మాట్లాడదు. ఎంత వరకూ ఉండాలో అంత వరకే ఉంటారు . కాని ఇద్దరు హీరోలను మాత్రం అన్నయ్య అని పిస్తుంది. వారిని మాత్రమే ఎందుకు అన్నయ్య అని పిస్తుందో తెలుసా? 

PREV
16

సహజనటి జయసుధ

తెలుగు సినిమా పరిశ్రమలో సహజనటిగా తనదైన ముద్ర వేసుకున్న నటి జయసుధ. జయసుధ.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సహజనటిగా పేరు తెచ్చుకున్న ఏకైక తార. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల మనస్సుల్లో ఆమె స్థానం చెరిపినా చెరగనిది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు జయసుధ. హీరోయిన్ కు ఉండాల్సిన అందం, అభినయంతో పాటు.. ట్రెండ్ కు తగ్గట్టు తనను తానుమలుచుకుని.. ఇప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న తార జయసుధ.

DID YOU KNOW ?
ఎమ్మెల్యేగా జయసుధ
సహజనటి జయసుధ రాజకీయాల్లో కూడా రాణించారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసి, 2009 - 14 మధ్య సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు.
26

హీరోయిన్ ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా

గడచిన ఐదు దశాబ్దాలుగా హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, అమ్మగా, అమ్మమ్మగా కూడా నటించి ఏ పాత్ర ఇచ్చినా అద్భుతంగా రాణించారు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు వంటి దిగ్గజ హీరోల సరసన నటించిన జయసుధ, ఆపై చిరంజీవి, మోహన్ బాబు, మురళీమోహన్ లాంటి కొత్త తరం హీరోలతో కూడా తెరపై సందడి చేశారు. తెలుగుతో పాటు ఆమె తమిళ సినిమాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

36

రాజకీయాల్లో రాణించిన నటి

సినిమా రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ అడుగుపెట్టిన జయసుధ, గతంలో కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా కూడా సేవలందించారు. పలు పార్టీలు మారుతూ వచ్చిన జయసుధ ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. అయితే ఇటీవల సినిమాల సంఖ్య తగ్గించిన ఆమె, ప్రత్యేకత ఉన్న పాత్రలకు మాత్రమే ఓకే చెబుతున్నారు. అప్పుడప్పుడు నటిస్తూ, సినిమా కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఇంటర్వ్యూలు ఇస్తూ కాలం గడిపేస్తున్నారు జయసుధ. ఇక ఆమధ్య కాలంలో ఆమె ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణంతో పాటు వ్యక్తిగత అనుభవాలను ఆమె పంచుకున్నారు.

46

జయసుధ అన్నయ్య పిలిచేది ఆ హీరోలనే

ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ, “తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేను నిజంగా ‘అన్నయ్య’గా పిలిచే వ్యక్తులు ఇద్దరే ఉన్నారు, వారు మరెవరో కాదు... సీనియర్ నటులు మురళీ మోహన్ , మోహన్ బాబు. “వాళ్ళిద్దరూ నన్ను చెల్లెల్లుగా చూస్తారు. వాళ్లు మాత్రమే నన్ను ‘చెల్లెమ్మా’ అని పిలుస్తారు. అందుకే వాళ్లను నా కుటుంబ సభ్యుల్లా భావిస్తాను, ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరినీ కుటుంబ సభ్యులుగా పరిగణించను, ఎవరితో ఎక్కడివరకు అనుబంధం ఉందో, అక్కడివరకే ఉంటాను. అందరినీ అన్నయ్య, అక్క అని పిలిచే అలవాటు నాకు లేదు,” అని జయసుధ స్పష్టం చేశారు.

56

ఇద్దరు హీరోలతో సూపర్ హిట్ సినిమాలు

మురళీమోహన్, మోహన్ బాబుతో కలిసి జయసుధ అనేక హిట్ చిత్రాల్లో నటించారు. ‘అర్ధాంగి’, ‘దేవత’, ‘శ్రీమతిగారు’, ‘ఓ తండ్రి తీర్పు’, ‘ఏడడుగుల బంధం’, ‘నా మొగుడు నాకు సొంతం’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో వీరి కాంబినేషన్ ప్రేక్షకులను మెప్పించింది. ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు గతంలో వైరల్ అయ్యాయి. జన్యూన్ గా ఆమె చెప్పిన మాటలు నెటిజన్ల నుంచి ప్రశంసలు వచ్చేలా చేశాయి. రకరకాల కామెంట్లు కూడా వచ్చాయి.

66

పర్సనల్ లైఫ్ లో విషాదం

ఇండస్ట్రీలో తిరుగులేని సక్సెస్ చూసిన జయసుధ.. పర్సనల్ లైఫ్ లో మాత్రం కొన్నిఒడిదుడుకులు చూసింది. నిర్మాత నితిన్ కపూర్ ను పెళ్ళాడింది జయసుధ, వారికి ఇద్దరు కుమారులు కాగా.. పెద్ద కొడుకుని హీరోగా పరిచయం చేయాలని చూసిందిజయసుధ. ఇక జయసుధ భర్త నితిన్ కపూర్ పర్సనల్ కారణాల వల్ల 2017 లో ఆత్మహత్య చేసుకుని మరణించారు.

Read more Photos on
click me!

Recommended Stories