శోభన్ బాబు ఫ్యామిలీ కథలతో తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకున్నారు. ఆయన ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలతోనే స్టార్‌గా ఎదిగారు. మధ్య మధ్యలో యాక్షన్ సినిమాలు, పౌరాణికాలు చేసినా, ప్రేమ కథలు, కుటుంబం, భార్యాభర్తల, ప్రేమికుల చుట్టూ తిరిగే కథలే ఆయన్ని స్టార్‌ని చేశాయి. సూపర్ స్టార్‌గా నిలిపాయి. తిరుగులేని సోగ్గాడిగా కీర్తించేలా చేశాయి. అయితే ఫ్యామిలీ స్టోరీతోనే సూపర్ స్టార్ రజనీకాంత్‌కి చుక్కలు చూపించారు సోగ్గాడు. ఆ కథేంటో చూద్దాం.
DID YOU KNOW ?
రజనీ పారితోషికం
`కూలీ` సినిమాకి సూపర్ స్టార్ రజనీకాంత్ రూ.150కోట్ల పారితోషికం తీసుకున్నారని సమాచారం. సన్ పిక్చర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది.
25
రివేంజ్ స్టోరీతో సూపర్ హిట్ కొట్టిన శోభన్ బాబు
శోభన్ బాబు సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి `సర్పయాగం`. తన రెగ్యూలర్ జోనర్‌కి భిన్నమైన జోనర్ మూవీ ఇది. రివేంజ్ క్రైమ్ డ్రామాగా వచ్చింది. తన కూతురు రేప్‌కి గురికావడంతో తట్టుకోలేని తండ్రి ఈ ఘటనకు కారణమైన వారిని అంతం చేసేందుకు సీరియల్ కిల్లర్‌గా మారిన కథాంశంతో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ దర్శకత్వం వహించారు. రామానాయుడు నిర్మించిన ఈ చిత్రంలో వాణి విశ్వనాథ్, రేఖ, రోజా హీరోయిన్లుగా నటించారు. 1991, నవంబర్ 1న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.
35
`దళపతి`తో సంచలనాలు సృష్టించిన రజనీకాంత్
ఈ మూవీకి విడుదలైన నాలుగు రోజుల్లోనే రజనీకాంత్ సినిమా వచ్చింది. రజనీకాంత్‌తోపాటు మమ్ముట్టి హీరోలుగా నటించిన `దళపతి` మూవీ 1991 నవంబర్ 5న విడుదలైంది. ఈ సినిమాలో అరవింద్ స్వామి కీలక పాత్ర పోషించగా, భాను ప్రియా, శోభన, శ్రీ విద్య హీరోయిన్లుగా నటించారు. మణిరత్నం రూపొందించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా సంచలన విజయం సాధించింది. తెలుగులోనూ సూపర్ హిట్‌గా నిలిచింది. కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికీ ఈ సినిమా ఎవర్ గ్రీన్ గా నిలిచిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
`దళపతి`కి బాక్సాఫీసు వద్ద చుక్కలు చూపించిన `సర్పయాగం`
అయితే శోభన్ బాబు నటించిన `సర్పయాగం` మూవీ వచ్చిన నాలుగు రోజుల గ్యాప్‌తోనే రజనీకాంత్ `దళపతి` విడుదలైంది. ఏక కాలంలో తమిళంతోపాటు తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. తెలుగులో ఇది సోగ్గాడి `సర్పయాగం`తో పోటీపడాల్సి వచ్చింది. `దళపతి` సునామీ ముందు తట్టుకొని నిలబడింది. అదే సమయంలో కొంత వరకు `దళపతి`ని దెబ్బకొట్టింది. అప్పట్లో శోభన్ బాబు రేంజ్ ఏంటో చూపించింది. ఆడియెన్స్ రజనీ మూవీకి క్యూ కడుతున్నా, `సర్పయాగం` సైతం ఆ పోటీని తట్టుకుని నిలబడి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇలా రజనీకాంత్‌కి సోగ్గాడు తన రేంజ్ ఏంటో చూపించిందని చెప్పొచ్చు.
55
`కూలీ`తో రాబోతున్న రజనీకాంత్
ఇక ప్రస్తుతం `కూలీ` సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు రజనీకాంత్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నాగార్జున, అమీర్ ఖాన్, శృతి హాసన్ నటిస్తుండటం విశేషం. ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కాబోతుంది. అటు ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ల `వార్ 2`తో తలపడుతుంది. ఈ రెండింటి మధ్య క్లాష్‌లో ఏది నిలబడుతుందో చూడాలి.