అప్పుడు రామచంద్ర మీదేమో ఆటోలు కాలేజీకి వెళ్తానని చెప్పారు అమ్మకి కాలేజీ లేదని చెప్పారు మీ ప్రిన్సిపల్ మేడం కాల్ చేసి ముఖ్యమైన పరీక్షలు ఉన్నాయి క్లాస్ కి అటెండ్ కావాలని చెప్పారు. మీరేమో చదువు మానేసి ఇంట్లో అన్ని పనులు చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది జానకి గారు అని అనడంతో, మీరు అన్నదే జరుగుతోంది మీరు కోరుకున్నదే చేస్తున్నాను రామచంద్ర గారు అని అంటుంది జానకి. నేను ఏమన్నాను ఏం కోరుకున్నాను అనడంతో,ఆరోజు మీరు ఏమన్నారో గుర్తు ఉందా ఫ్యామిలీ కావాలా చదువు కావాలా అన్నారు నాకు ఫ్యామిలీ కావాలనిపించింది అందుకే చదువు వద్దనుకున్నాను అనడంతో రామచంద్ర షాక్ అవుతాడు.