బాలీవుడ్ యువ నటి జాన్వీ కపూర్ తన తల్లి, సూపర్ స్టార్ శ్రీదేవిని కోల్పోయిన బాధను తరచుగా గుర్తుచేసుకుంటూ, భావోద్వేగానికి లోనయ్యింది. మాతృదినోత్సవం సందర్భంగా ఆమె పాత ఇంటర్వ్యూ ఒకటి మళ్ళీ వెలుగులోకి వచ్చింది. శ్రీదేవి మరణం తర్వాత, తన చెల్లెలు ఖుషీ కపూర్ తనకు ఎలా ఓదార్పునిచ్చిందో ఆమె వివరించింది.
2018లో శ్రీదేవి మరణం భారతదేశానికే షాక్ ఇచ్చింది. ఆ సమయంలో తనలో ఏర్పడిన శూన్యాన్ని వివరిస్తూ జాన్వీ, "ఏం జరుగుతుందో, ఇంకేం చేయాలో అర్థం కాలేదు. కానీ, నా చెల్లెలు ఖుషీ, నాకన్నా చిన్నదైనా, నన్ను ఓదార్చడానికి తను ఏడవకుండా ఉంది. ఆమె నాకన్నా ధైర్యంగా, పరిణతితో వ్యవహరించింది" అని చెప్పింది. చెల్లెలి లో ఈ ఊహించని ధైర్యం, మద్దతు ఆ సమయంలో తనకు చాలా బలంగా నిలిచిందని జాన్వీ గుర్తుచేసుకుంది.